MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/fans-depressing-rajamouli2cebce21-bec3-48cf-bc6e-c2e443972af9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/fans-depressing-rajamouli2cebce21-bec3-48cf-bc6e-c2e443972af9-415x250-IndiaHerald.jpgరాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ సినిమా రౌద్రం రణం రుధిరం. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో భారీ లెవెల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై తెలుగు ఆడియన్స్ తో పాటు దేశ విదేశాల్లోని పలువురు ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. పేట్రియాటిక్ డ్రామా నేపథ్యంలో 1920 ల కాలం నాటి కథగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు రాజమౌళి ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిrrr movie relase;ss rajamouli;ntr;ram charan teja;kranthi;kranti;m m keeravani;ram pothineni;rajamouli;makar sakranti;india;alluri sitarama raju;rrr movie;cinema;sankranthi;january;media;hollywood;youtube;you tube;dvv entertainment;audience;graphics;october;posters;nandamuri taraka rama rao;seetharamaraju;lie;alluri seetha rama raju;seetharama rajuమళ్ళి ఆ విషయంలో రాజమౌళి ఆలోచనలో పడ్డారట ...??మళ్ళి ఆ విషయంలో రాజమౌళి ఆలోచనలో పడ్డారట ...??rrr movie relase;ss rajamouli;ntr;ram charan teja;kranthi;kranti;m m keeravani;ram pothineni;rajamouli;makar sakranti;india;alluri sitarama raju;rrr movie;cinema;sankranthi;january;media;hollywood;youtube;you tube;dvv entertainment;audience;graphics;october;posters;nandamuri taraka rama rao;seetharamaraju;lie;alluri seetha rama raju;seetharama rajuSat, 23 Jan 2021 21:57:24 GMTరాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ సినిమా రౌద్రం రణం రుధిరం. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో భారీ లెవెల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై తెలుగు ఆడియన్స్ తో పాటు దేశ విదేశాల్లోని పలువురు ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. పేట్రియాటిక్ డ్రామా నేపథ్యంలో 1920 ల కాలం నాటి కథగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు రాజమౌళి ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు ఇందులో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న చరణ్, కొమరం భీం గా నటిస్తున్న ఎన్టీఆర్ ల యొక్క ఫస్ట్ లుక్ టీజర్స్ రెండూ కూడా యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి సెన్సేషన్ సృష్టించాయి.

స్వరవాణి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి సెంథిల్కుమార్ ఫోటోగ్రఫీని, సాయిమాధవ్ బుర్రా మాటలను అందిస్తున్నారు. అయితే ఈ సినిమా గత ఏడాది జూలై 30న రిలీజ్ చేస్తామంటూ కొద్ది రోజుల క్రితం యూనిట్ ఒక ప్రకటన విడుదల చేసింది. కానీ మధ్యలో సినిమాకు సంబంధించి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ చాలావరకు పెండింగ్ ఉండటంతో దానిని ఈ ఏడాది జనవరి 8 కి వాయిదా వేశారు యూనిట్ సభ్యులు. తరువాత అనుకోకుండా కరోనా పరిస్థితుల నేపథ్యంలో షూటింగ్స్ అన్ని కూడా బంద్ కావడంతో ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా నిలిచిపోవటం జరిగింది. దానితో మరోమారు ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది.

ఇక నిన్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 8న రిలీజ్ అవుతుంది అంటూ ఇందులో లేడీస్ స్కాట్ గా నటిస్తున్న హాలీవుడ్ నటి ఆలిసన్ డూడి తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టిన ఒక పోస్ట్  ఎంతో వైరల్ అయిన విషయం తెలిసిందే. దానితో ప్రస్తుతం సినిమా రిలీజ్ విషయమై మరొకసారి తీవ్ర ఆలోచనలో పడ్డాడట రాజమౌళి. నిజానికి తమ సినిమాని వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనేది రాజమౌళి ఆలోచనని అయితే కొందరు యూనిట్ సభ్యులు మాత్రం అక్టోబర్ 8 అయితే బాగుంటుందని సూచిస్తున్నట్లు టాక్. మొత్తంగా చూసుకున్నట్లయితే ఆర్.ఆర్.ఆర్ సినిమా రిలీజ్ అంశం ప్రస్తుతం యూనిట్ మొత్తాన్ని ఆలోచనలో పడేసినట్లు తెలుస్తోంది. మరి ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో పక్కాగా తెలియాలంటే కొన్నాళ్ళ వరకు వెయిట్ చేయక తప్పదంటున్నారు విశ్లేషకులు......!!


వాట్సాప్‌కు మరో కొత్త ప్రత్యామ్నాయం.. పేరేంటో తెలుసా?

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>