PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/somu-veerraju-fired-on-ap-political-parties488cbe47-28c3-40ca-830d-479b7eb6db98-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/somu-veerraju-fired-on-ap-political-parties488cbe47-28c3-40ca-830d-479b7eb6db98-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బలపడే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తుంది. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ స్పీడ్ గా ముందుకు వెళ్తుంది. అదే స్పీడ్ తో ఆంధ్రప్రదేశ్ లో కూడా ముందుకు వెళ్ళాలి అని భావించినా సరే అందుకు అనుగుణంగా పరిణామాలు కనపడటం లేదని చెప్పాలి. ప్రధానంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలోsomu veeraju,bjp,ap;vishnu;bharatiya janata party;somu veerraju;amaravati;andhra pradesh;government;media;television;reddy;partyసోముకి నచ్చితేనే మీడియాతో మాట్లాడాలా...?సోముకి నచ్చితేనే మీడియాతో మాట్లాడాలా...?somu veeraju,bjp,ap;vishnu;bharatiya janata party;somu veerraju;amaravati;andhra pradesh;government;media;television;reddy;partySun, 24 Jan 2021 12:41:55 GMTఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బలపడే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తుంది. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ స్పీడ్ గా ముందుకు వెళ్తుంది. అదే స్పీడ్ తో ఆంధ్రప్రదేశ్ లో కూడా ముందుకు వెళ్ళాలి అని భావించినా సరే అందుకు అనుగుణంగా పరిణామాలు కనపడటం లేదని చెప్పాలి. ప్రధానంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలపరిచే క్రమంలో ఆయన అందరు నేతలను కూడా కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ కొంతమంది నేతలు మాత్రమే మీడియా ముందు కనపడుతున్నారు. ఎవరైనా సరే టీవీ డిబేట్ లో పాల్గొనాలి అన్న సరే కంగారుపడే పరిస్థితులు ఉన్నాయి అనే మాట వాస్తవం. వాస్తవానికి భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నాయకత్వ సమస్య ఎక్కువగా ఎదుర్కొంటుంది. సోము వీర్రాజుకి ప్రజల్లో ఆదరణ కూడా పెద్దగా లేదు. ఆయన ప్రసంగాలను కూడా పెద్దగా వినడానికి ప్రజలు ఆసక్తి చూపించే పరిస్థితి ఉండదు.

కాబట్టి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కానీ తనకు అనుకూలంగా ఉన్న నేతలతో మాత్రమే వీడియో సమావేశాలు ఏర్పాటు చేయించి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అమరావతి ఉద్యమం విషయంలో కూడా ఆయన ఒక్కరే మాట్లాడటం లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలు మినహా మిగిలిన ఎవరు కూడా పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. దీని కారణంగా అసలు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం బలంగా ఉందా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి. అసలు ఇతర నేతలు ఎందుకు ముందుకు రావటం లేదు అనే ప్రశ్నలు బిజెపి కార్యకర్తల నుంచి కూడా ప్రధానంగా వినబడుతున్నాయి.


డయాబెటిస్ రోగులు చేపలు తినవచ్చా?

ఈ ఫోటో లో ఉన్న పాపా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ..!

ఇక్కడ సహజీవనం వైపు పరుగులు - అక్కడ వివాహబంధం దిశగా అడుగులు: వివాహం వర్సెస్ సహజీవనం

భర్తే ఆ హీరోయిన్ కు వైన్ బాటిల్ ఇచ్చాడు...ఆ హీరోయిన్ ఎవరో తెలుసా...?

బ్రాహ్మణ ఘోష : జగన్ కి వారంతా రివర్స్ అవుతారా?

నెట్ ఫ్లిక్స్ ఆహా ల మధ్య పెరిగిపోతున్న వార్ !

చిరంజీవి నమ్మాడు.. బాలకృష్ణ నమ్మగలడా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>