PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrca3ee8c4-9631-4559-83ab-866f96d2602e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrca3ee8c4-9631-4559-83ab-866f96d2602e-415x250-IndiaHerald.jpgఅగ్రవర్ణాల్లోని పేదల కోసం కేంద్రం 10 శాతం రిజర్వేషన్‌ సౌకర్యం తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం 103వ రాజ్యాంగ సవరణ ద్వారా తమ పరిధిలోని శాఖలు, సంస్థల్లోని విద్య, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటాను 2019 ఫిబ్రవరి నుంచి అమల్లోకి తెచ్చింది. రాష్ట్రాల పరిధిలో వీటి అమలు అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. పలు రాష్ట్రాలు ఇప్పటికే దీనిని ఆచరణలో పెట్టాయి. తెలంగాణ ప్రభుత్వం మొదట్లో ఈ కోటాకు అంగీకరించలేదు. కానీ అనూహ్యంగా ఇప్పుడు కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే.. తెలంగాణ సర్కారు కూడా అగ్రవర్ణాలkcr;kcr;amala akkineni;vidya;bharatiya janata party;telangana;2019;february;central governmentఆ ఇంటలిజెన్స్ రిపోర్టు చూసి కేసీఆర్‌ షాక్.. అందుకే హఠాత్తుగా ఆ నిర్ణయం..!?ఆ ఇంటలిజెన్స్ రిపోర్టు చూసి కేసీఆర్‌ షాక్.. అందుకే హఠాత్తుగా ఆ నిర్ణయం..!?kcr;kcr;amala akkineni;vidya;bharatiya janata party;telangana;2019;february;central governmentSat, 23 Jan 2021 06:00:00 GMTకేంద్ర ప్రభుత్వం 103వ రాజ్యాంగ సవరణ ద్వారా తమ పరిధిలోని శాఖలు, సంస్థల్లోని విద్య, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటాను 2019 ఫిబ్రవరి నుంచి అమల్లోకి తెచ్చింది. రాష్ట్రాల పరిధిలో వీటి అమలు అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. పలు రాష్ట్రాలు ఇప్పటికే దీనిని ఆచరణలో పెట్టాయి. తెలంగాణ ప్రభుత్వం మొదట్లో ఈ కోటాకు అంగీకరించలేదు. కానీ అనూహ్యంగా ఇప్పుడు కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

అదేంటంటే..  తెలంగాణ సర్కారు కూడా అగ్రవర్ణాల పేదలకు రిజర్వేష్లు అమలు చేయాలని నిర్ణయించింది. తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి పది శాతం రిజర్వేషన్ల కోటా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించారు. రెండుమూడు రోజుల్లోనే ఈ విషయంపై కేసీఆర్ దీనిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, ఆదేశాలు జారీ చేస్తారట. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు కేసీఆర్.

అయితే హఠాత్తుగా కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ సీరియస్ కారణం ఉందట. అదేంటంటే.. ఇటీవల కేసీఆర్ వద్దకు ఓ ఇంటలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందట. అదేమిటంటే.. బీజేపీ త్వరలోనే అగ్రవర్ణ పేదల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతోందట. ఇప్పుటికే దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పుంజుకున్న బీజేపీ ఈ ఉద్యమంతో మరింత లాభపడుతుందని ఆ రిపోర్టు చెప్పిందట. అందుకే కేసీఆర్ హఠాత్తుగా తెలంగాణలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించారట.

ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెబుతున్నారు. భాజపా పోరాటానికి సిద్దమవుతుందని ఇంటలిజెన్స్ నివేదికతోనే కేసీఆర్ హాఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు బండి సంజయ్. అందుకే నిన్న మొన్న తప్పు అన్న రిజర్వేషన్లు ఇప్పుడు కేసీఆర్‌కు  ఒప్పు అయ్యాయని అంటున్నారు. కేసీఆర్ కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా రిజర్వేషన్లు  అమలు చేయాలన్నారు. లేకుంటే మెడలు వంచైనా అమలు చేయిస్తామన్నారు బండి సంజయ్.




జ‌న‌వ‌రి 23 అనేక విశేషాల స‌మాహారం... ఎంతో‌మంది మ‌హాత్ముల జ‌న్మ‌దినం నేడు...

బొమ్మ సూపర్ హిట్టే.. పవన్ కరెక్ట్ డెసిషన్...?

బాయ్స్ సినిమాలో జెనీలియా క్యారెక్టర్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హారోయిన్ ఎవరో తెలుసా?

గ్రేటర్ కొత్త మేయర్ ఎవరో!

తన భార్య నమ్రత ను మహేష్ ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా..??

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్... రీ సౌండే మరి...?

నిమ్మగడ్డ హీరో... ముప్పయ్యేళ్ళ తరువాత మళ్ళీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>