PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/joe-bidden0aeda0e4-195d-447d-b981-bb7f0c63ecc2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/joe-bidden0aeda0e4-195d-447d-b981-bb7f0c63ecc2-415x250-IndiaHerald.jpgఅగ్రరాజ్యం అమెరికాలో మహమ్మారి కరోనా వైరస్ పై యుద్ధం చేస్తామని జో బైడెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యూఎస్ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన వెంటనే అమెరికాలో మాస్కు తప్పని సరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి ప్రభావం, దీని వల్ల సంభవించిన మరణాలపై అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ వల్ల అమెరికాలో ఆరు లక్షలusa;congress;february;coronavirusకరోనా మరణాలపై కీలక వ్యాఖ్యలు చేసిన బైడెన్కరోనా మరణాలపై కీలక వ్యాఖ్యలు చేసిన బైడెన్usa;congress;february;coronavirusSat, 23 Jan 2021 18:47:58 GMTవాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మహమ్మారి కరోనా వైరస్ పై యుద్ధం చేస్తామని జో బైడెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యూఎస్ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన వెంటనే అమెరికాలో మాస్కు తప్పని సరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి ప్రభావం, దీని వల్ల సంభవించిన మరణాలపై అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ వల్ల అమెరికాలో ఆరు లక్షలకు పైగా మరణాలు సంభవించే అవకాశం ఉందని ఆయన అన్నారు. కనుక కరోనాపై పోరులో భాగంగా తాను ప్రతిపాదించిన 1.9 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని యూఎస్ కాంగ్రెస్ సాధ్యమైనంత త్వరగా ఆమోదిస్తే మంచిదని, దీని వల్ల కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న అమెరికన్లను ఆదుకోవడానికి వీలు పడుతుందని బైడెన్ పేర్కొన్నారు. కరోనా ప్రభావం, ఆర్థిక సంక్షోభంపై శుక్రవారం మీడియాతో మాట్లాడిన బైడెన్.. 'మన దేశం బాధలో ఉంది. రోజురోజుకూ కరోనా వైరస్ ప్రభావం గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4 లక్షలకు మందికిపైగా ఈ మహమ్మారి పొట్టనబెట్టుకుంది. నా అంచనా ప్రకారం 6 లక్షలకు పైగా మంది అమెరికన్లు దీనికి బలి కావొచ్చు. ఫిబ్రవరి నాటికి కరోనా మరణాల సంఖ్య 5 లక్షలకు చేరుతుందని అనుకుంటున్నా' అని ఆయన తెలిపారు.

ఇక మహమ్మారిపై పోరులో భాగంగా శుక్రవారం బైడెన్ చాలా తక్కువ ఆదాయం ఉన్న అమెరికన్ల కోసం రెండు ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేశారు. ఆహార సహాయాన్ని విస్తరించడంతో పాటు ఉద్దీపన తనిఖీలు చేపట్టడం ఒకటైతే, రెండోది ఫెడరల్ వర్క్‌ఫోర్స్‌కు కనీస వేతనం 15 డాలర్లకు పెంచడం. వైరస్ వల్ల దేశవ్యాప్తంగా తీవ్రంగా బాధింపబడ్డ అమెరికన్ల కోసం ఈ రెండు ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్న బైడెన్.. ఇది మిలియన్ల మంది అమెరికన్లకు ఉపశమనం కలిగిస్తుందన్నారు. కాగా, బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే కరోనాపై పోరు మొదలెట్టిన అధ్యక్షుడు.. అమెరికాకు వచ్చే ప్రయాణికులకు క్వారెంటైన్‌, మాస్కు తప్పనిసరి చేశారు. ఇప్పటికే అగ్రరాజ్యం వెళ్లే ప్రయాణికులకు కొవిడ్ నెగటివ్ సర్టిఫికేట్‌ తప్పనిసరి అనేది తెలిసిందే.     


మెగా రీమేక్ లో ఏం మార్పులు చేశారో తెలుసా?

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>