MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhilbe46800d-5766-4be9-ad67-4de9a6671792-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhilbe46800d-5766-4be9-ad67-4de9a6671792-415x250-IndiaHerald.jpgఅక్కినేని ఫ్యామిలీ మూడో తరం హీరో అయిన అఖిల్ అక్కినేని ప్రస్తుతం నటిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఎంతో భారీ ఖర్చుతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తుండగా ప్రదీశ్ వర్మ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. akhil akkineni latest movie;sakshi vaidya;pooja hegde;ram gopal varma;akhil akkineni;anil music;anil sunkara;bhaskar;gopi sundar;nageshwara rao akkineni;prasad;surender reddy;andhra pradesh;cinema;baba bhaskar;huzur nagar;sunkara ramabrahmam;producer;audience;producer1;hero;heroine;success;yuva;reddy;sakshi;ak entertainmentsఅఖిల్ మూవీ లో యువ హీరోయిన్ ఫిక్స్ .... ఫ్యాన్స్ కి పండుగే ....??అఖిల్ మూవీ లో యువ హీరోయిన్ ఫిక్స్ .... ఫ్యాన్స్ కి పండుగే ....??akhil akkineni latest movie;sakshi vaidya;pooja hegde;ram gopal varma;akhil akkineni;anil music;anil sunkara;bhaskar;gopi sundar;nageshwara rao akkineni;prasad;surender reddy;andhra pradesh;cinema;baba bhaskar;huzur nagar;sunkara ramabrahmam;producer;audience;producer1;hero;heroine;success;yuva;reddy;sakshi;ak entertainmentsSat, 23 Jan 2021 19:40:51 GMTఅక్కినేని ఫ్యామిలీ మూడో తరం హీరో అయిన అఖిల్ అక్కినేని ప్రస్తుతం నటిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఎంతో భారీ ఖర్చుతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తుండగా ప్రదీశ్ వర్మ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.
ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు ఇందులోని ఒక సాంగ్ కూడా ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీపై అక్కినేని అభిమానుల్లో భారీ స్థాయిలో అంచనాలున్నాయి. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా ఈ ఏడాది వేసవి కానుకగా రిలీజ్ అయ్యే అవకాశం కనపడుతోంది. ఇక దీని తర్వాత అఖిల్ నటించనున్న సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. యువ నిర్మాత అనిల్ సుంకర నిర్మాణ ఈ సంస్థ అయిన ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో ఈ సినిమా నిర్మితం కానుంది. అతి త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తయిందని సమాచారం.

ఇక లేటెస్ట్ గా కొన్ని ఫిల్మ్ నగర్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో అఖిల్ సరసన హీరోయిన్ గా యువ నటి, మోడల్ అయిన సాక్షి వైద్య ఎంపికయిందని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఆమెకి స్క్రీన్ టెస్ట్ కూడా చేసిందట మూవీ యూనిట్. మూవీ కథ, కథనాలు ఎంతో బాగా నచ్చిన సాక్షి వెంటనే నటించడానికి ఒప్పుకుందని సినిమాలో హీరో క్యారెక్టర్ తో పాటు ఆమె క్యారెక్టర్ కూడా అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. ఇక రిలీజ్ తరువాత స్క్రీన్ పై అఖిల్, సాక్షి ల జంట ప్రేక్షకాభిమానులని అలరించడం ఖాయమని అలాగే ఈ మూవీతో అఖిల్ భారీ సక్సెస్ అందుకుంటారని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇదే కనుక జరిగితే అఖిల్ ఫ్యాన్స్ కి ఇక పండుగే అని చెప్పాలి....!!


వీళ్లు మనుషులా రాక్షసులా.. చిరుతను చంపి వండుకుని తిన్నారు.. చివరికి..?

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>