MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/star-heroes-education-qualification9ff9cb5f-9142-47cb-88b8-bbfcf7896631-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/star-heroes-education-qualification9ff9cb5f-9142-47cb-88b8-bbfcf7896631-415x250-IndiaHerald.jpgఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మన జీవితంలో అతి ప్రాముఖ్యతను పెంచుతుంది . మనల్ని ఎవరైనా కలిసినప్పుడు లేదా మనం ఎవరినైనా కలిసినప్పుడు ముందుగా అడిగేది ప్రశ్న ఏం చదువుకున్నావ్? ఏం చేస్తుంటావ్?.. నిజమే కదా.. మరి మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఏం చేస్తుంటారో? అంటే మాత్రం మనకు సోషల్ మీడియా ద్వారా తెలుస్తూనే ఉంటుంది. కానీ వారి చదువులు ఏంటో?అనేది మాత్రం ఎవరికీ తెలియదు. అయితే మన హీరోల విద్యార్హతలు ఏంటో ఇప్పుడు చూద్దామా.. star heroes,education qualification;education;chiranjeevi;ntr;venkatesh;balakrishna;nagarjuna akkineni;dr rajasekhar;jeevitha rajaseskhar;krishna;nageshwara rao akkineni;hyderabad;india;tollywood;district;cinema;rajani kanth;media;degree;christian;qualification;nandamuri taraka rama rao;college;reddyతెలుగు సినీఇండస్ట్రీలో అప్పటి స్టార్ హీరోల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా?తెలుగు సినీఇండస్ట్రీలో అప్పటి స్టార్ హీరోల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా?star heroes,education qualification;education;chiranjeevi;ntr;venkatesh;balakrishna;nagarjuna akkineni;dr rajasekhar;jeevitha rajaseskhar;krishna;nageshwara rao akkineni;hyderabad;india;tollywood;district;cinema;rajani kanth;media;degree;christian;qualification;nandamuri taraka rama rao;college;reddySun, 24 Jan 2021 14:40:00 GMTక్వాలిఫికేషన్ అనేది మన జీవితంలో అతి ప్రాముఖ్యతను పెంచుతుంది . మనల్ని ఎవరైనా కలిసినప్పుడు లేదా మనం ఎవరినైనా కలిసినప్పుడు ముందుగా అడిగేది ప్రశ్న ఏం చదువుకున్నావ్? ఏం చేస్తుంటావ్?.. నిజమే కదా.. మరి మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఏం చేస్తుంటారో? అంటే మాత్రం మనకు సోషల్ మీడియా ద్వారా తెలుస్తూనే ఉంటుంది. కానీ వారి చదువులు ఏంటో?అనేది మాత్రం ఎవరికీ తెలియదు. అయితే మన హీరోల విద్యార్హతలు ఏంటో ఇప్పుడు చూద్దామా..

నందమూరి తారక రామారావు:
సీనియర్ ఎన్టీఆర్ గుంటూరు ఆంధ్రా  క్రిస్టియన్ కాలేజ్ నుంచి బిఏ చేశారు. ఆ తర్వాత మద్రాసు సర్వీసు కమీషను పరీక్ష రాసిన పదకొండు వందల మంది అభ్యర్థులలో ఏడుగురిని ఎంపిక చేస్తే, వారిలో ఒకడిగా నిలిచాడు. అయితే నటన పై ఉన్న ఆసక్తి కారణంగా సబ్ రిజిస్టర్ ఉద్యోగాన్ని వదిలేశాడు.

అక్కినేని నాగేశ్వరరావు:
అక్కినేని నాగేశ్వరరావు చదివింది కేవలం మూడో తరగతి వరకు మాత్రమే. ఆయనకున్న నటనపై ఆసక్తి, తిరిగి చదువుల వైపు మళ్లేలా చేయలేదు. ఇక చదువుకు దూరంగా ఉంటూ నాటకాలు,సినిమాలలో నటించేవాడు.

కృష్ణ:
సూపర్ స్టార్ కృష్ణ ఏలూరు లోని సి.ఆర్.రెడ్డి కాలేజి నుండి డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఇంజనీరింగ్ సీటు కోసం ఎంత ప్రయత్నించినా రాకపోవడంతో సినిమాల్లోకి వచ్చాడు.

శోభన్ బాబు:
శోభన్ బాబు  బీ ఏ  పూర్తిచేసి, "లా "జాయిన్ అయ్యాడు.  ఆ తరువాత సినిమాలపై ఉన్న ఆసక్తితో మధ్యలోనే  చదువును ఆపేశాడు.

చిరంజీవి:
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం లోని వై.ఎన్.కాలేజీ నుండి బి.కామ్  పట్టా అందుకున్నాడు.

బాలకృష్ణ:
బాలకృష్ణ హైదరాబాద్ నిజాం కాలేజీలో బీకాం పూర్తి చేశాడు.

వెంకటేష్:
విక్టరీ వెంకటేష్ అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశారు. ఆ  తరువాత ఇండియా వచ్చి కలియుగ పాండవులు సినిమా సినీ ప్రయాణం మొదలుపెట్టాడు.

నాగార్జున:
నాగార్జున మిచిగాన్ యూనివర్సిటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో  ఎమ్.ఎస్ చేశాడు. ఇక నటన పై ఉన్న ఆసక్తి కారణంగా యాక్టింగ్ పై శిక్షణ కూడా తీసుకున్నాడు.

రాజశేఖర్:
రాజశేఖర్ ఎంబిబిఎస్ పూర్తి చేశాడు. ఆ తర్వాత యాక్టర్ అయ్యాడు.




కేటిఆర్ అడగకుండానే చేసాం... కేంద్రం ఘాటు సమాధానం

చిత్తూరులో ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే.. వైసీపీలో ర‌గ‌డ‌

ఊర్వశితో మహేష్ రొమాన్స్ ?

యాంకర్ ప్రదీప్ ఒక నెలకు ఎంత సంపాదిస్తున్నాడు..?

ఆయనకు ఇద్దరు.. ఈ 10 మంది స్టార్స్‌కు తండ్రి ఒక్కడే కానీ తల్లి వేరు...?

Shocking news: నేను ఐశ్వర్యారాయ్ కి పుట్టిన మొదటి కొడుకు ..!

ఈ ఫోటో లో ఉన్న పాపా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>