PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/venkatramireddy-chairman-of-the-government-employees-union-made-key-remarksa5d507e5-fdc7-4d91-b23b-639784a4f770-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/venkatramireddy-chairman-of-the-government-employees-union-made-key-remarksa5d507e5-fdc7-4d91-b23b-639784a4f770-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఉద్యోగులు అనుసరిస్తున్న వైఖరిపై ఇప్పుడు కొందరు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఉద్యోగులు కూడా ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ప్రాణాలను రక్షించుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చిందనే విషయాన్ని చెప్పాను అని అన్నారు. venktrami reddy,jagan,ycp,ap;jagan;andhra pradesh;bus;letter;tdp;local languageఅతనితోనే రాజకీయాలు ఆగిపోవాలని జగన్ భావించారు... ఉద్యోగ సంఘం నేత సంచలన వ్యాఖ్యలుఅతనితోనే రాజకీయాలు ఆగిపోవాలని జగన్ భావించారు... ఉద్యోగ సంఘం నేత సంచలన వ్యాఖ్యలుvenktrami reddy,jagan,ycp,ap;jagan;andhra pradesh;bus;letter;tdp;local languageSun, 24 Jan 2021 15:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఉద్యోగులు అనుసరిస్తున్న వైఖరిపై ఇప్పుడు కొందరు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఉద్యోగులు కూడా ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ప్రాణాలను రక్షించుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చిందనే విషయాన్ని చెప్పాను అని అన్నారు.

ప్రాణాలకు రాజ్యాంగం ఎంత  విలువ ఇచ్చిందనే  విషయాన్నే చెప్పాను అని అన్నారు. రాజ్యాంగంలో ఉన్న అంశాలను కాదనగలరా..? అని ఆయన ప్రశ్నించారు. కొందరు టీడీపీ నేతలు ఇష్టానుసారంగా నన్ను వాడూ వీడూ అంటున్నారు అని మండిపడ్డారు. నన్ను విమర్శించే టీడీపీ నేతలను నేను అరేయ్ ఒరేయ్ అనలేనా..? అని  నిలదీశారు. ఒళ్లు బలిసి కొట్టుకుంటున్నావని అనలేనా..? అంటూ ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీ చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు అని ఆయన మండిపడ్డారు. రేపు సుప్రీం ఎన్నికలు జరపమని తీర్పు ఇచ్చినా.. నామినేషన్ల ప్రక్రియ జరిగే పరిస్థితి ఉందా..? అని ప్రశ్నించారు.

ఎన్నికలు జరిగే వాతవరణం ఉందా..? అని ప్రశ్నించారు. సీనియరైన నిమ్మగడ్డకు ఇవన్నీ తెలీదా..? అని ఆయన నిలదీశారు. సిద్దంగా ఉన్న ఉద్యోగులతో ఎన్నికలు చేపట్టుకోవచ్చు అని సూచించారు. ఏవేవో కామెంట్లు చేసే టీడీపీ నేతలు సిద్దంగా ఉన్న ఉద్యోగులతో ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీకి లేఖ రాయగలరా..? అని ఆయన నిలదీశారు. ఉద్యోగులను బస్సులు పెట్టి పోలవరం తీసుకెళ్లారు.. నవ నిర్మాణ దీక్షలకు.. సత్యాగ్రహ దీక్షలకు తీసుకెళ్లారు అని, ఉద్యోగులను రాజకీయ అనసరాల కోసం వాడుకుంది టీడీపీనే అని మండిపడ్డారు. ఇప్పుడు టీడీపీలో ఉన్న ఓ ఉద్యోగ సంఘ నాయకుడు వల్లే ఉద్యోగులకు రాజకీయాలను ముడి పెట్టడం మొదలైంది అని విమర్శించారు. అతనితోనే ఈ రాజకీయం ఆగిపోవాలని సీఎం జగన్ కోరుకుంటున్నారు.. అందుకే ఉద్యోగులను రాజకీయాలకు దూరంగా ఉంచుతున్నారు అని అన్నారు.


జగన్ పై టీడీపీ అగ్ర నేత సంచలన వ్యాఖ్యలు... అంబేద్కర్ అంటే జగన్ కు కంపరం

చిత్తూరులో ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే.. వైసీపీలో ర‌గ‌డ‌

ఊర్వశితో మహేష్ రొమాన్స్ ?

యాంకర్ ప్రదీప్ ఒక నెలకు ఎంత సంపాదిస్తున్నాడు..?

ఆయనకు ఇద్దరు.. ఈ 10 మంది స్టార్స్‌కు తండ్రి ఒక్కడే కానీ తల్లి వేరు...?

Shocking news: నేను ఐశ్వర్యారాయ్ కి పుట్టిన మొదటి కొడుకు ..!

ఈ ఫోటో లో ఉన్న పాపా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>