PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/rajini-pratipatti8dea9a02-e565-455d-a322-edbf63a44d20-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/rajini-pratipatti8dea9a02-e565-455d-a322-edbf63a44d20-415x250-IndiaHerald.jpgత‌న‌కు పోటీగా ఉన్న మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పుకొనే విష‌యంలో ఆమె స‌క్సెస్ అయ్యారు. మాజీ మంత్రి ప్ర‌త్తిపాటికి ఊహించ‌ని షాక్ ఇచ్చారు. చిలకలూరిపేట మండల టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి నాగబైరు విజయలక్ష్మి ని వైసీపీలోకి ఆహ్వానించారు. మంత్రి బాలినేని, విడదల రజనీ సమక్షంలో విజయలక్ష్మి వైసీపీలో చేరారు. ఈమె భ‌ర్త టీడీపీలో చురుకైన నాయ‌కుడిగా ఉన్నారు. అయితే.. ఇప్పుడు ఇది ప్రారంభం మాత్ర‌మేన‌ని అంటున్నారు విడ‌ద‌ల అనుచ‌రులు. త్వ‌ర‌లోనే త‌మ నాయ‌కురాలు.. మంత్రి అవుతున్నార‌ని.. మ‌రిrajini pratipatti;vijayalakshmi;district;mla;minister;cheque;letter;tdp;ycp;chilakaluripeta;petta;dookudu;partyదూకుడు పెంచిన ర‌జ‌నీ.. ప్ర‌త్తిపాటి చెక్ పెట్ట‌గ‌ల‌రా ?దూకుడు పెంచిన ర‌జ‌నీ.. ప్ర‌త్తిపాటి చెక్ పెట్ట‌గ‌ల‌రా ?rajini pratipatti;vijayalakshmi;district;mla;minister;cheque;letter;tdp;ycp;chilakaluripeta;petta;dookudu;partySat, 23 Jan 2021 11:05:00 GMTవైసీపీ నాయ‌కురాలు.. గుంటూరు జిల్లా చిల‌క‌లూరి పేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ దూకుడు పెంచారు. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీలో గ్రిప్ కోసం చాప‌కింద నీరులా దూసుకు వెళ్లిన ర‌జ‌నీ.. ఇప్పుడు.. ప్ర‌తిప‌క్షం టీడీపీపై కూడా త‌న‌దే పైచేయి కావాల‌నే నిర్ణ‌యంతో ముందుకు సాగుతున్నారు. టీడీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు అనుచ‌ర వ‌ర్గాన్ని పార్టీలోకి తీసుకునేందుకు వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో ర‌జ‌నీ దూకుడు పెరిగింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మంత్రి వ‌ర్గం విస్త‌రించేందుకు స‌మ‌యం ముంచుకు వ‌స్తున్ననేప‌థ్యంలో ర‌జ‌నీ.. త‌న‌దైన దూకుడుతో పార్టీ అధినేత జ‌గ‌న్ వ‌ద్ద మార్కులు సంపాయించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఎమ్మెల్యే అయిన ఈ యేడాదిన్న‌ర కాలంలోనే నియోజ‌క‌వ‌ర్గంపై పూర్తిస్థాయిలో ప‌ట్టు సాధించారు. కేవ‌లం రెండేళ్ల స‌మ‌యంలోనే ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యారు. ఈ క్ర‌మంలోనే తాజాగా టీడీపీ నుంచి జంపింగుల‌ను ప్రోత్స‌హిస్తున్నారు. త‌న‌కు పోటీగా ఉన్న మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పుకొనే విష‌యంలో ఆమె స‌క్సెస్ అయ్యారు. మాజీ మంత్రి ప్ర‌త్తిపాటికి ఊహించ‌ని షాక్ ఇచ్చారు. చిలకలూరిపేట మండల టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి నాగబైరు విజయలక్ష్మి ని వైసీపీలోకి ఆహ్వానించారు. మంత్రి బాలినేని, విడదల రజనీ సమక్షంలో విజయలక్ష్మి వైసీపీలో చేరారు.

ఈమె భ‌ర్త టీడీపీలో చురుకైన నాయ‌కుడిగా ఉన్నారు. అయితే.. ఇప్పుడు ఇది ప్రారంభం మాత్ర‌మేన‌ని అంటున్నారు విడ‌ద‌ల అనుచ‌రులు. త్వ‌ర‌లోనే త‌మ నాయ‌కురాలు.. మంత్రి అవుతున్నార‌ని.. మ‌రింత మంది టీడీపీ నేత‌ల‌ను త్వ‌ర‌లోనే పార్టీలోకి చేర్చుకుంటార‌ని అంటున్నారు. టీడీపీ నుంచి జ‌డ్పీటీసీ అభ్య‌ర్థిగా పోటీలో ఉన్న క్యాండెట్‌నే ర‌జ‌నీ పార్టీలో చేర్చుకోవ‌డం జిల్లా  రాజ‌కీయాల్లోనే సంచ‌ల‌నంగా మారింది. మొత్తంగా ఈ ప‌రిణామం చూస్తే.. పుల్లారావుకు విడ‌ద‌ల ఎస‌రు పెడుతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిని మాజీ మంత్రి ఎలా అడ్డుకుంటారో చూడాలి. ఏదేమైనా.. విడ‌ద‌ల దూకుడుతో ప్ర‌తిప‌క్షం టీడీపీకి ఇబ్బందులు త‌ప్పేలా లేవ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.




ఎవరు ఆపినా నేను ఆగను... ఎన్నికలు జరుగుతాయి: నిమ్మగడ్డ

ఏఎన్నార్, ఎన్టీఆర్ మధ్య విభేదాలకు ఆ సంఘటనే కారణమా...!?

కాపు వేద‌న‌: నాయ‌క‌త్వం వ‌హించేదెవ‌రు? చిరు, ప‌వ‌న్‌ ఫేడ్ అవుట్.. !

కాపు వేద‌న‌: ముద్ర‌గ‌డ‌ను న‌మ్మాలా ? వ‌ద్దా ? కాపు నేత‌ల చ‌ర్చ

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !

జగనోరు.. నిండా మునిగారు...?

సింగర్ సునీత కి హీరోయిన్ అవకాశం వచ్చిందా... ఎవరు ఇచ్చారు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>