PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bandi-sanjay-success-in-telangana-but-somu-veeraju-fail-in-ap590d075b-e7a7-4f82-ab81-ec0bd35106fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bandi-sanjay-success-in-telangana-but-somu-veeraju-fail-in-ap590d075b-e7a7-4f82-ab81-ec0bd35106fc-415x250-IndiaHerald.jpgకేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ..రెండు తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని ఎప్పటి నుంచో చూస్తున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో రెండోసారి గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఏపీ, తెలంగాణల్లో కమలదళం దూకుడుగా ఉండటం మొదలుపెట్టింది. ప్రతిపక్షాలకు చెందిన నాయకులని తమవైపు తిప్పుకుంటూ, అధికార పార్టీలకు చెక్ పెట్టాలని చూస్తుంది. అయితే ఈ విషయంలో ఏపీ కంటే తెలంగాణ కమలదళం ముందుందని చెప్పొచ్చు. bandi sanjay;kcr;tiru;bharatiya janata party;andhra pradesh;telangana;congress;2019;tirupati;husband;cheque;tdp;central government;ycp;dookuduతెలంగాణలో ‘బండి’ లాగుతున్నారు...కానీ ఏపీలో ‘సోము’కు సెట్ అవ్వట్లేదా?తెలంగాణలో ‘బండి’ లాగుతున్నారు...కానీ ఏపీలో ‘సోము’కు సెట్ అవ్వట్లేదా?bandi sanjay;kcr;tiru;bharatiya janata party;andhra pradesh;telangana;congress;2019;tirupati;husband;cheque;tdp;central government;ycp;dookuduSun, 24 Jan 2021 02:00:00 GMT2019 ఎన్నికల్లో రెండోసారి గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఏపీ, తెలంగాణల్లో కమలదళం దూకుడుగా ఉండటం మొదలుపెట్టింది. ప్రతిపక్షాలకు చెందిన నాయకులని తమవైపు తిప్పుకుంటూ, అధికార పార్టీలకు చెక్ పెట్టాలని చూస్తుంది. అయితే ఈ విషయంలో ఏపీ కంటే తెలంగాణ కమలదళం ముందుందని చెప్పొచ్చు.

తెలంగాణలో బండి సంజయ్ నాయకత్వంలోని బీజేపీ, అధికార టీఆర్‌ఎస్‌కు చెక్ పెట్టే స్థాయికి వెళ్లిపోయింది. ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో, జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. దుబ్బాకలో గులాబీ పార్టీని ఓడించిన కమలం...గ్రేటర్ హైదరాబాద్‌లో ఓడించినంత పనిచేసింది. అయితే తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా సత్తా చాటుతామని సోము వీర్రాజు నాయకత్వంలోని కమలదళం చెబుతోంది. అయితే పరిస్తితి చూస్తే అలా కనిపించడం లేదు. ఎందుకంటే తెలంగాణ రాజకీయం వేరు, ఏపీ రాజకీయం వేరు.

తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, సి‌పి‌ఐ,సి‌పి‌ఎం లాంటి పార్టీలని కేసీఆర్ తోక్కేయడం వల్ల, ఆటోమేటిక్‌గా కేంద్రంలో అధికారంలో బీజేపీ పైకి లేచింది. పైగా తెలంగాణ బీజేపీలో స్ట్రాంగ్ నాయకులు ఉన్నారు. కానీ ఏపీలో అధికార వైసీపీ బలంగా ఉంది. అలాగే ప్రతిపక్ష టీడీపీ కూడా స్ట్రాంగ్‌గా ఉంది. కాబట్టి ఏపీలో బీజేపీ పప్పులు ఉడకడం లేదు. పైగా ఏపీ బీజేపీలో బలమైన నేతలు లేరు.

ఎన్నికల్లో పోటీచేస్తే కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని స్థితిలో ఏపీ బీజేపీ ఉంది. అందుకే పవన్‌తో కలిసి ముందుకెళుతుంది. ఇలా ముందుకెళ్లిన వైసీపీ, టీడీపీ స్థాయిలో బీజేపీ లేదు. తక్కువ బలం ఉన్నాసరే తిరుపతి ఉపఎన్నికలో పోటీ చేసి గెలిచేస్తామని బీజేపీ నేతలు హడావిడి చేస్తున్నారు. కానీ పరిస్తితి చూస్తే అలా లేదు. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే తిరుపతిలో డిపాజిట్ కూడా రాదు. జనసేనతో కలిసి పోటీ చేస్తుంది కాబట్టి, డిపాజిట్ దక్కించుకునే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికైతే తెలంగాణలో బండి సత్తా చాటుతుంటే, ఏపీలో సోము చేతులెత్తేస్తున్నారు.




కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !

బీజేపీకి జనసేన దూరమౌతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>