ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral-tiger6d4bf636-325e-4df5-889f-88200403d0d5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral-tiger6d4bf636-325e-4df5-889f-88200403d0d5-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..పులిని చూడాలనుకుంటే పర్వాలేదు. కానీ.. చనువిచ్చింది కదా అని అతి చేస్తే.. వేటాడేస్తది అని రాజమౌళి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అంటారు. ఈ డైలాగ్ లాగానే కొందరు టూరిస్టుల చేదు అనుభవాన్ని ఎదురకున్నారట. వన్య ప్రాణాలను చూసేందుకు టాప్‌లెస్ జీపుల్లో ఫారెస్ట్ టూర్ చేసిన పర్యాటకులకు అకస్మాత్తుగా ఓ పులి కనిపించింది. అది గోడకు అవతలి పక్కన ఉండటంతో అంతా ధైర్యం చేసి ఫొటోలు, వీడియోలు తీసుకోవడం మొదలుపెట్టారు.అయితే.. నిశబ్దంగా ఉండకుండా గోల గోల చేసి పులిని రెచ్చగొట్టారుviral-tiger;ntr;jr ntr;manu;rajamouli;sushanth;india;twitter;heart;tiger;letter;thikka;nandamuri taraka rama raoటూరిస్టులకి హడలు పుట్టించిన పులి...టూరిస్టులకి హడలు పుట్టించిన పులి...viral-tiger;ntr;jr ntr;manu;rajamouli;sushanth;india;twitter;heart;tiger;letter;thikka;nandamuri taraka rama raoSat, 23 Jan 2021 23:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..పులిని చూడాలనుకుంటే పర్వాలేదు. కానీ.. చనువిచ్చింది కదా అని అతి చేస్తే.. వేటాడేస్తది అని రాజమౌళి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అంటారు. ఈ డైలాగ్ లాగానే  కొందరు  టూరిస్టుల  చేదు అనుభవాన్ని ఎదురకున్నారట. వన్య ప్రాణాలను చూసేందుకు టాప్‌లెస్ జీపుల్లో ఫారెస్ట్ టూర్ చేసిన పర్యాటకులకు అకస్మాత్తుగా ఓ పులి కనిపించింది. అది గోడకు అవతలి పక్కన ఉండటంతో అంతా ధైర్యం చేసి ఫొటోలు, వీడియోలు తీసుకోవడం మొదలుపెట్టారు.అయితే.. నిశబ్దంగా ఉండకుండా గోల గోల చేసి పులిని రెచ్చగొట్టారు. దీంతో ఆ పులికి చిర్రెత్తుకొచ్చింది. వాళ్ల తిక్క తీర్చాలని అనుకుందో ఏమో.. ఒక్కసారిగా గోడ మీదకు దూకింది. అంతే.. ఆ వాహనాల్లో ఉన్న టూరిస్టులకు గుండె ఆగినంత పనైంది. పులి ఒక్కసారి అలా మీదకు రావడం చూసి.. అది దాడి చేస్తుందేమో అని హడలిపోయారు.


అయితే, ఆ పులికి యాంగర్ మేనెజ్మెంట్ తెలుసో ఏమో.. చాలా కూల్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయింది. బహుశా.. ఆ సమయంలో యముడు కూడా సెలవులో ఉండి ఉంటాడు. అందుకే వాళ్లు బతికిపోయారు.ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నంద ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ టూరిస్టులను ఆయన తిట్టిపోశారు. అడవి జంతువులతో ఆటలా అని ఏకిపాడేశారు. ‘‘తెలివి తక్కువ పనులు.. మనుషుల మెదడు షట్‌డౌన్‌లో ఉండి. నోరు వాగుతూ ఉంటే.. ఇలాగే ఉంటుంది. ఆ పులి యాంగర్ మేనేజ్మెంట్‌ను మెచ్చుకోవాలి. కానీ, భవిష్యత్తులో అన్నిసార్లు ఆ పులి అంత శాంతంగా ఉంటుందని అనుకోవద్దు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

" style="height: 573px;">


 ఈ వీడియో చూసి నెటిజనులు కూడా ఆ టూరిస్టులను తిట్టిపోస్తున్నారు. వీడియోలు, సెల్పీల పిచ్చితో ప్రాణాలు పోగొట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు.ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వైరల్ న్యూస్ ల గురించి తెలుసుకోండి...


సెంటిమెంట్ ఫాలో అవుతున్న యంగ్ హీరో.. ఈసారి వర్కౌట్ అవుతుందా?

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>