PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda-rameshkumar3cf18ae7-0113-4e34-925e-bf2ba5ccb172-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda-rameshkumar3cf18ae7-0113-4e34-925e-bf2ba5ccb172-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు ఆయన. రాజ్యాంగ ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికల నిర్వహణ కమిషన్ విధి అని స్పష్టం చేసారు. హైకోర్టు ఆదేశాలతోనే ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. సుప్రీం తీర్పును తక్షణం పాటిస్తాం అని వెల్లడించారు. హైకోర్టు తీర్పు సహేతుకమే అని ఆయన అన్నారు. ఎస్ఈసీ వాదనను హైకోర్టు విశ్వసించింది అని తెలిపారు. ఎస్ఈసీకి న్యాయవ్యవస్థపై విశ్వాసం, విధేయతతో ఉంటాయి అని అన్నారు. కరోనా వ్యాక్సినేnimmagadda;kumaar;raj;andhra pradesh;2019;media;panchayati;governor;letter;local languageఎవరు ఆపినా నేను ఆగను... ఎన్నికలు జరుగుతాయి: నిమ్మగడ్డఎవరు ఆపినా నేను ఆగను... ఎన్నికలు జరుగుతాయి: నిమ్మగడ్డnimmagadda;kumaar;raj;andhra pradesh;2019;media;panchayati;governor;letter;local languageSat, 23 Jan 2021 11:33:15 GMTఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు ఆయన. రాజ్యాంగ ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికల నిర్వహణ కమిషన్ విధి అని స్పష్టం చేసారు. హైకోర్టు ఆదేశాలతోనే ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. సుప్రీం తీర్పును తక్షణం పాటిస్తాం అని వెల్లడించారు. హైకోర్టు తీర్పు సహేతుకమే అని ఆయన అన్నారు. ఎస్ఈసీ వాదనను హైకోర్టు విశ్వసించింది అని తెలిపారు. ఎస్ఈసీకి న్యాయవ్యవస్థపై విశ్వాసం, విధేయతతో ఉంటాయి అని అన్నారు.

కరోనా వ్యాక్సినేషన్ చేపడుతూనే విజయనగరం.. ప్రకాశం మినహా మిగిలిన జిల్లాల్లో తొలి విడత ఎన్నికలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. పొలింగ్ సమయాన్ని సాయంత్రం నాలుగు గంటల వరకు పొడిగించాం అని తెలిపారు. సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం అని అన్నారు. సీఎస్, డీజీపీలు సహా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు వీడియో కాన్ఫరెన్సులో పాల్గొనాలని కోరుతున్నాం అన్నారు. పంచాయతీ రాజ్ కమిషనర్ మరింత మెరుగ్గా వ్యవహరించాల్సి ఉంది అని సూచించారు.

పంచాయతీ రాజ్ కమిషనర్ పూర్తిగా విఫలమవ్వడం చాలా బాధాకరం అని అన్నారు. 2019 ఓటర్ల జాబితా ప్రకారమే నిర్వహిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. విధి లేని పరిస్థితుల్లో మాత్రమే 2019 ఓటర్ల జాబితాతో ఎన్నికల నిర్వహణ చేపట్టాల్సి ఉంది అని తెలిపారు. కొత్త ఓటర్ల జాబితాను సిద్దం చేయడంలో పీఆర్ కమిషనర్ అలక్ష్యంతో ఉన్నారు అని విమర్శించారు. పీఆర్ కమిషనరుపై సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ సూచనలు సహేతుకంగా లేవు అని అన్నారు. ఎన్నికలను వాయిదా వేయాలన్న ప్రభుత్వ సూచనను తిరస్కరిస్తున్నాం అని స్పష్టం చేసారు. ప్రభుత్వం తీరు కూడా సరిగా లేదు అని అన్నారు.

సీఎస్ నాకు రాసిన లేఖ నాకంటే ముందుగానే మీడియాకు చేరింది అని అసహనం వ్యక్తం చ్చేసారు. ఆర్టీఐ నుంచి మినహాయింపులున్న కమిషన్ విషయంలో జరిగే ఉత్తర ప్రత్యుత్తరాల్లో గోప్యత పాటించాల్సి ఉంటుంది అని అన్నారు. ఏకగ్రీవ ఎన్నికపై కమిషన్ ప్రత్యేక దృష్టి పెడతామని అని ఆయన పేర్కొన్నారు. ఐజీ స్థాయి అధికారితో పర్యవేక్షణ చేస్తామని అన్నారు. కలెక్టర్లకున్న తరహాలోనే ఎస్ఈసీకి  నిధుల విషయంలో సమస్యలు ఉన్నాయి అని, నిధుల విషయంలో ప్రభుత్వ తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాను అని ఆయన వివరించారు. కమిషన్ కోరినప్పుడు నిధులు.. సిబ్బందిని సమకూర్చే బాధ్యత ప్రభుత్వానిదే అని ఆయన వెల్లడించారు. సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, జేడీ ఇలా ఎవ్వరూ లేరు.. అయినా ఎన్నికలు జరిపి తీరుతాం అని స్పష్టం చేసారు.


ఏఎన్నార్, ఎన్టీఆర్ మధ్య విభేదాలకు ఆ సంఘటనే కారణమా...!?

కాపు వేద‌న‌: నాయ‌క‌త్వం వ‌హించేదెవ‌రు? చిరు, ప‌వ‌న్‌ ఫేడ్ అవుట్.. !

కాపు వేద‌న‌: ముద్ర‌గ‌డ‌ను న‌మ్మాలా ? వ‌ద్దా ? కాపు నేత‌ల చ‌ర్చ

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !

జగనోరు.. నిండా మునిగారు...?

సింగర్ సునీత కి హీరోయిన్ అవకాశం వచ్చిందా... ఎవరు ఇచ్చారు..?

జగన్‌ను నమ్ముకుంటే.. ఆ ఐఏఎస్‌ల పని అంతేనా? కష్టాలు తప్పవా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>