PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/yelluri-gottipati655a4831-c860-4321-9f0b-dfaf11b43a26-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/yelluri-gottipati655a4831-c860-4321-9f0b-dfaf11b43a26-415x250-IndiaHerald.jpgపార్టీకి అండగా ఉంటూ, వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతున్నారు. తమ తమ నియోజకవర్గాల్లో వైసీపీని పూర్తిగా డామినేట్ చేస్తున్నారు. అలా వైసీపీని డామినేట్ చేస్తున్న ఎమ్మెల్యేల్లో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌లు ముందున్నారని చెప్పొచ్చు. వీరు తమ నియోజకవర్గాల్లో తిరుగులేని ఆధిక్యంలో ఉంటున్నారు. రెండోసారి పర్చూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఏలూరి, ప్రకాశం జిల్లాలో కీలక నాయకుడుగా ఎదిగారు. పైగా ఇప్పుడు yelluri gottipati;krishna;krishna chaitanya;naga chaitanya;tiru;jagan;government;parliment;mla;cheque;letter;tdp;ycp;gottipati ravi kumar;chaitanya 1;parchoor;addanki;dookudu;bapatlaఏలూరి-గొట్టిపాటిలు ఫిక్స్ అయిపోయారా ?ఏలూరి-గొట్టిపాటిలు ఫిక్స్ అయిపోయారా ?yelluri gottipati;krishna;krishna chaitanya;naga chaitanya;tiru;jagan;government;parliment;mla;cheque;letter;tdp;ycp;gottipati ravi kumar;chaitanya 1;parchoor;addanki;dookudu;bapatlaSat, 23 Jan 2021 09:05:00 GMTఏపీలో అధికార వైసీపీకి ధీటుగా టీడీపీ నేతలు దూకుడుగా ఉన్నారా? అంటే చాలాచోట్ల ఉన్నారనే చెప్పొచ్చు. గత ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో చాలామంది టీడీపీ నేతలు సైడ్ అయిపోయారు. పలువురు నాయకులు పార్టీని వీడారు. ఇంకొందరు వైసీపీతో తలనొప్పి అని చెప్పి సైలెంట్ అయ్యారు. అయితే అది ఒక ఏడాది వరకే జరిగింది. వైసీపీ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 22 నెలలు అవుతుంది.

ఈ 22 నెలల కాలంలో వైసీపీ ప్రభుత్వ పనితీరు మరీ అద్భుతంగా లేదనే చెప్పొచ్చు. జగన్ కేవలం సంక్షేమం మీద దృష్టి మిగతా విషయాలని గాలికొదిలేసినట్లు కనిపిస్తోంది. ఇదే అదునుగా భావిస్తున్న టీడీపీ నేతలు దూకుడుగా పనిచేస్తున్నారు. పార్టీకి అండగా ఉంటూ, వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతున్నారు. తమ తమ నియోజకవర్గాల్లో వైసీపీని పూర్తిగా డామినేట్ చేస్తున్నారు.

అలా వైసీపీని డామినేట్ చేస్తున్న ఎమ్మెల్యేల్లో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌లు ముందున్నారని చెప్పొచ్చు. వీరు తమ నియోజకవర్గాల్లో తిరుగులేని ఆధిక్యంలో ఉంటున్నారు. రెండోసారి పర్చూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఏలూరి, ప్రకాశం జిల్లాలో కీలక నాయకుడుగా ఎదిగారు. పైగా ఇప్పుడు బాపట్ల పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడుగా దూసుకెళుతున్నారు. అసలు పర్చూరులో ఏలూరికి వైసీపీ చెక్ పెట్టలేకపోతుంది. ఇక్కడ వైసీపీ వైపు ఉన్న రావి రామనాథం బాబు వీక్‌గానే కనిపిస్తున్నారు.

అలాగే అద్దంకిలో గొట్టిపాటి స్ట్రాంగ్‌గానే ఉన్నారు. ఈయనని వైసీపీ ఎన్నిరకాలుగా టార్గెట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఎన్ని రకాలుగా లొంగదీసుకోవాలని చూసిన గొట్టిపాటి లొంగకుండా టీడీపీలోనే ఉంటూ, అద్దంకిలో ఇంకా బలపడుతున్నారు. ఇక్కడ ఉన్న వైసీపీ ఇన్‌చార్జ్‌ బాచిన కృష్ణ చైతన్య ఎంత క‌ష్ట‌ప‌డుతున్నా నియోజకవర్గంలో సైలెంట్‌గా టీడీపీ వేవ్ ఉన్నట్లు కనిపిస్తోంది. నెక్స్ట్ ఎన్నికల్లో ఈ ఇద్దరు మళ్ళీ గెలవడం ఫిక్స్ అని జిల్లాలో ప్రచారం జరుగుతుంది. 


భార‌త్‌ను చూసి గ‌ర్విస్తున్న ప్ర‌పంచం..వ్యాక్సిన్ ఎగుమ‌తిలో రికార్డులు..

జగన్‌ను నమ్ముకుంటే.. ఆ ఐఏఎస్‌ల పని అంతేనా? కష్టాలు తప్పవా..?

కవితకు ఈ పదవి డిసైడ్ చేశారా ?

తిరుప‌తిలో బీజేపీ అభ్య‌ర్థిగా మాజీ జ‌న‌సేన నేత‌...!

పార్టీ మారినా ప్ర‌యోజ‌నం లేదా.. ఆ ఎమ్మెల్యే బాధేంటంటే..!

మోక్షజ్ఞ ఎంట్రీ పిక్స్.. పాన్ ఇండియా లెవెల్ సినిమా.. అభిమానులు ఫుల్ హ్యాపీ..?

క‌మ్మ వ‌ర్గానికి ఆ వైసీపీ ఎమ్మెల్యే భ‌య‌ప‌డుతున్నారా ? వైసీపీలో టాక్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>