SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsb7d4889e-7bfc-49e5-9dad-e29edca6e5d0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsb7d4889e-7bfc-49e5-9dad-e29edca6e5d0-415x250-IndiaHerald.jpgఇదిలాఉంటే చివరి మ్యాచ్‌ విజయం తరువాత టీమిండియా ప్లేయర్ల డ్రెస్సింగ్ రూమ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తాజాగా విడుదల చేయడంతో ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కెప్టెన్ అజింక్యా రహానే సహచర ఆటగాళ్లకు ఇచ్చిన స్పీచ్ అందరిని ఆకట్టుకుంటుంది. ఒక కెప్టెన్ గా జట్టును ముందుండిsports news;ravi anchor;varsha;india;australia;england;bcci;twitter;february;yuva;ravi shastriఅద్భుతమైన స్పీచ్ తో ఆకట్టుకున్న రహానే..!!అద్భుతమైన స్పీచ్ తో ఆకట్టుకున్న రహానే..!!sports news;ravi anchor;varsha;india;australia;england;bcci;twitter;february;yuva;ravi shastriSun, 24 Jan 2021 17:00:00 GMTఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ అద్భుత విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. నాలుగు టెస్టుల ఈ సిరీస్ లో కీలక ఆటగాళ్లు అందరూ జట్టుకు దూరమైన క్రమంలో అజింక్యా రహానే సారధిగా యువ జట్టును ముందుండి నడిపించి విజయతీరాలకు చేర్చాడు. సిరీస్ మొదటి నుండి కూడా ఆసక్తికరంగానే సాగింది. ఇరు జట్లకు విజయం దోబూచులాడుతూ చివరి వరకు ఉత్కంఠ రేపుతోంది. అయితే చివరి టెస్టులో యువ ఆటగాళ్ల అద్భుత పోరాటంతో భారత్ ట్రోఫీ అందుకుంది.

అంతటి ఘన విజయాన్ని టీమిండియా ప్లేయర్లు ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇదిలాఉంటే చివరి మ్యాచ్‌ విజయం తరువాత టీమిండియా ప్లేయర్ల డ్రెస్సింగ్ రూమ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తాజాగా విడుదల చేయడంతో ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కెప్టెన్ అజింక్యా రహానే సహచర ఆటగాళ్లకు ఇచ్చిన స్పీచ్ అందరిని ఆకట్టుకుంటుంది. ఒక కెప్టెన్ గా జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత తనపై ఉండడంతో ఆదర్శవంతమైన ప్రసంగం చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు .

ఈ సిరీస్‌లో పాల్గొన్న ప్రతి ప్లేయర్ పేరును ప్రస్తావిస్తూ అభినందనలు తెలిపాడు...తొలి టెస్టులో ఓటమి తరువాత మిగిలిన మూడు టెస్టులలో ఆటగాళ్లంతా కచ్చితంగా గెలవాలనే కసితో ప్రాణం పెట్టి ఆడారంటూ, ప్రతి ఒక్క ఆటగాడు కూడా తన అత్యుత్తమ ప్రదర్శనతో జట్టు గెలుపుకోసం తీవ్రంగా శ్రమించారని రహానే తన జట్టును కొనియాడారు. ఇది టీమిండియాకు గొప్ప విజయం. అందరి కృషి వల్లే ఇంతటి గొప్ప విజయాన్ని నమోదు చేయగలిగాం.’ అంటూ ఆటగాళ్లపై రహానే ప్రశంసలు గుప్పించాడు. జట్టు ప్రధాన కోచ్ అయిన రవి శాస్త్రి కూడా జట్టు యొక్క అద్భుత పోరాటాన్ని కొనియాడుతూ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక స్వదేశంలో ఫిబ్రవరి 5 నుండి ఇంగ్లాండ్ జట్టుతో పోరు ప్రారంభం కానుందిి
" style="height: 631px;">
.


సమంత సినిమా కోసం భారీ ప్లాన్..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైఎస్ కు ఐవైఆర్ నివేదిక‌.. వేద‌పండితులపై మ‌హానేత ఉదార‌త‌.. కానీ..!

మెగాహీరో రామ్ చరణ్ కు జోడి దొరికిందోచ్..!

జయప్రద ను పెళ్లయిన కాపురం చేయకుండా, పిల్లలను కననివ్వకుండా నరకం చూపించిన ఆ వ్యక్తి ఎవరు ..?

"ది బెస్ట్ సీఎం" జగనోరు...ఏమి సాధించాడో తెలుసా...?

18 ఏళ్ళు చిన్న అయినా హీరోయిన్ తో సహజీవనం చేస్తున్న టాలీవుడ్ విలన్ రాహుల్ దేవ్

చిత్తూరులో ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే.. వైసీపీలో ర‌గ‌డ‌




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>