PoliticsSiva Prasadeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/election-commission50724a2b-f261-440e-86a1-70a86af25b4c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/election-commission50724a2b-f261-440e-86a1-70a86af25b4c-415x250-IndiaHerald.jpgఎన్నికల నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టులో ఏటువంటి తీర్పు వస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ రేగుతుంది. ముఖ్యంగా రాష్ర్ట ఎన్నికల కమిషనర్ కు సహకరించని ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కోర్టు ఏ విధంగా స్పందిస్తుందోనని సదరు ఉద్యోగుల్లో కూడా టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు తమ వెర్షన్ ను మీడియాతో పంచుకుంటున్నారు. ఎన్నికల కమిషన్‌, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరాటంలో ఉద్యోగులు బలవుతున్నారని ఏపీ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి అన్నారు. election commission;ramakrishna;andhra pradesh;court;letter;cpi;nirbaya‘‘ప్రభుత్వానికి, ఎస్ఈసీకి మధ్య ఉద్యోగులు బలవుతున్నారు’’‘‘ప్రభుత్వానికి, ఎస్ఈసీకి మధ్య ఉద్యోగులు బలవుతున్నారు’’election commission;ramakrishna;andhra pradesh;court;letter;cpi;nirbayaSun, 24 Jan 2021 16:58:48 GMTఎన్నికల నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టులో ఏటువంటి తీర్పు వస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ రేగుతుంది. ముఖ్యంగా రాష్ర్ట ఎన్నికల కమిషనర్ కు సహకరించని ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కోర్టు ఏ విధంగా స్పందిస్తుందోనని సదరు ఉద్యోగుల్లో కూడా టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు తమ వెర్షన్ ను మీడియాతో పంచుకుంటున్నారు. ఎన్నికల కమిషన్‌, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరాటంలో ఉద్యోగులు బలవుతున్నారని ఏపీ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనేదే ఎస్ఈసీ ఉద్దేశమని ఆరోపించారు. కరోనా లేని సమయంలో ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీకి కూడా నమ్మకం లేదన్నారు. ఓటర్ల జాబితా లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగులను అడ్డం పెట్టుకుని కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ఉద్యోగులపై ఎదురుదాడి చేయడం మంచి పద్ధతి కాదని ఆయన వ్యాఖ్యానించారు. తాను రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి మాత్రమే చెప్పానని, ఎవరిపైనా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. తనపై నిఘా పెట్టాలని డీజీపీకి ఎస్‌ఈసీ లేఖ రాయడం సరికాదన్నారు. తన ప్రాణాలకు రక్షణ కావాలని డీజీపీని కోరతానన్నారు. కరోనా వ్యాక్సినేషన్ తర్వాత ఎన్నికలు జరపాలని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.‌
  అయితే ప్రభుత్వ ఉద్యోగులు రాజ్యాంగబద్ధంగా విధుల్లో పాల్గొనాలని మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తితో అందరూ పనిచేయాలన్నారు. ఉద్యోగులు ప్రాణాలు త్యాగం చేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. ప్రభుత్వాన్ని, ఎస్ఈసీని నిర్భయంగా అడిగి తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. అదేవిధంగా రాష్ర్ట ఎన్నికల కమిషనర్ కు ప్రభుత్వ యంత్రాంగం సహకరించాలని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. ఈ విధంగా ఎస్ఈసీకి సహకరించమని ప్రభుత్వ ఉద్యోగులకు కొందరు సూచిస్తున్నారు. అయితే విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లే సరికి ఏం జరుగుతుందోనన్న టెన్షన్ ఉద్యోగుల్లో పెరుగుతున్నట్లు తెలుస్తోంది.


సమంత సినిమా కోసం భారీ ప్లాన్..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైఎస్ కు ఐవైఆర్ నివేదిక‌.. వేద‌పండితులపై మ‌హానేత ఉదార‌త‌.. కానీ..!

మెగాహీరో రామ్ చరణ్ కు జోడి దొరికిందోచ్..!

జయప్రద ను పెళ్లయిన కాపురం చేయకుండా, పిల్లలను కననివ్వకుండా నరకం చూపించిన ఆ వ్యక్తి ఎవరు ..?

"ది బెస్ట్ సీఎం" జగనోరు...ఏమి సాధించాడో తెలుసా...?

18 ఏళ్ళు చిన్న అయినా హీరోయిన్ తో సహజీవనం చేస్తున్న టాలీవుడ్ విలన్ రాహుల్ దేవ్

చిత్తూరులో ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే.. వైసీపీలో ర‌గ‌డ‌




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva Prasad]]>