PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fear-among-the-people-with-the-death-of-birdsc11590d4-9c11-47a6-919b-eb264f29d8be-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fear-among-the-people-with-the-death-of-birdsc11590d4-9c11-47a6-919b-eb264f29d8be-415x250-IndiaHerald.jpgదేశాన్ని గజగజలాడించిన కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించగానే బర్డ్ ఫ్లూ వైరస్ కేసులు ప్రజలను భయపెట్టడం ప్రారంభించాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఈ వ్యాధి కారణంగా పక్షులు చనిపోయాయి. ఈ క్రమంలో ఈ నెల 23వ తేదీ వరకూ 9 రాష్ట్రాల్లోని పౌల్ట్రీ పక్షుల్లోనూ, 12 రాష్ట్రాల్లో కాకులు, వలస పక్షుల్లోనూ బర్డ్ ఫ్లూ ఉన్నట్లు గుర్తించినట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.birds;kerala;delhi;gujarat - gandhinagar;himachal pradesh;maharashtra - mumbai;rajasthan;uttar pradesh;uttarakhand;district;job;maharashtra;central government;punjabఇప్పటి వరకూ ఎన్ని రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు బయటపడ్డాయో తెలుసా?ఇప్పటి వరకూ ఎన్ని రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు బయటపడ్డాయో తెలుసా?birds;kerala;delhi;gujarat - gandhinagar;himachal pradesh;maharashtra - mumbai;rajasthan;uttar pradesh;uttarakhand;district;job;maharashtra;central government;punjabSat, 23 Jan 2021 20:50:41 GMTన్యూఢిల్లీ: దేశాన్ని గజగజలాడించిన కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించగానే బర్డ్ ఫ్లూ వైరస్ కేసులు ప్రజలను భయపెట్టడం ప్రారంభించాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఈ వ్యాధి కారణంగా పక్షులు చనిపోయాయి. ఈ క్రమంలో ఈ నెల 23వ తేదీ వరకూ 9 రాష్ట్రాల్లోని పౌల్ట్రీ పక్షుల్లోనూ, 12 రాష్ట్రాల్లో కాకులు, వలస పక్షుల్లోనూ బర్డ్ ఫ్లూ ఉన్నట్లు గుర్తించినట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. పౌల్ట్రీ పక్షుల్లో బర్డ్ ఫ్లూ గుర్తించిన రాష్ట్రాల్లో కేరళ, హరియాణా, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ ఉన్నాయి. కాకులు, వలస పక్షుల్లో బర్డ్ ఫ్లూ గుర్తించిన రాష్ట్రాల్లో మధ్య ప్రదేశ్, హరియాణా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్, పంజాబ్ ఉన్నాయని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రుద్ర ప్రయాగ నుంచి, ఉత్తరాఖండ్ ఫారెస్ట్ రేంజ్ నుంచి పంపిన కాకులు, నెమళ్ల శాంపిల్స్, రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లా నుంచి పంపిన నెమళ్ల శాంపిల్స్, ఉత్తరప్రదేశ్ ఫతేపూర్ నుంచి పంపిన నెమళ్ల శాంపుల్స్ కు నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్‌ (బర్డ్ ఫ్లూ) ఫలితం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, కేరళ రాష్ట్రాల్లో 'కంట్రోల్ అండ్ కంటైన్‌మెంట్’ ఆపరేషన్లు ప్రారంభించామని, కార్యాచరణ ప్రకారం పౌల్ట్రీ పక్షులు, గుడ్లు, పౌల్ట్రీ మేత‌ నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించామని అధికారులు తెలిపారు. కంట్రోల్ ఆఫ్ యానిమల్ డిసీజెస్ కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 50:50 షేరింగ్ పద్ధతిలో నిధులు చెల్లించినట్టు తెలిపింది. ఇప్పటి వరకూ బర్డ్ ఫ్లూ కేసులు వెలుగు చూసిన రాష్ట్రాల ప్రభుత్వాలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోందని, అవసరమైన సహాయ చర్యలు చేయడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.


ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా బీఎస్సీ విద్యార్ధిని.. 24 గంటల్లో...

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>