PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/74/importance-of-budget-billa01bc7ed-530b-4bc5-a856-fec400353fc4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/74/importance-of-budget-billa01bc7ed-530b-4bc5-a856-fec400353fc4-415x250-IndiaHerald.jpgబడ్జెట్ అనేది ఆదాయ, వ్యయాల పట్టీ... ఇది ఒక కుటుంబానికి ఎంత ప్రదానమైనదో అలాగే ఒక దేశానికీ కూడా చాలా ముఖ్యమైనది. ఇక మన భారతదేశం విషయానికి వస్తే... కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా దేశవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక, సామాజికంగా పలు రకాల అంశాల విషయమై బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. సమాజంలోని నిరుపేద, అణగారిన వర్గాలను ఆదరించడం అలాగే ప్రాంతీయ అసమానతలను తగ్గించడం, రక్షణ సామర్థ్యాలను మెరుగుపరచడం, సరైన విద్యా సౌకర్యాలు కల్పించడం వంటి అనేక అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి.union budget;tara;industries;central government;partyబడ్జెట్ బిల్ ఆవశ్యకత ఏంటి ?బడ్జెట్ బిల్ ఆవశ్యకత ఏంటి ?union budget;tara;industries;central government;partySat, 23 Jan 2021 20:05:00 GMTబడ్జెట్ అనేది ఆదాయ, వ్యయాల పట్టీ... ఇది ఒక కుటుంబానికి ఎంత ప్రదానమైనదో అలాగే ఒక దేశానికీ కూడా చాలా ముఖ్యమైనది. ఇక మన భారతదేశం విషయానికి వస్తే... కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా దేశవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక, సామాజికంగా పలు రకాల అంశాల విషయమై బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. సమాజంలోని నిరుపేద, అణగారిన వర్గాలను ఆదరించడం అలాగే ప్రాంతీయ అసమానతలను తగ్గించడం, రక్షణ సామర్థ్యాలను మెరుగుపరచడం, సరైన విద్యా సౌకర్యాలు కల్పించడం వంటి అనేక అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. అందువల్ల ఆర్థిక స్థిరత్వం, వృద్ధికి ఏ ప్రభుత్వానికైనా మంచి ప్రణాళికతో కూడిన బడ్జెట్ చాలా ముఖ్యమని చెప్పుకోవాలి. ఇక ప్రభుత్వాలు ఈ బడ్జెట్ బిల్లు ప్రవేశపెట్టే క్రమంలో ఎలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తారో చూసినట్లయితే...


 

నిధుల కేటాయింపు


బలహీనమైన ప్రాంతాలను గుర్తించి, వాటికి స్థిరమైన పద్ధతిలో వనరులను కేటాయించడానికి బడ్జెట్ అనేది ప్రభుత్వానికి సహాయపడుతుంది. బడ్జెట్‌ ముఖ్య లక్ష్యం ఇదే అని చెప్పుకోవచ్చు. నిధుల ఎక్కవ అవసరం ఉందో.. అక్కడికి నిధులు చేరేలా చేయడం ప్రభుత్వ కర్తవ్యం. బడ్జెట్ ద్వారా ఇది సాధ్యం అవుతుంది. ఆర్థిక సంక్షేమ విధానాలను అనుసరించి, సమర్థవంతమైన పాలనతో ఆర్థిక స్థిరత్వం సాధించడానికి బడ్జెట్‌ అనేది ప్రభుత్వానికి సాయపడుతుంది.





ఆర్థిక వృద్ధికి భరోసా (పన్నులు, పెట్టుబడులు)


బడ్జెట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పన్నులు విధించడానికి వీలవుతుంది. ఇంకా ఇన్వెస్ట్‌మెంట్లు, ఖర్చులు ఎలా ఉన్నాయో చూసుకోవచ్చు. వీటిని క్రమబద్దీకరించుకోవచ్చు. ఆర్థిక వృద్ధికి ఇవ్వన్నీ అవసరమే. ట్యా్క్స్ రిబేట్, సబ్సిడీ ద్వారా ప్రజలు పొదపు చేయడాన్ని కూడా పెంచొచ్చు.





వ్యాపార వృద్ధి


పరిశ్రమ వర్గాలు, వ్యాపారం చేసే వారు కూడా బడ్జెట్‌పైన కన్నేసి ఉంచుతారు. అందువల్ల ప్రభుత్వం కూడా వీరికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగానే పలు రంగాలకు కేటాయింపులు జరపాలి. బిజినెస్ ఓనర్లును ప్రోత్సహించేలా పాలసీలు తీసుకురావాలి. తద్వారా ఆర్థిక శ్రేయస్సుకు దోహదపడాలి.





ఆర్థిక అసమానతల తగ్గింపు


ఆర్థిక అసమానత అనేది ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా చాలా పెద్ద ముప్పు. సమాజంలో వెనకబడిన వర్గాలను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. బడ్జెట్‌లో ప్రజా, ఆర్థిక సంక్షేమ విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వం ఇలాంటి సమస్యలను పరిష్కరించవచ్చు.





పీఎస్‌యూల నిర్వహణ


ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు చాలా మందికి ఉపాధి కల్పిస్తుంటాయి. ఆదాయాన్ని అర్జిస్తుంటాయి. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో దోహద పడుతుంటాయి. ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలపై దృష్టి కేంద్రీకరించడానికి, వాటి నిర్వహణ బాధ్యతలు సక్రమంగా చూసుకోవడానికి బడ్జెట్ సహాయపడుతుంది.




ఏడు నిమిషాలు అలా చేయడం వల్లే.. నా కెరీర్ మారింది అంటున్న తాప్సీ..?

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>