PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagaddace1e011b-466f-47dd-a919-d20a8f645c66-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagaddace1e011b-466f-47dd-a919-d20a8f645c66-415x250-IndiaHerald.jpgపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాసారు. మార్చి 2020 లో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అప్రజాస్వామిక, హింసాత్మక విధానాలను దృష్టిలో ఉంచుకొని ఈ విషయాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వస్తున్నానని లేఖలో ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఒక వర్గం పోలీసులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై టిడిపి నాయకులపై కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారు అనిnimmagadda;police;panchayati;2020;letter;tdp;local language;central government;march;varla ramaiah;party;mantraనిమ్మగడ్డకు లేఖ రాయించిన చంద్రబాబు...!నిమ్మగడ్డకు లేఖ రాయించిన చంద్రబాబు...!nimmagadda;police;panchayati;2020;letter;tdp;local language;central government;march;varla ramaiah;party;mantraSat, 23 Jan 2021 10:00:00 GMTపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాసారు. మార్చి 2020 లో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అప్రజాస్వామిక, హింసాత్మక విధానాలను దృష్టిలో ఉంచుకొని ఈ విషయాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వస్తున్నానని లేఖలో ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఒక వర్గం పోలీసులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై టిడిపి నాయకులపై కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారు అని పేర్కొన్నారు.

మార్చిలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎన్నికల అధికారులు సహకరించలేదు అని లేఖలో ప్రస్తావించారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులపై అధికార వైకాపా పార్టీ గూండాలు హింసాత్మక దాడులకు పాల్పడ్డారు. సాధారణ ప్రజలను సైతం భయాందోళనలకు గురిచేశారు అని ఆయన ఆరోపించారు. ఎన్నికల అధికారులు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు ఒక ఓటర్ లిస్టు, అధికార పార్టీ అభ్యర్థులకు మరో ఓటర్ లిస్టులు ఇచ్చి అనేక అవకతవకలకు పాల్పడ్డారు అని ఎస్ ఈ సి దృష్టికి తీసుకువెళ్ళారు.

గత ఎన్నికల్లో అధికార వైకాపా గూండాలు ఎన్నికల్లో పాల్గొనాలనే ఆసక్తిగల అభ్యర్థుల నామినేషన్లు అడ్డగించిన నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో నామినేషన్లను ఆన్లైన్ లో సమర్పించేలా ఏర్పాటు చేయాలనీ అభ్యర్థించారు. అధికార వైకాపా నాయకులు గ్రామ వాలంటీర్ లను ఎన్నికల ప్రచారం కోసం వాడుకోవడమే కాకుండా అనేక అక్రమాలకు పాల్పడ్డాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామ వాలంటీర్ లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలి అని ఆయన పేర్కొన్నారు. గత ఎన్నికల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎన్నికల కోడ్ ను యదేచ్ఛగా ఉల్లంఘించారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు పై నేరాలు మోపి అనర్హులను చేయాలనే ఉద్దేశంతో నల్ల ఆర్డినెన్స్ నం. 2 /2020 తీసుకొచ్చారు. దానిని మరలా ఆగస్టు 4, 2020 డిజైన్స్ నెంబర్ 6 ను తిరిగి పునరుద్ధరించారు అని లేఖలో ప్రస్తావించారు. స్థానిక ఎన్నికలు కేంద్ర భద్రతా దళాలు సిఆర్పిఎఫ్ పర్యవేక్షణలో నిర్వహించాలి అని, పోలింగ్ కేంద్రాల వద్ద సీసీటీవీ సర్వైలెన్స్ ఏర్పాటు చేయాలి అని విజ్ఞప్తి చేసారు.


బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !

జగనోరు.. నిండా మునిగారు...?

సింగర్ సునీత కి హీరోయిన్ అవకాశం వచ్చిందా... ఎవరు ఇచ్చారు..?

జగన్‌ను నమ్ముకుంటే.. ఆ ఐఏఎస్‌ల పని అంతేనా? కష్టాలు తప్పవా..?

కవితకు ఈ పదవి డిసైడ్ చేశారా ?

తిరుప‌తిలో బీజేపీ అభ్య‌ర్థిగా మాజీ జ‌న‌సేన నేత‌...!

పార్టీ మారినా ప్ర‌యోజ‌నం లేదా.. ఆ ఎమ్మెల్యే బాధేంటంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>