PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/trs-party-tention-on-nagarjunasagar-by-elections2ad651b9-4613-48c9-97ca-f3a2852ff6fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/trs-party-tention-on-nagarjunasagar-by-elections2ad651b9-4613-48c9-97ca-f3a2852ff6fc-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో ఒక పక్క బిజెపి బలపడటం మరో పక్క ఉద్యోగుల సమస్యలు మరో పక్క ఇప్పటి వరకు మాట్లాడని కొన్ని వర్గాలు మాట్లాడటం వంటివి రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద తల నొప్పిగా మారింది అనే విషయం చెప్పవచ్చు. తెలంగాణా సర్కార్ చర్యల మీద కొన్ని వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలో గ్రామీణ అభివృద్ధి పథకాలపై సర్పంచులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులకు షాక్ తగిలింది. ఎర్రబెల్లి దయాకర్ రావు.. నిరంజన్ రెడ్డి.. శ్రీనిtrs;srinivas;vedhika;bharatiya janata party;korcha;district;huzur nagar;chalo;minister;central government;reddy;mahbubnagar;mantraముగ్గురు తెలంగాణా మంత్రులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సర్పంచులుముగ్గురు తెలంగాణా మంత్రులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సర్పంచులుtrs;srinivas;vedhika;bharatiya janata party;korcha;district;huzur nagar;chalo;minister;central government;reddy;mahbubnagar;mantraSat, 23 Jan 2021 16:00:00 GMTబిజెపి బలపడటం మరో పక్క ఉద్యోగుల సమస్యలు మరో పక్క ఇప్పటి వరకు మాట్లాడని కొన్ని వర్గాలు మాట్లాడటం వంటివి రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద తల నొప్పిగా మారింది అనే విషయం చెప్పవచ్చు. తెలంగాణా సర్కార్ చర్యల మీద కొన్ని వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలో గ్రామీణ అభివృద్ధి పథకాలపై సర్పంచులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులకు షాక్ తగిలింది.

ఎర్రబెల్లి దయాకర్ రావు.. నిరంజన్ రెడ్డి.. శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. సభా వేదిక ముందు సర్పంచుల నిరసన కార్యక్రమం జరిగింది. తమ డిమాండ్లు పరిష్కరించాలని ధర్నా చేసారు.  సభలో కింద కూర్చుని నిరసన వ్యక్తం చేసారు సర్పంచులు... ఈ సందర్భంగా సర్పంచుల సమస్యలు పరిష్కరిస్తాం... కుర్చీలో కూర్చోండి అంటూ  మంత్రులు విజ్ఞప్తి చేసారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఛలో పాలమూరు చేపట్టారు సర్పంచులు. జిల్లా కేంద్రంలో సర్పంచుల అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు.

మంత్రుల సమావేశంలో నిలబడి నిరసన తెలిపిన సర్పంచులు... సమావేశాన్ని బహిష్కరించాలని తొలుత నిర్ణయం తీసుకున్నారు. సర్పంచుల ఐక్యత వర్దిల్లాలంటూ నినాదాలు చేసారు. సర్పంచుల తీరుపై మంత్రి ఎర్రబెల్లి అసహనం వ్యక్తం చేసారు. కొంత మంది కావాలని గొడవ చేయాలని చూస్తున్నారు అని మంత్రి మండిపడ్డారు. తప్పుడు సంకేతాలు పంపకండి అని ఎర్రబెల్లి విజ్ఞప్తి చేసారు. సర్పంచుల బాధలు వినాలే వచ్చినం అని మంత్రి చెప్పినా సరే వినలేదు. దీనితో వద్దంటే వెళ్లి పోతామంటూ ఎర్రబెల్లి అసహనం వ్యక్తం చేసారు. సమస్యలపై చర్చిద్దామని సర్పంచులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆహ్వానించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హామీతో సమావేశంల సర్పంచులు పాల్గొన్నారు.


కేవలం ఒకటే ప్రోడక్ట్.. ముఖం మీద రంధ్రాలు మటుమాయం!

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>