EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/jaganbb357dec-8519-44e6-a239-6ef106645667-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/jaganbb357dec-8519-44e6-a239-6ef106645667-415x250-IndiaHerald.jpgరాజకీయాలు భలే విచిత్రంగా ఉంటాయి. ఎన్నికల ముందు.. ఎన్నికల తర్వాత పార్టీల వైఖరులు మారిపోతుంటాయి. కొందరు నేతలు రాజకీయ అవసరాల కోసం కొన్ని సామాజిక వర్గాలను వాడుకుని వదిలేస్తుంటారు.. ఏపీ సీఎం జగన్ బ్రాహ్మణ వర్గాన్ని అలాగే వాడుకుని వదిలేశారని ఆ వర్గం వారు ఇప్పుడు భావించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బ్రాహ్మణ వర్గం, ఆ వర్గంలోని ప్రముఖులు వైసీపీకి అండగా నిలిచారు. అప్పట్లో తిరుమల ఆలయ ప్రధానార్చకులుగా ఉన్న రమణ దీక్షితులకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని వైసీపీ jagan;ramana;tiru;jagan;andhra pradesh;hosta;indiaherald group;rbi;smart phone;tirupati;ycp;partyబ్రాహ్మణ ఘోష: జగనోరు.. అయ్యోర్లను వాడుకుని వదిలేశారా..?బ్రాహ్మణ ఘోష: జగనోరు.. అయ్యోర్లను వాడుకుని వదిలేశారా..?jagan;ramana;tiru;jagan;andhra pradesh;hosta;indiaherald group;rbi;smart phone;tirupati;ycp;partySun, 24 Jan 2021 21:12:29 GMTఏపీ సీఎం జగన్ బ్రాహ్మణ వర్గాన్ని అలాగే వాడుకుని వదిలేశారని ఆ వర్గం వారు ఇప్పుడు భావించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బ్రాహ్మణ వర్గం, ఆ వర్గంలోని ప్రముఖులు వైసీపీకి అండగా నిలిచారు.

అప్పట్లో తిరుమల ఆలయ ప్రధానార్చకులుగా ఉన్న రమణ దీక్షితులకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని వైసీపీ ఉపయోగించుకుందని విశ్లేషకులు అంటుంటారు. అప్పట్లో రమణ దీక్షితుల అంశాన్ని వైసీపీ బలంగా ఉపయోగించుకుంది.. రమణ దీక్షితులు కూడా అప్పట్లో బ్లూడైమండ్‌ ఏమైందని.. చంద్రబాబు హయాలంలో తిరుమల ఆస్తులకు రక్షణలేదని అన్నారు. ఈ కథనాలను వైసీపీ తన సొంత పత్రికలో ఏకధాటిగా రాయించింది.

అలా రమణ దీక్షితుల అంశాన్ని వైసీపీ బలంగా ఉపయోగించుకుంది. అయితే మళ్లీ జగన్ అధికారంలోకి వచ్చాక మాత్రం బ్రాహ్మణులపై చిన్నచూపు చూస్తోందని.. రాజకీయంగా హస్తం అందించకపోగా.. వేధింపులకు గురి చేస్తోందని ఆ వర్గం వారు బాధపడుతున్నారు. రాష్ట్రంలో పలు చోట్ల ఇప్పుడు బ్రాహ్మణులపై దాడులు జరుగుతున్నాయని.. సంబంధం లేని కేసులు అంటగడుతున్నారని  బ్రాహ్మణులు వాపోతున్నారు.

అంతే కాదు.. గతంలో బ్రాహ్మణ వర్గానికి చెందిన ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఐవైఆర్‌ వంటి అధికారులు, మాజీ అధికారులు జగన్‌కు అండగా నిలిచేవారు.. అప్పట్లో చంద్రబాబు సర్కారుకు  లోపాలను ఎత్తి చూపేవారు.. ఇప్పుడు అలాంటి వారు కూడా ఇప్పుడు జగన్ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇకనైనా జగన్ సర్కారు బ్రాహ్మణ వర్గం ఆవేదన పట్టించుకుంటుందా.. అండగా నిలుస్తుందా అన్నది వేచి చూడాలి.

బ్రాహ్మణులారా.. జాగృతం కండి
తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణులారా.. జాగృతం కండి. మీ హ‌క్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌పడుతున్నారే త‌ప్ప... మీ స‌మ‌స్యలు ప‌రిష్కరించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని గుర్తించండి. ప్రభుత్వాలు మారినా.. మీ స‌మ‌స్యలు మాత్రం తీర‌డం లేదు. ఎప్పటిక‌ప్పుడు స‌మ‌స్యలు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని ప‌రిష్కరించేందుకు ఏ ఒక్కరూ బాధ్యత‌లు తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మీ గ‌ళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ ముందుకు వ‌చ్చింది. బ్రాహ్మణుల స‌మ‌స్యలను ప్రభుత్వానికి చేర‌వేసేందుకు https://www.indiaherald.com/ ప్రయ‌త్నిస్తోంది. దీనిలో మీ భాగ‌స్వామ్యమే కీల‌కం. మీ స‌మ‌స్య ఏదైనా.. ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.

మీరు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్యను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..!


అఖిల్ కి మరింత టైం ఉందా.. వేసవికే బ్యాచులర్..?

ఇమ్మాన్యుయల్, వర్ష రిలేషన్ గురించి అదిరే అభి ఏమన్నాడు..?

కాపుల వేద‌న‌: క‌లిసిరాని మంత్రులు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఎలా ?

కాపుల వేద‌న‌: నాయ‌క‌త్వ శూన్య‌త‌తో ఇర‌కాటం.. రంగా హ‌యాం వ‌స్తుందా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైఎస్ కు ఐవైఆర్ నివేదిక‌.. వేద‌పండితులపై మ‌హానేత ఉదార‌త‌.. కానీ..!

మెగాహీరో రామ్ చరణ్ కు జోడి దొరికిందోచ్..!

జయప్రద ను పెళ్లయిన కాపురం చేయకుండా, పిల్లలను కననివ్వకుండా నరకం చూపించిన ఆ వ్యక్తి ఎవరు ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>