MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varalakshmi-sarath-kumar153e7270-b99b-4c92-a862-33c921e10ada-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varalakshmi-sarath-kumar153e7270-b99b-4c92-a862-33c921e10ada-415x250-IndiaHerald.jpgజయమ్మ అలియాస్ వరలక్ష్మి. క్రాక్ సినిమా తర్వాత సౌత్ ఇండియా అంతటా వరలక్ష్మీ పేరు జయమ్మ గా పాపులర్ అయింది. ఇందులో ఆమె ఎంతో అద్భుతంగా నటించి,ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయితే, అందరూ హీరో హీరోయిన్ల గురించి మాట్లాడుకుంటారు. కానీ ట్రాక్ సినిమాలో మాత్రం విలన్ జయమ్మ గురించి మాట్లాడుకోవడం గమనార్హం. అంతగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది వరలక్ష్మి. ఇదిలా ఉండగా త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోంది జయమ్మ. varalakshmi sarath kumar;kumaar;sarath kumar;sharath;vishal krishna;india;korea, south;cinema;kollywood;marriage;hero;allu sneha;father;sharrath marar1;krackపెళ్లి పీటలు ఎక్కబోతోన్న జయమ్మ..పెళ్లి పీటలు ఎక్కబోతోన్న జయమ్మ..varalakshmi sarath kumar;kumaar;sarath kumar;sharath;vishal krishna;india;korea, south;cinema;kollywood;marriage;hero;allu sneha;father;sharrath marar1;krackSat, 23 Jan 2021 15:04:00 GMTక్రాక్ సినిమా తర్వాత సౌత్ ఇండియా అంతటా వరలక్ష్మీ పేరు జయమ్మ గా పాపులర్ అయింది. ఇందులో ఆమె ఎంతో అద్భుతంగా నటించి,ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయితే, అందరూ హీరో హీరోయిన్ల గురించి మాట్లాడుకుంటారు. కానీ ట్రాక్ సినిమాలో మాత్రం విలన్ జయమ్మ గురించి మాట్లాడుకోవడం గమనార్హం. అంతగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది వరలక్ష్మి. ఇదిలా ఉండగా త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోంది జయమ్మ.

ఇక పెళ్లిపీటలు ఎక్కబోతోంది అన్న విషయం వినగానే అందరికీ మదిలో మెదిలే వరుడు స్టార్ హీరో విశాల్. ఆ  పేరు వినబడడానికి  గల కారణం హీరో విశాల్ జయమ్మ ఎన్నో సంవత్సరాలుగా ప్రేమలో పడ్డట్టు అందరికీ తెలుసు. ఆ కారణం చేతనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో ఎవరూ ఊహించని విధంగా షాక్ ఇచ్చారు జయమ్మ తండ్రి శరత్ కుమార్.


అగ్ర నటుడు, సీనియర్ యాక్టర్ అయిన శరత్ కుమార్ పెద్ద కూతురు వరలక్ష్మి. గతంలో  శరత్ కుమార్ విశాల్ తండ్రి మంచి స్నేహితులు. ఇక వీరివురి  స్నేహం కారణంగానే   విశాల్,వరలక్ష్మీ లు ప్రేమలో పడ్డానికి  కారణం అయ్యింది. అయితే రీసెంట్ గా శరత్ కుమార్ కు విశాల్ కు మధ్య జరిగిన గొడవల కారణంగా ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే చాలా కాలం తర్వాత ఆమె పెళ్లికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఇంక ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లే అని కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

35 సంవత్సరాల వయస్సు ఉన్న వరలక్ష్మీ  శరత్ కుమార్,ఒక క్రికెటర్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని గతంలో అయితే పెళ్లి విషయం పై ఏవైనా వార్తలు వినిపిస్తే, వెంటనే స్పందించే జయమ్మ. ఇప్పుడు మాత్రం ఎలాంటి స్పందన ఇవ్వడం లేదు. ఇక జయమ్మ పెళ్లి విషయం ఆమె మాటల్లోనే వినడానికి మనం మరికొంత కాలం ఎదురు చూడక తప్పదు.






పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !

బీజేపీకి జనసేన దూరమౌతుందా..?

పంచాయతీ ఎన్నికలతోనే వైసీపీ పతనం!

కాపు వేద‌న‌: నాయ‌క‌త్వం వ‌హించేదెవ‌రు? చిరు, ప‌వ‌న్‌ ఫేడ్ అవుట్.. !

బ్రాహ్మ‌ణ ఘోష‌: దేవ‌దాయ మంత్రి ఉత్స‌విగ్ర‌హ‌మా ? బ్రాహ్మ‌ణుల ఆగ్ర‌హం ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>