MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/given-a-chance-to-direct-chiranjeevi4802a6ff-963a-44fb-be83-0de8a781bfa2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/given-a-chance-to-direct-chiranjeevi4802a6ff-963a-44fb-be83-0de8a781bfa2-415x250-IndiaHerald.jpgచిరంజీవి సినిమాలపై నిన్నటి వరకు కన్‌ఫ్యూజన్‌ ఉండేది. మెగాస్టార్‌ చేతిలో చాలామంది దర్శకులు ఉన్నారు. ఎవరితో ఏ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియని గందరగోళ పరిస్థితి. వేదళం రీమేక్‌ లేదన్న వార్త రీసెంట్‌గా నెట్‌లో షికారు చేస్తోంది. దీంతో.. తను చేయబోయే దర్శకులతో ఫొటోదిగి నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌ కన్ఫార్మ్‌ చేశాడు చిరంజీవి. మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్‌ కొట్టేశారు ఆ దర్శకులు.సైరా రిలీజ్‌ తర్వాత చిరంజీవి స్పీడ్‌ పెంచాడు. క్రేజీ డైరెక్టర్‌ సినిమా ఫంక్షన్‌కు వెళ్లితే.. కథ రెడీ చేయి.. నచ్చితే చేద్దామgiven a chance to direct chiranjeevi;chiranjeevi;koratala siva;raja;cinema;venky mama;saira narasimhareddy;bobbyచిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు..!చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు..!given a chance to direct chiranjeevi;chiranjeevi;koratala siva;raja;cinema;venky mama;saira narasimhareddy;bobbySat, 23 Jan 2021 21:00:00 GMTచిరంజీవి సినిమాలపై నిన్నటి వరకు కన్‌ఫ్యూజన్‌ ఉండేది. మెగాస్టార్‌ చేతిలో చాలామంది దర్శకులు ఉన్నారు. ఎవరితో ఏ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియని గందరగోళ పరిస్థితి. వేదళం రీమేక్‌ లేదన్న వార్త రీసెంట్‌గా నెట్‌లో షికారు చేస్తోంది. దీంతో.. తను చేయబోయే దర్శకులతో ఫొటోదిగి నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌ కన్ఫార్మ్‌ చేశాడు చిరంజీవి. మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్‌ కొట్టేశారు ఆ దర్శకులు.

సైరా రిలీజ్‌ తర్వాత చిరంజీవి స్పీడ్‌ పెంచాడు. క్రేజీ డైరెక్టర్‌ సినిమా ఫంక్షన్‌కు వెళ్లితే.. కథ రెడీ చేయి.. నచ్చితే చేద్దామనేవారు. దీంతో.. ఈ దర్శకులు జాబితా పెరిగింది. దీంతో చిరంజీవి దర్శకుల విషయంలో కాస్త కన్‌ఫ్యూజన్‌ ఉండేది. దీంతో ' మై ఫోర్‌ కెప్టెన్స్‌ ఈ నలుగురు' అంటూ..  దర్శకులతో ఫొటో పోస్ట్‌ చేశాడు మెగాస్టార్‌. ఇందులో ఇద్దరు దర్శకులు పాత వాళ్లే. కొరటాల దర్శకత్వంలో ఇప్పటికే ఆచార్య చేస్తున్నాడు. లూసిఫర్‌ రీమేక్‌ ఈ మధ్యనే మోహన్‌ రాజా దర్శకత్వంలో మొదలైంది.

చిరంజీవి వేదళం రీమేక్‌లో నటిస్తున్నాడన్న వార్త చాలా కాలంగా వినిపిస్తోంది.  అయితే.. లూసిఫర్ ముందు మొదలుకావడంతో.. వేదళం ఉండదన్న గాసిప్స్‌కు ఫుల్‌స్టాప్ట్‌ పెడుతూ.. ఆ నలుగురు లిస్ట్‌లో మెహర్‌ రమేశ్‌ చేర్చి క్లారిటీ ఇచ్చాడు చిరంజీవి. లూసిఫర్ దర్శకులు మారినా.. వేదళంకు ముందునుంచీ మెహర్‌నే అనుకుంటున్నారు.

పవన్‌తో సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ తీసిన బాబీ.. అన్నయ్యను కూడా డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఆ నలుగురు దర్శకుల లిస్ట్‌లో బాబీ కూడా వున్నాడు. వెంకీమామ రిలీజ్‌ తర్వాత బాబీ చిరంజీవికి స్టోరీ లైన్ వినిపించాడు. అది నచ్చడంతో.. ఇంతకాలం స్క్రిప్ట్‌ వర్క్‌లో బిజీగా గడిపేసిన బాబి.. ఫైనల్‌ వెర్షన్‌ వినిపించినట్టున్నాడు. ఆనలుగు దర్శకుల్లో బాబీకి కూడా చోటు దక్కింది. అయితే.. ఆచార్య.. లూసిఫర్‌.. వేదళం  షూటింగ్ పూర్తయిన తర్వాతే బాబి సినిమా మొదలవుతుంది. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు చేసే అవకాశం కొట్టేశారు ఆ దర్శకులు.






ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా బీఎస్సీ విద్యార్ధిని.. 24 గంటల్లో...

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>