MLAProgressM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla44ab47a1-9bd7-41d7-82c5-21a1992e1278-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla44ab47a1-9bd7-41d7-82c5-21a1992e1278-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లో నాయకుల పార్టీల మార్పు సహజమే..అయితే సొంత అవసరం కోసం కొందరు పార్టీ మారతారు. మరికొందరు ఏమో సొంత పార్టీనే అన్యాయం చేస్తుందని చెప్పి, వేరే పార్టీలోకి వెళ్లిపోతారు. అలా అన్యాయం జరిగిందని చెప్పి విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన శంబంగి వెంకట చిన అప్పలనాయుడు టీడీపీని వీడి, వైసీపీలోకి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలిచారు. ysrcp mla;jeevitha rajaseskhar;krishna;jagan;2019;రాజీనామా;district;mla;minister;cheque;tdp;ycp;venkata sujaykrishna rangarao;party;bobbiliహెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: రాజకీయం నేర్పిన టీడీపీకే చెక్ పెడుతున్న వైసీపీ ఎమ్మెల్యే...హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: రాజకీయం నేర్పిన టీడీపీకే చెక్ పెడుతున్న వైసీపీ ఎమ్మెల్యే...ysrcp mla;jeevitha rajaseskhar;krishna;jagan;2019;రాజీనామా;district;mla;minister;cheque;tdp;ycp;venkata sujaykrishna rangarao;party;bobbiliSat, 23 Jan 2021 05:00:00 GMTపార్టీ మారతారు. మరికొందరు ఏమో సొంత పార్టీనే అన్యాయం చేస్తుందని చెప్పి, వేరే పార్టీలోకి వెళ్లిపోతారు. అలా అన్యాయం జరిగిందని చెప్పి విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన శంబంగి వెంకట చిన అప్పలనాయుడు టీడీపీని వీడి, వైసీపీలోకి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలిచారు.

టీడీపీ ద్వారా రాజకీయ జీవితం మొదలుపెట్టిన శంబంగి 1983,1985,1994 ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున విజయం సాధించారు. 1989, 1999, 2004 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే తర్వాత 2009 ఎన్నికల్లో ఈయనకు సీటు దక్కలేదు. దీంతో టీడీపీలో ప్రాధాన్యత దక్కడం లేదని వైసీపీలోకి వెళ్లారు. అక్కడ కూడా సరిగా లేదని చెప్పి, మళ్ళీ వైసీపీకి రాజీనామా చేశారు. ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున బొబ్బిలి నుంచి గెలిచిన సుజయ కృష్ణ రంగారావు టీడీపీలోకి వెళ్ళిపోయారు.

దీంతో ఆయనకు చెక్ పెట్టేందుకు జగన్...మళ్ళీ శంబంగిని వైసీపీలోకి తీసుకొచ్చారు. 2019 ఎన్నికల్లో బొబ్బిలి సీటు కూడా ఇచ్చారు. ఇక వైసీపీ తరుపున పోటీ చేసి రాజకీయ జీవితం ఇచ్చిన టీడీపీకే చెక్ పెట్టారు. టీడీపీ నుంచి పోటీ చేసిన సుజయకృష్ణ రంగారావుని చిత్తుగా ఓడించారు. నాలుగోసారి ఎమ్మెల్యే అయిన శంబంగికి నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. అలాగే సమస్యలపై అవగాహన ఉంది. దాని వల్ల సులువుగా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

అటు టీడీపీలో మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు ఉన్నారు. ఈయన పార్టీలో పెద్దగా యాక్టివ్ గా ఉన్నట్లు కనిపించడం లేదు. పైగా వైసీపీ నుంచి రావడంతో, అసలైన టీడీపీ కార్యకర్తలు ఈయనతో ఇంకా కలవలేకపోతున్నారు. అయితే సుజయ సోదరుడు బేబీ నాయన టీడీపీలో యాక్టివ్‌గా ఉన్నారు. బొబ్బిలిలో టీడీపీ మళ్ళీ స్ట్రాంగ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే బొబ్బిలిలో వైసీపీ హవానే ఎక్కువ ఉంది. వైసీపీ ఎమ్మెల్యే శంబంగి స్ట్రాంగ్‌గానే ఉన్నారు.




బొమ్మ సూపర్ హిట్టే.. పవన్ కరెక్ట్ డెసిషన్...?

బాయ్స్ సినిమాలో జెనీలియా క్యారెక్టర్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హారోయిన్ ఎవరో తెలుసా?

గ్రేటర్ కొత్త మేయర్ ఎవరో!

తన భార్య నమ్రత ను మహేష్ ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా..??

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్... రీ సౌండే మరి...?

నిమ్మగడ్డ హీరో... ముప్పయ్యేళ్ళ తరువాత మళ్ళీ..?

మెగాస్టార్ ని కలిసిన బిగ్ బాస్ సోహెల్ ..... నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు .....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>