PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/secret-tunnelb5014fa9-ee7f-47db-b495-91722b37d445-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/secret-tunnelb5014fa9-ee7f-47db-b495-91722b37d445-415x250-IndiaHerald.jpgభారత్ – పాక్ సరిహద్దు వెంబడి దాయాది పాక్ దుర్మార్గపు కుట్రలు కొనసాగిస్తూనే ఉంది. దొంగ దారిలో అక్రమంగా భారత్‌లోకి ఉగ్రవాదులను చేరవేసేందుకు కుట్రలు, కుతంత్రాలు పన్నుతూనే ఉన్నారు. ఇక మరోసారి పాక్.. జమ్మూ కశ్మీర్‌ సరిహద్దు ప్రాంతాల్లో రహస్య సొరంగ మార్గాలను నిర్మిస్తున్నట్లుగా తెలిసింది. తాజాగా కథువా జిల్లాలోని హీరానగర్‌ సెక్టార్‌లో బీఎస్‌ఎఫ్‌ అధికారులు శత్రుమూకలు ఏర్పాటు చేసిన మరో రహస్య సొరంగాన్ని కనుగొన్నారు. కేవలం 10 రోజుల వ్యవధిలో బీఎస్‌ఎఫ్‌ అధికారులు కనుగొన్న రెండో సొరంగం ఇదిsecret tunnel;india;pakistan;jammu and kashmir - srinagar/jammu;january;village;thief;nijam;donga;shatru1జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో బయటపడ్డ మరొక రహస్య సొరంగం....జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో బయటపడ్డ మరొక రహస్య సొరంగం....secret tunnel;india;pakistan;jammu and kashmir - srinagar/jammu;january;village;thief;nijam;donga;shatru1Sat, 23 Jan 2021 19:30:00 GMTభారత్ – పాక్ సరిహద్దు వెంబడి దాయాది పాక్ దుర్మార్గపు కుట్రలు కొనసాగిస్తూనే ఉంది. దొంగ దారిలో అక్రమంగా భారత్‌లోకి ఉగ్రవాదులను చేరవేసేందుకు కుట్రలు, కుతంత్రాలు పన్నుతూనే ఉన్నారు. ఇక మరోసారి పాక్.. జమ్మూ కశ్మీర్‌ సరిహద్దు ప్రాంతాల్లో రహస్య సొరంగ మార్గాలను నిర్మిస్తున్నట్లుగా తెలిసింది. తాజాగా కథువా జిల్లాలోని హీరానగర్‌ సెక్టార్‌లో బీఎస్‌ఎఫ్‌ అధికారులు శత్రుమూకలు ఏర్పాటు చేసిన మరో రహస్య సొరంగాన్ని కనుగొన్నారు. కేవలం 10 రోజుల వ్యవధిలో బీఎస్‌ఎఫ్‌ అధికారులు కనుగొన్న రెండో సొరంగం ఇది. అంతేకాదు, గత 6 నెలల వ్యవధిలో ఇది నాలుగో రహస్య సొరంగ మార్గం కావడం విశేషం.
 

భారత్‌, పాక్‌ సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది చేపట్టిన యాంటీ టన్నెల్‌ ఆపరేషన్‌లో భాగంగా ఈ రహస్య సొరంగాన్ని కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లోని హీరానగర్‌ సెక్టార్‌ పన్సార్‌ అవుట్పోస్ట్‌ ప్రాంతంలో ఈ సొరంగాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. అయితే ఈ సొరంగం పొడవు దాదాపు 150 మీటర్లు ఉందని, 30 అడుగుల లోతు ఉంటుందని బీఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పడుతున్నట్లు చెప్పారు. అయితే కేవలం పది రోజుల క్రితమే అనగా జనవరి 13న హీరానగర్ సెక్టార్‌లోని బోబియాన్‌ గ్రామంలో 150 మీటర్ల పొడవున్న సొరంగాన్ని కనుగొన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రహస్య సొరంగ మార్గాల ద్వారా జమ్మూ కశ్మీర్‌లో హింసను ప్రోత్సహించడానికి ఉగ్రవాదులు... ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డ్రగ్స్‌ ను పంపే ఏర్పాట్లు చేస్తున్నాయని సమాచారం. నగ్రోటాలో రెండు నెలల క్రితం నవంబర్‌ 19న నలుగురు పాక్‌కు చెందిన జైషే ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వారి నుంచి భారీగా ఆయుధ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. బీఎస్ఎఫ్ సిబ్బంది చేపడుతున్న యాంటీ టన్నెల్ ఆపరేషన్ లో భాగంగానే ఈ రహస్య సొరంగ మార్గాలు బయటపడుతున్నాయి. వారు దేశ రక్షణ విధులలో చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం.


ఏడు నిమిషాలు అలా చేయడం వల్లే.. నా కెరీర్ మారింది అంటున్న తాప్సీ..?

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>