MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/tollywood-newsc55e691e-96a3-475e-ba27-a651d666d57d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/tollywood-newsc55e691e-96a3-475e-ba27-a651d666d57d-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ.. బోయపాటి కాంబినేషన్ లో ప్రస్తుతం హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇప్పటికే 75% షూటింగ్ పూర్తి చేసుకుంది. గతంలో వీరి ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన సింహ, లెజెండ్ వంటి సినిమాలు ఎంతటి సంచలన విజయాలను నమోదు చేశాయో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో బీభత్సమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో నందమూరి బాలకృష్ణ.. అలాగే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ బోయపాటి శ్రీను దీంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు తారా స్థాయికి చేరి పోయాయి. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్tollywood news;balakrishna;boyapati srinu;geetha;pragya jaiswal;simhaa;srikanth;thaman s;tollywood;cinema;sangeetha;interview;director;hero;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;legend;dwaraka;yashasvi jaiswal;massమాస్ స్టెప్పులతో బాలయ్య ఐటమ్ సాంగ్..!!మాస్ స్టెప్పులతో బాలయ్య ఐటమ్ సాంగ్..!!tollywood news;balakrishna;boyapati srinu;geetha;pragya jaiswal;simhaa;srikanth;thaman s;tollywood;cinema;sangeetha;interview;director;hero;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;legend;dwaraka;yashasvi jaiswal;massSat, 23 Jan 2021 22:00:00 GMTనందమూరి బాలకృష్ణ.. బోయపాటి కాంబినేషన్ లో ప్రస్తుతం హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇప్పటికే 75% షూటింగ్ పూర్తి చేసుకుంది. గతంలో వీరి ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన సింహ, లెజెండ్ వంటి సినిమాలు ఎంతటి సంచలన విజయాలను నమోదు చేశాయో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో బీభత్సమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో నందమూరి బాలకృష్ణ.. అలాగే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ బోయపాటి శ్రీను దీంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు తారా స్థాయికి చేరి పోయాయి. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రలో నటిస్తున్నాడని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

అందులో ఒక పాత్రలో బాలకృష్ణ అఘోరా గా కనిపిస్తాడని ఈ సినిమా డైరెక్టర్ బోయపాటి శ్రీను ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.నటసింహ బాలయ్య అఘోర పాత్ర చేస్తున్నాడు అనగానే కామన్ ఆడియెన్స్ లో కూడా ఈ సినిమాపై క్యూరియాసిటీ పెరిగిపోయింది. అయితే ఈ పాటికే విడుదల కావాల్సివున్న ఈ సినిమా కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

సినిమా షూటింగ్ ప్రస్తుతం సారధి స్టూడియోలో జరుపుకుంటుంది. కాగా ఈ షూట్ లో బాలయ్యప్రగ్యా జైస్వాల్ పై సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఇది ఐటమ్ సాంగ్ అని సమాచారం ఈ సాంగ్ లో బాలయ్య మాస్ స్టెప్స్ కూడా వేయబోతున్నాడట. ఇక ఈ సినిమాలో మరొక ప్రముఖ నటుడు శ్రీకాంత్ ఇందులో నెగెటివ్ రోల్ చేస్తుండగా ప్రధాన ప్రతినాయకుడు ఎవరనేదపై రకరకాల వార్తలు వినిపిస్తున్నప్పటికీ చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా సంగీత దర్శకుడు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. మరి ఈ సినిమాతో హ్యాట్రిక్ కాంబినేషన్ ఎలాంటి విజయాన్ని ని అందుకుంటుందో చూడాలి.


వాట్సాప్‌కు మరో కొత్త ప్రత్యామ్నాయం.. పేరేంటో తెలుసా?

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>