SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsa24a8952-41b4-440d-82ea-d246d4f46f6c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsa24a8952-41b4-440d-82ea-d246d4f46f6c-415x250-IndiaHerald.jpgఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.. ప్రత్యర్థిని వారి సొంతగడ్డపైనే చిత్తు చేసి టీమిండియా సిరీస్ కైవసం కైవసం చేసుకుంది. 32 ఏళ్లుగా గబ్బా లో తిరుగులేని రికార్డు ఉన్న ఆసీస్ జట్టుకు ఓటమి రుచి చూపించింది. కీలక ఆటగాళ్ళందరూ జట్టుకు దూరమైనప్పటికీ రహానే సారధ్యంలో కుర్రాళ్ళు టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. ఇటీవలే సీరిస్ ముగించుకుని స్వదేశానికి చేరిన టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆస్ట్రేలియా సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున సsports news;tiru;virat kohli;india;australia;car;instagram;fatherకోరిక నెరవేర్చుకున్న సిరాజ్.. కోరిక తిరస్కరించిన రహానే..!!కోరిక నెరవేర్చుకున్న సిరాజ్.. కోరిక తిరస్కరించిన రహానే..!!sports news;tiru;virat kohli;india;australia;car;instagram;fatherSat, 23 Jan 2021 18:08:14 GMTఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.. ప్రత్యర్థిని వారి సొంతగడ్డపైనే చిత్తు చేసి టీమిండియా సిరీస్ కైవసం కైవసం చేసుకుంది. 32 ఏళ్లుగా గబ్బా లో తిరుగులేని రికార్డు ఉన్న ఆసీస్ జట్టుకు ఓటమి రుచి చూపించింది. కీలక ఆటగాళ్ళందరూ జట్టుకు దూరమైనప్పటికీ రహానే సారధ్యంలో కుర్రాళ్ళు టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. ఇటీవలే సీరిస్ ముగించుకుని స్వదేశానికి చేరిన టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆస్ట్రేలియా సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున సిరీస్‌లో అత్యధికంగా 13 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచిన మహమ్మద్ సిరాజ్.

స్వదేశం చేరుకున్న తరువాత తనకున్న ఒక చిరకాల కోరికను నెరవేర్చు కున్నాడు. తనకు ఎంతో ఇష్టమైన బీఎండబ్ల్యూ కారు కొనాలని అందులో తిరగాలని చిన్ననాటి నుండి ఒక లక్ష్యంగా పెట్టుకున్న సిరాజ్ తాజాగా తన కోరిక నెరవేర్చుకున్నాడు. కొత్తగా బీఎండబ్ల్యూ కారు‌ కొని నగర రోడ్లపై షికారు చేశాడు. ఆ వీడియోలను ఈ హైదరాబాదీ పేసర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు.ఇదిలా ఉండగా సిరాజ్‌ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు తన తండ్రి మరణించిన సంగతి తెలిసిందే.మ్యాచ్ జరుగుతున్న సందర్భాలలో కూడా సిరాజ్ భావోద్వేగానికి గురైన సందర్భాల్లో ఉన్నాయి. ఇటీవలే స్వదేశం చేరుకున్న వెంటనే ఇంటికి వెళ్లకుండా నేరుగా శ్మశానవాటికకు వెళ్లి... తన తండ్రి సమాధి వద్ద ప్రార్థనలు చేసి ఆ తర్వాతే ఇంటికి చేరుకున్నాడు.

ఇదిలా ఉంచితే ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పితృత్వం సెలవుల కోసం స్వదేశానికి రాగా అతడి స్థానంలో సారథ్య బాధ్యతలు అజింక్య రహానే చేపట్టి జట్టును ముందుండి నడిపించి భారత్ సాధించిన విజయంలో కీలకపాత్ర వహించాడు. ఇక స్వదేశం చేరుకోగా అభిమానులు భారీ సంఖ్యలో రహానే కు బ్యాండ్ బాజా లతో ఘన స్వాగతం పలికారు.అయితే కంగారూల గడ్డపై సిరీస్ గెలిచిన జ్ఞాపకంగా కొందరు స్నేహితులు.. రహానెతో కేక్‌ కట్ చేయించాలని ఓ ప్రత్యేకమైన కేక్‌ను తీసుకువచ్చారు. కంగారూ కూర్చొని భారత జాతీయ జెండాను పట్టుకున్న ఆకారంలో ఆ కేక్‌ ఉంది. కాగా, మువ్వెన్నల జెండాతో పాటు ఆస్ట్రేలియా జాతీయ జంతువైన కంగారూను రహానె గౌరవిస్తూ.. కేక్‌ను కట్‌ చేయనని సున్నితంగా తిరస్కరించాడు. ఇరు దేశాల గౌరవాల్ని కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. దీంతో రహానె వ్యక్తిత్వాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు.


కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !

బీజేపీకి జనసేన దూరమౌతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>