MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ali43738968-3d2f-440b-a1de-76b578c4f422-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ali43738968-3d2f-440b-a1de-76b578c4f422-415x250-IndiaHerald.jpgకమెడియన్ గా, యాంకర్ గా, హీరోగా, నిర్మాతగా అలీ టాలీవుడ్ లో ఓ ట్రెండ్ ని సృష్టించాడని చెప్పొచ్చు.. చిన్నతనంలోనే యాక్టింగ్ లోకి వచ్చి మంచి మంచి పాత్ర లు పోషించి కామెడీ రారాజు గా ఎదిగాడు అలీ.. ఇప్పుడు కూడా పెద్ద పెద్ద సినిమాల్లో కమెడియన్ గా చేస్తూ తన కామెడీ తో ప్రజలను అలరిస్తున్నాడు. నటుడిగానే కాకుండా వ్యాఖ్యాతగా, నిర్మాతగా కూడా అయన ప్రేక్షకులను అలరించడం విశేషం.. ఇది చాలదన్నట్లు ఇటీవలే బుల్లితెర పై కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడి ప్రేక్షకులను కూడా ఆనందింపచేస్తున్నాడు. ali;mahesh;soundarya;achi reddy;ali;indraja;krishna reddy;tollywood;cinema;sv museum;media;comedy;comedian;heroine;chitramఅలీని దారుణంగా అవమానించిన సౌందర్య.. తప్పు తెలుసుకుని..?అలీని దారుణంగా అవమానించిన సౌందర్య.. తప్పు తెలుసుకుని..?ali;mahesh;soundarya;achi reddy;ali;indraja;krishna reddy;tollywood;cinema;sv museum;media;comedy;comedian;heroine;chitramSat, 23 Jan 2021 09:29:48 GMTకమెడియన్ గా, యాంకర్ గా, హీరోగా, నిర్మాతగా అలీ టాలీవుడ్ లో ఓ ట్రెండ్ ని సృష్టించాడని చెప్పొచ్చు.. చిన్నతనంలోనే యాక్టింగ్ లోకి వచ్చి మంచి మంచి పాత్ర లు పోషించి కామెడీ రారాజు గా ఎదిగాడు అలీ.. ఇప్పుడు కూడా పెద్ద పెద్ద సినిమాల్లో కమెడియన్ గా చేస్తూ తన కామెడీ తో ప్రజలను అలరిస్తున్నాడు. నటుడిగానే కాకుండా వ్యాఖ్యాతగా, నిర్మాతగా కూడా అయన ప్రేక్షకులను అలరించడం విశేషం.. ఇది చాలదన్నట్లు ఇటీవలే బుల్లితెర పై కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడి ప్రేక్షకులను కూడా ఆనందింపచేస్తున్నాడు.

ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కున్న అలీ  ని హీరోగా చేసిన క్రెడిట్ మాత్రం దర్శకుడు కృష్ణారెడ్డి కే ఇవ్వాలి.. అయన దర్శకత్వంలో తెరకెక్కిన యమలీల చిత్రంతో అలీ హీరోగా మరి పెద్ద హిట్ కొట్టాడు.. ఆ తర్వాత చాల సినిమాల్లో అలీ హీరోగా నటించి స్టార్ అయ్యాడు. అయితే యమలీల చిత్రం సమయంలో అలీ కి అనుకోకుండా జరిగిన ఓ అవమానం ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. మొదటగా ఈ మూవీని మహేష్ బాబు కోసం అనుకున్నారు. కానీ చివరకు అలీ చేతిలో పడింది. ఇక హీరోయిన్ విషయంలోనూ ఎన్నో మలుపులు చోటుచేసుకున్నాయి. ఇన్నాళ్లు కొన్ని విషయాలు బయటకు చెప్పని ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా అసలు గుట్టు బయట పెట్టేశాడు.

యమలీల సినిమా కోసం అలీని హీరోగా ఫిక్స్ అయిపోయాం. ఇక హీరోయిన్‌గా సౌందర్యను అనుకున్నాం.. అచ్చిరెడ్డి సౌందర్యకు అడ్వాన్స్ కూడా ఇచ్చేశారంటూ చెప్పుకొచ్చాడు. అయితే కొన్ని రోజుల తరువాత సౌందర్య మాట మార్చేసిందట. అలీ పక్కన హీరోయిన్‌గా చేయలేను. ఇప్పుడు పెద్ద హీరోల పక్కన హీరోయిన్‌గా చేస్తున్నాను కదా మీరే ఓ సారి ఆలోచించండి అని ఎస్వీ కృష్ణారెడ్డి సౌందర్య చెప్పుకొచ్చిందట. దాంతో అక్కడినుంచి వచ్చేసిన కృష్ణారెడ్డి ఇంద్రజ ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నాడు. ఆ సినిమా పెద్ద హిట్.. అయితే తన తప్పు తెలుసుకున్న సౌందర్య శుభలగ్నం సమయంలో సౌందర్య మళ్లీ కాల్ చేసి అలీ పక్కన ఓ స్పెషల్ సాంగ్ లో నటించడానికి నేను సిద్ధమని చెప్పిందట. ఆ రోజు యమలీల మిస్ అయ్యాను.. ఇప్పుడు ఈ చాన్స్ మాత్రం మిస్ కాను.. యమలీల చేయలేదన్న వెలితి ఉంది.. ఇప్పుడు ఇది మాత్రం చేస్తాను.. మిస్ కాను అని సౌందర్యే అడిగిందట. 


పదవిలోకి జో బైడెన్ కీలక నిర్ణయం.. సోడా బటన్ తొలగింపు..?

జగన్‌ను నమ్ముకుంటే.. ఆ ఐఏఎస్‌ల పని అంతేనా? కష్టాలు తప్పవా..?

కవితకు ఈ పదవి డిసైడ్ చేశారా ?

తిరుప‌తిలో బీజేపీ అభ్య‌ర్థిగా మాజీ జ‌న‌సేన నేత‌...!

పార్టీ మారినా ప్ర‌యోజ‌నం లేదా.. ఆ ఎమ్మెల్యే బాధేంటంటే..!

మోక్షజ్ఞ ఎంట్రీ పిక్స్.. పాన్ ఇండియా లెవెల్ సినిమా.. అభిమానులు ఫుల్ హ్యాపీ..?

క‌మ్మ వ‌ర్గానికి ఆ వైసీపీ ఎమ్మెల్యే భ‌య‌ప‌డుతున్నారా ? వైసీపీలో టాక్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>