MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/court-elayaraja13015b8e-dec2-43e1-973e-0f76bf9ef2a5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/court-elayaraja13015b8e-dec2-43e1-973e-0f76bf9ef2a5-415x250-IndiaHerald.jpgఇళయరాజా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భారతదేశపు సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు. తన 30 సంవత్సరాల సినీ జీవితంలో వివిధ భాషలలో దాదాపు 5,000 పాటలకు, సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఇక దక్షిణ భారత సినీ పరిశ్రమలో సంగీత దర్శకులు అని చెప్పగానే మొదటగా వినిపించేది ఇళయరాజా పేరు. అంత గొప్ప సంగీత కళాకారులు. ఇళయరాజా కు ఉత్తమ సంగీత దర్శకునిగా నాలుగు సార్లు జాతీయ అవార్డు లభించింది. 1993న లండన్లోని ప్రఖ్యాత రాయల్ ఫిలర్మోనిక్ ఆర్కెస్ట్రా తో ఒక పూర్తి స్థాయి "సింఫనీ "ని కంపోజ్ చేసి, ఆర్కెస్ట్రా చేయించcourt,elayaraja;ilayaraja;geetha;jeevitha rajaseskhar;prasad;yajamanya;sangeetha;cinema theater;court;writer;interview;vకోర్టును ఆశ్రయించిన ఇళయరాజా..కోర్టును ఆశ్రయించిన ఇళయరాజా..court,elayaraja;ilayaraja;geetha;jeevitha rajaseskhar;prasad;yajamanya;sangeetha;cinema theater;court;writer;interview;vSat, 23 Jan 2021 14:05:00 GMTఇళయరాజా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భారతదేశపు సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు. తన 30 సంవత్సరాల సినీ జీవితంలో వివిధ భాషలలో దాదాపు 5,000 పాటలకు, సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఇక దక్షిణ భారత సినీ పరిశ్రమలో సంగీత దర్శకులు అని చెప్పగానే మొదటగా వినిపించేది ఇళయరాజా పేరు. అంత గొప్ప సంగీత కళాకారులు. ఇళయరాజా కు ఉత్తమ సంగీత దర్శకునిగా నాలుగు సార్లు జాతీయ అవార్డు లభించింది. 1993న లండన్లోని ప్రఖ్యాత రాయల్ ఫిలర్మోనిక్ ఆర్కెస్ట్రా తో ఒక పూర్తి స్థాయి "సింఫనీ "ని కంపోజ్ చేసి,  ఆర్కెస్ట్రా చేయించి రికార్డు సృష్టించారు. ఇక  ఆసియా ఖండంలో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి ఇళయరాజా. దీంతో ఇళయరాజా ప్రజలలో మేస్ట్రో గా గుర్తింపు పొందాడు.

ఇక అంతేకాకుండా ఈయన సంగీతానికి ఎన్నో పురస్కారాలు, జాతీయ,రాష్ట్రీయ అవార్డులు కూడా లభించాయి. 2018 లో భారత ప్రభుత్వం "పద్మవిభూషణ్ "పురస్కారంతో సత్కరించింది. అయితే ఇది ఇలా ఉండగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రసాద్ స్టూడియో కి ఇళయరాజాకు మధ్య మనస్పర్ధలు రావడంతో గొడవలు కూడా జరిగాయి.అయినప్పటికీ తమిళనాడు ప్రభుత్వం ఎలాంటి స్పందన ఇవ్వకపోవడంతో ఇక తాను సాధించిన ఎన్నో జాతీయ రాష్ట్రీయ అవార్డులను తిరిగి ఇవ్వబోతున్నాడనే  వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో సదరు వార్తలపై ఇళయరాజా స్పందించారు. ఇవన్నీ వదంతులేనని కొట్టిపారేశారు. ఇటీవల ఒక  మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ "గత కొన్ని సంవత్సరాలుగా నేను సాధించిన అవార్డులను, తిరిగి ఇచ్చేస్తా అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తాజాగా నా దృష్టికి వచ్చింది.ఆ వార్తలు ఎలా పుట్టాయో  నాకు అర్థం కావడం లేదు.ప్రస్తుతం నా గురించి వస్తున్న వార్తలన్నీ రూమర్స్  మాత్రమే" అని చెప్పుకొచ్చాడు.

అయితే చెన్నైలోని ప్రసాద్ స్టూడియో వ్యవస్థాపకుడు ఎల్.వి.ప్రసాద్ గతంలో స్టూడియోలోని రికార్డింగ్ థియేటర్ ను  వాడుకోమని ఇళయరాజాకు మాట ఇచ్చాడు. కానీ ప్రస్తుతం ఉన్న యాజమాన్యం దానికి అంగీకారం తెలపడం లేదు. ఇక ఈ విషయమై ఇళయరాజా కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇక ఆయన ఇచ్చిన స్టే లో ప్రస్తుతం ప్రసాద్ స్టూడియో లోకి నన్ను ప్రవేశించనివ్వడం లేదని, నన్ను మానసికంగా ఇబ్బందులకు గురి చేసిన ప్రస్తుత యాజమాన్యం రూ.50 లక్షల రూపాయల పరిహారాన్ని చెల్లించాలని పిటిషన్లో పేర్కొన్నాడు. ఇక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని,ఇరుపక్షాలకు కోర్టు సూచించింది అనంతరం ఇటీవల  ఇళయరాజా స్టూడియోని ఖాళీ  చేయడం కూడా జరిగింది.




హస్తం పార్టీకి కొత్త అధ్యక్షుడు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !

బీజేపీకి జనసేన దూరమౌతుందా..?

పంచాయతీ ఎన్నికలతోనే వైసీపీ పతనం!

కాపు వేద‌న‌: నాయ‌క‌త్వం వ‌హించేదెవ‌రు? చిరు, ప‌వ‌న్‌ ఫేడ్ అవుట్.. !

బ్రాహ్మ‌ణ ఘోష‌: దేవ‌దాయ మంత్రి ఉత్స‌విగ్ర‌హ‌మా ? బ్రాహ్మ‌ణుల ఆగ్ర‌హం ..!

బెజవాడ దుర్గగుడిలో ఇంత దారుణమా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>