PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/babu0068a887-399f-433d-8098-5cdf62ae6d79-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/babu0068a887-399f-433d-8098-5cdf62ae6d79-415x250-IndiaHerald.jpgకలలు కనడం చాలా మంచిదే. రాజకీయ నాయకులకు కలలు జన్మ హక్కు కూడా. అయితే కన్న కలలు సాకారం అయితేనే సార్ధకత. ఏపీలో చంద్రబాబు రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓడారు. నాటి నుంచి ఆయన కలలు కంటూనే ఉన్నారు. అవే కలలను తమ్ముళ్ళకు కూడా చెబుతున్నారు. babu;modi;narendra modi;american samoa;prime minister;parliment;wife;narendraకమ్మని కలలు కంటున్న బాబోరు...?కమ్మని కలలు కంటున్న బాబోరు...?babu;modi;narendra modi;american samoa;prime minister;parliment;wife;narendraSat, 23 Jan 2021 10:30:00 GMT
ఇంతకీ చంద్రబాబు కంటున్న కలలు ఏంటి అంటే జమిలి ఎన్నికల కలలు. ఈ మధ్యన ప్రధాని నరేంద్ర మోడీ ఆలిండియా స్పీకర్ల సదస్సులో మాట్లాడుతూ జమిలి ఎన్నికల ప్రస్థావన తెచ్చారు. జమిలి ఎన్నికలు జరిగితే దేశంలో అభివృద్ధి సాధ్యపడుతుందని, ఒకేసారి ఎన్నికల వల్ల సమయం, ధనం కూడా వేస్ట్ కావు అంటూ మాట్లాడారు.

దాన్ని పట్టుకుని చంద్రబాబు జమిలి ఎన్నికల గురించి తెగ కలవరిస్తున్నారు. అయితే జమిలి ఎన్నికలు అనుకున్నంత సులువు ఏమీ కాదు, అది కూడా దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అమెరికా లాంటి దేశాల్లో రెండే పార్టీల వ్యవస్థ ఉంది. కాబట్టి నిర్ణయాలు తీసుకోవడం సులువు. అదే భారత‌ దేశంలో  అయితే లెక్కలేనన్ని పార్టీలు ఉన్నాయి.

రాజకీయాలు కూడా అలాగే ఉన్నాయి. జమిలి ఎన్నికల విషయంలో కనుక నిర్ణయం తీసుకోవాలంటే చాలానే చేయాలి. పైగా అన్ని రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానం ఆమోదించాలి. ఇక పార్లమెంట్ ఉభయ సభలలో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలి. ఇవన్నీ అయ్యాకే జమిలి ఎన్నికలు జరిగేది. నిజానికి కేంద్రానికి జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన ఉంటే ఈ ఏడాది జరిగే ఆరు రాష్ట్రాల ఎన్నికలను కూడా వాయిదా వేయాల్సి ఉంటుంది. కానీ అవన్నీ జరిగిపోతున్నాయి. మరో వైపు రైతుల ఉద్యమాలు, ద్రవ్యోల్బనంతో పాటు, పెరిగిన నిత్యావసరాల ధరలు, దిగజారిన ఆర్ధిక రంగం ఇవన్నీ కూడా చూసుకుంటే ఎన్నికలకు ఇపుడు వెళ్ళే సాహసం మోడీ చేస్తారా అన్నదే డౌట్. మరి మోడీ మాట పట్టుకుని జమిలి ఎన్నికలు అంటూ బాబు కలవరించినా సుఖం లేదని అంటున్నారు. మొత్తానికి 2024లోనే ఎన్నికలు అంటే మరో మూడేళ్ల పాటు బాబు ఆగగలరా. డౌటే మరి.





కాపు వేద‌న‌: ముద్ర‌గ‌డ‌ను న‌మ్మాలా ? వ‌ద్దా ? కాపు నేత‌ల చ‌ర్చ

జగనోరు.. నిండా మునిగారు...?

సింగర్ సునీత కి హీరోయిన్ అవకాశం వచ్చిందా... ఎవరు ఇచ్చారు..?

జగన్‌ను నమ్ముకుంటే.. ఆ ఐఏఎస్‌ల పని అంతేనా? కష్టాలు తప్పవా..?

కవితకు ఈ పదవి డిసైడ్ చేశారా ?

తిరుప‌తిలో బీజేపీ అభ్య‌ర్థిగా మాజీ జ‌న‌సేన నేత‌...!

పార్టీ మారినా ప్ర‌యోజ‌నం లేదా.. ఆ ఎమ్మెల్యే బాధేంటంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>