CrimeSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/once-again-tondupalli-toll-gate-in-newse714324a-2477-42e6-a6c8-f3572b9d92a0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/once-again-tondupalli-toll-gate-in-newse714324a-2477-42e6-a6c8-f3572b9d92a0-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై శంషాబాద్ సమీపంలో ఉన్న తొండుపల్లి టోల్‌గేట్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఈ టోల్‌గేట్ దిశ హత్యాచార ఘటన సమయంలో బాగా చర్చల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు మరోసారి తొండుపల్లి టోల్‌గేట్ వార్తల్లో నిలిచింది. తమిళనాడులోని హోసూరు ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో సుమారు రూ.7 కోట్ల విలువైన బంగారం దొంగిలించిన గ్యాంగ్.. తెలంగాణ మీదుగా వెళ్తూ సరిగ్గా ఈ టోల్‌గేట్ వద్దే సైబరాబాద్ పోలీసులకు పట్టుబడిందిtoll gate;rajeev;vedhika;hyderabad;karnataka - bengaluru;telangana;mohandas karamchand gandhi;rajiv gandhi;telugu;police;media;car;krishnagiri;tamilnadu;traffic police;news;medchal;shamshabad;tondupally;george alexander muthootమరోసారి వార్తల్లో నిలిచిన తొండుపల్లి టోల్ గేట్...మరోసారి వార్తల్లో నిలిచిన తొండుపల్లి టోల్ గేట్...toll gate;rajeev;vedhika;hyderabad;karnataka - bengaluru;telangana;mohandas karamchand gandhi;rajiv gandhi;telugu;police;media;car;krishnagiri;tamilnadu;traffic police;news;medchal;shamshabad;tondupally;george alexander muthootSat, 23 Jan 2021 20:20:00 GMTహైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై శంషాబాద్ సమీపంలో ఉన్న తొండుపల్లి టోల్‌గేట్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఈ టోల్‌గేట్ దిశ హత్యాచార ఘటన సమయంలో బాగా చర్చల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టోల్‌‌గేట్ సమీపంలోనే దిశ తన వాహనాన్ని తీసుకెళ్లేందుకు వచ్చి కామాంధుల బారిన పడి ప్రాణాలు కోల్పోయింది. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే ఇప్పుడు మరోసారి తొండుపల్లి టోల్‌గేట్ వార్తల్లో నిలిచింది. భారీ బంగారం చోరీ కేసు ఛేదనకు వేదిక అయింది. తమిళనాడులోని హోసూరు ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో సుమారు రూ.7 కోట్ల విలువైన బంగారం దొంగిలించిన గ్యాంగ్.. తెలంగాణ మీదుగా వెళ్తూ సరిగ్గా ఈ టోల్‌గేట్ వద్దే సైబరాబాద్ పోలీసులకు పట్టుబడింది. భారీ చోరీ కేసును సీరియస్‌గా తీసుకున్న తమిళనాడు క్రిష్ణగిరి పోలీసులు నిందితులు తెలంగాణ, కర్ణాటక మీదుగా పారిపోయే అవకాశం ఉందని అనుమానించి వెంటనే తెలంగాణ పోలీసులకు సమాచారం అందించారు.




తమిళనాడు పోలీసుల సమాచారంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషరేట్ల పరిధిలోని పోలీసులు అప్రమత్తమయ్యారు. జాయింట్ ఆపరేషన్‌కు సిద్ధమయ్యారు. నగర శివారుల్లోని టోల్‌గేట్లు, జాతీయ రహదారులపై నిఘా ఉంచారు. నిందితుల వద్ద ఆయుధాలు ఉన్నాయన్న సమాచారంతో సాయుధులైన పోలీసులను మోహరించారు. ఈ రోజు తెల్లవారుజాము సమయంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని తొండుపల్లి టోల్‌గేట్ వద్ద కారులో వెళ్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. బంగారం కంటైనర్‌లో వెళ్తోందని సమాచారం ఇవ్వడంతో మేడ్చల్ పరిధిలో కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నారు. భారీ చోరీ కేసును చాకచక్యంగా ఛేదించిన అనంతరం సైబరాబాద్ సీపీ సజ్జనార్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఏడు కోట్ల రూపాయల విలువైన బంగారం చోరీ కేసును ఛేదించినట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేశామని.. మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ సిబ్బంది చాకచక్యంగా నిందితులను పట్టుకున్నారని చెప్పారు.




ఏడు నిమిషాలు అలా చేయడం వల్లే.. నా కెరీర్ మారింది అంటున్న తాప్సీ..?

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>