Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/bottle-gourdfa13e05a-7f47-48d2-ac97-6d5085fa02b5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/bottle-gourdfa13e05a-7f47-48d2-ac97-6d5085fa02b5-415x250-IndiaHerald.jpgసొరకాయను కూరల్లో వాడుతారు అని మనకి తెలుసు. కానీ సొరకాయ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.శరీరంలోని అధికవేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. సొరకాయలో అధిక శాతం నీరు ఉంటుంది.ఇందులో సోడియం తక్కువగా ఉండటం వల్ల అధిక రక్తపోటు, గుండెకు సంబంధించిన సమస్యలకు మంచి మందులా ఉపయోగపడుతుంది. సొరకాయను జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి.సొరకాయ లో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.. సొరకాయ జ్యూస్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి సొరకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల నిరోధక శక్తి పెరbottle gourd;tara;vitamin c;vitamin;heart;bp;cumin;sodium;dhaniya powder;shaktiసొరకాయ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా..!సొరకాయ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా..!bottle gourd;tara;vitamin c;vitamin;heart;bp;cumin;sodium;dhaniya powder;shaktiSun, 24 Jan 2021 08:00:00 GMT
 సొరకాయ జ్యూస్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి సొరకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల నిరోధక శక్తి పెరగడమే కాకుండా రక్త ప్రసరణ సక్రమంగా జరిగేటట్లు చేస్తుంది.

 తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవ్వడానికి సొరకాయ  జ్యూస్ సహాయపడుతుంది.ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది.

 సొరకాయ గింజలను తినడం వల్ల వీర్యవృద్ధి కలుగుతుంది.అలా జరగడానికి సొరకాయ గింజలను వేయించి, కొంచెం ఉప్పు, ధనియాల పొడి జీలకర్ర కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని అన్నంలో కలుపుకుని తినడం వల్ల వీర్య వృద్ధి కలుగుతుంది.

 సొరకాయలో జింక్ అధికంగా ఉంటుంది. ఇది గుండె పనితీరును  మెరుగుపరచడానికి సహాయపడుతుంది.బ్లడ్ ప్రెషర్ ని తగ్గించడానికి సహాయపడుతుంది.

యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు రోజు ఒక గ్లాసు సొరకాయ రసం లో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.

 సొరకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల అతిసార, మధుమేహ సమస్యలు తగ్గుతాయి. శరీరం అధిక మోతాదులో సోడియంను తగ్గకుండా చూస్తుంది.

 సొరకాయ తినటం వల్ల శరీరంలో వేడి,కఫం తగ్గడమే కాకుండా, దప్పికను నివారిస్తుంది. వాంతులు. విరేచనాలు ఉన్నవాళ్లు సొరకాయ జ్యూస్ తీసుకోవడం చాలా మంచిది.                                                                                                                             


జై శ్రీరామ్ నినాదాలు.. మమతా బెనర్జీ కి చేదు అనుభవం.?

దటీజ్‌ భారత్.. ప్రపంచమే జై కొడుతోందిగా..?

నిమ్మగడ్డను వెంటాడుతున్న పాత తప్పు..!- వైసీపీకి వరంగా మారిందా..?

తన కోసం కాదు .... తనయుడి కోసం రాయమన్నారట బాలయ్య .....??

నిమ్మగడ్డ చేసిన ఆ ఒక్క తప్పుతో.. అందరూ ఆడేసుకుంటున్నారు..!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: బొత్సని దాటి రాజన్న మంత్రి పోస్ట్ కొడతారా?

కొడాలితో డ్యామేజ్ అక్కడే...కానీ గుడివాడలో...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>