AutoSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/auto/scorpio_scorpio/maruthi-carscb849f4b-2695-4f0e-87a8-2a04f60a44e5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/auto/scorpio_scorpio/maruthi-carscb849f4b-2695-4f0e-87a8-2a04f60a44e5-415x250-IndiaHerald.jpgఇండియాలోని ఆటో మొబైల్ కార్లు రోజుకొకటి మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. ప్రముఖ కంపెనీలు గతంలో ఉన్న దానికన్నా మెరుగైన ఫీచర్లు ఉన్న కార్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 2020 లో ఎన్నో కంపెనీలు కార్లను మార్కెట్ లోకి విడుదల చేశారు. కరోనా కారణంగా కార్లు అనుకున్న స్థాయిలో సేల్ అవ్వలేదు. అన్నిటికన్నా ఎక్కువగా మారుతి కార్లు గత ఏడాదికి ఎక్కువగా అమ్ముడు పోయాయని తెలుస్తుంది.maruthi cars;auto;manu;maruti;shashank;india;2020;car;director;vegetable marketఇండియా లో బెస్ట్ సెల్లింగ్ కారు ఏదో తెలుసా..!!ఇండియా లో బెస్ట్ సెల్లింగ్ కారు ఏదో తెలుసా..!!maruthi cars;auto;manu;maruti;shashank;india;2020;car;director;vegetable marketSun, 24 Jan 2021 04:00:00 GMT ఆటో మొబైల్ కార్లు రోజుకొకటి మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. ప్రముఖ కంపెనీలు గతంలో ఉన్న దానికన్నా మెరుగైన ఫీచర్లు ఉన్న కార్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 2020 లో ఎన్నో కంపెనీలు కార్లను మార్కెట్ లోకి విడుదల చేశారు. కరోనా కారణంగా కార్లు అనుకున్న స్థాయిలో సేల్ అవ్వలేదు. అన్నిటికన్నా ఎక్కువగా మారుతి కార్లు గత ఏడాదికి ఎక్కువగా అమ్ముడు పోయాయని తెలుస్తుంది.



మారుతి సుజుకికి చెందిన వాహనం అత్యధిక అమ్ముడైన కారుగా నిలిచింది. కోవిడ్-19 సంక్షోభంలో కూడా మారుతి స్విప్ట్‌ టాప్‌ బ్రాండ్‌గా ఖ్యాతి దక్కించుకుంది. 2020 ఏడాదిలో లక్షా అరవై వేలకుపైగా విక్రయాలతో ఈ రికార్డు సాధించింది. టెక్‌ సావీ ఫీచర్లు, సరియైన ధర, స్పోర్టి డిజైన్‌లతో యువతరం మనుసు దోచుకుందని కంపెనీ వెల్లడించింది. స్విఫ్ట్ కస్టమర్లలో 53 శాతానికి పైగా 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారేనని కంపెనీ తెలిపింది. ఈ ఏడాది కూడా అలాంటి కార్లను మార్కెట్ లోకి విడుదల చేసింది. యువతను ఆకట్టుకునే విధంగా మున్ముందు వచ్చే కార్లను అందుబాటులోకి తీసుకు వస్తామని కంపెనీ ఎండీ తెలిపారు. 



గత ఏడాది 1,60,700 యూనిట్లతో స్విఫ్ట్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే కార్‌గా నిలిచిందని మారుతి సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్‌ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ శనివారం వెల్లడించారు. 15 సంవత్సరాలుగా 2.3 మిలియన్లకు పైగా వినియోగదారులతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా ఉందని పేర్కొన్నారు. 2005లో లాంచ్‌ చేసిన మారుతి స్విఫ్ట్‌ ఇప్పటికి 23 లక్షల యూనిట్ల మైలు రాయిని కూడా దాటేసిందన్నారు. ఇది 2010 లో 5 లక్షల మైలురాయిని, 2013 లో 10 లక్షలను, 2016 లో 15 లక్షలను దాటిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2021- 2022 ఏడాదిలో కూడా ప్రజలను ఆకట్టుకొనే కార్లను తయారు చేస్తామని తెలిపారు. 




హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: బొత్సని దాటి రాజన్న మంత్రి పోస్ట్ కొడతారా?

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>