MoviesK Sreekantheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalyan8bf7af27-a67f-4a79-aa40-120dd3f2e645-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalyan8bf7af27-a67f-4a79-aa40-120dd3f2e645-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే తెలుగు ఇండస్ట్రీలోనే స్టార్ హీరో. జనసేన అనే రాజకీయ పార్టీకి కూడా ఆయన అధినేత. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్‌కు, జనసేన పార్టీకి లక్షల్లో అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. పవన్ కల్యాణ్ పేరు చెబితేనే పిచ్చెక్కిపోయే అభిమానులు చాలా మంది ఉన్నారు. ఇదంతా అందరికి తెలిసిన విషయమే. pawankalyan;pawan;jeevitha rajaseskhar;nithya new;pawan kalyan;surekha vani;janasena;chicken;hero;neem;janasena party;ishtam;rekha vedavyasపవన్ కల్యాణ్‌కు ఈ వంటకం అంటే పిచ్చ ఇష్టమట.. ఎదురుగా కనబడితే..పవన్ కల్యాణ్‌కు ఈ వంటకం అంటే పిచ్చ ఇష్టమట.. ఎదురుగా కనబడితే..pawankalyan;pawan;jeevitha rajaseskhar;nithya new;pawan kalyan;surekha vani;janasena;chicken;hero;neem;janasena party;ishtam;rekha vedavyasSun, 24 Jan 2021 12:49:22 GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే తెలుగు ఇండస్ట్రీలోనే స్టార్ హీరో. జనసేన అనే రాజకీయ పార్టీకి కూడా ఆయన అధినేత. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్‌కు, జనసేన పార్టీకి లక్షల్లో అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. పవన్ కల్యాణ్ పేరు చెబితేనే పిచ్చెక్కిపోయే అభిమానులు చాలా మంది ఉన్నారు. ఇదంతా అందరికి తెలిసిన విషయమే. కానీ.. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంలోని కొన్ని విషయాలు చాలా మందికి తెలియదు. అలా తెలియని విషయాల్లో ఆయనకు బాగా నచ్చిన వంటకం. సామాన్యుడు అయినా.. స్టార్ హీరో అయినా వారికంటూ ప్రత్యేకంగా కొన్ని అభిరుచులు అనేవి ఉంటాయి.

పవన్ కల్యాణ్‌కు అదే విధంగా కొన్ని అభిరుచులు ఉన్నాయి. పవన్ కల్యాణ్‌కు అరటి కాయ వేపుడు అంటే ప్రాణం అంట. తన ముందు అరటి కాయ వేపుడు ఉంటే తినకుండా అస్సలు ఉండలేరట. అరటి కాయ వేపుడు కావాలా చికెన్, మటన్ బార్యానీ కావాలా అని అడిగితే తనకు అరటి కాయ వేపుడే కావాలనేంత ఇష్టమని చెబుతున్నారు. షూటింగ్ సమయాల్లో కూడా పవన్ కల్యాణ్ ఎక్కువగా అరటి కాయ వేపుడే తింటారని తెలుస్తోంది. సన్నగా, నిలువుగా కోసిన అరటి కాయ ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు వేసి దోరగా వేయించి ఆయన ముందు పెడితే నిమిషాల్లో లాగించేస్తారట.

పవన్ కల్యాణ్ ఎంతో ఇష్టంగా తినే ఆహార పదార్థాల్లో మొదటి స్థానం అరటి కాయ వేపుడుదే అని చెబుతున్నారు. తన తల్లి, వదిన సురేఖ పవన్ కల్యాణ్‌కు ఎప్పటికప్పుడు ఆయనకు ఇష్టమైన వంటకాన్ని చేసి పెడుతూనే ఉంటారని సన్నిహితులు చెబుతున్నారు. కాగా.. పవన్ కల్యాణ్ సినిమాలకు దూరమై మూడేళ్లు గడిచింది. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యారు. ఒకపక్క వరుస సినిమాలతో, మరోపక్క రాజకీయ సమస్యలను పోరాడుతూ నిత్యం బిజీ బిజీగా గడుపుతున్నారు.


టాక్ షో హోస్ట్ "ల్యారీ కింగ్" ఇక లేరు

Shocking news: నేను ఐశ్వర్యారాయ్ కి పుట్టిన మొదటి కొడుకు ..!

ఈ ఫోటో లో ఉన్న పాపా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ..!

ఇక్కడ సహజీవనం వైపు పరుగులు - అక్కడ వివాహబంధం దిశగా అడుగులు: వివాహం వర్సెస్ సహజీవనం

భర్తే ఆ హీరోయిన్ కు వైన్ బాటిల్ ఇచ్చాడు...ఆ హీరోయిన్ ఎవరో తెలుసా...?

బ్రాహ్మణ ఘోష : జగన్ కి వారంతా రివర్స్ అవుతారా?

నెట్ ఫ్లిక్స్ ఆహా ల మధ్య పెరిగిపోతున్న వార్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - K Sreekanth]]>