PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/biden9520b919-f556-47ec-ab70-fa9c397edba7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/biden9520b919-f556-47ec-ab70-fa9c397edba7-415x250-IndiaHerald.jpgగతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చిత్తుగా ఓడించిన యూఎస్ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్.. వైట్ హౌస్ లో తన మార్కు చూపించడం ప్రారంభించారు. అదే సమయంలో ఓవల్‌ ఆఫీసులో కూడా కొన్ని మార్పులు చేశారు. ట్రంప్ హయాంలో అమెరికా అధ్యక్షుడి టేబుల్‌పై తన‌కు ప్రీతి పాత్రమైన ఓ బటన్ ఇప్పుడు కనిపించడం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది.biden;prithy;delhi;american samoa;white house;barack obama;donald trump;silver;house;office;coffeeట్రంప్ ప్రాణమైన దాన్ని తీసేసిన బైడెన్.. ఫొటోలు వైరల్!ట్రంప్ ప్రాణమైన దాన్ని తీసేసిన బైడెన్.. ఫొటోలు వైరల్!biden;prithy;delhi;american samoa;white house;barack obama;donald trump;silver;house;office;coffeeSat, 23 Jan 2021 11:30:00 GMTన్యూఢిల్లీ: గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చిత్తుగా ఓడించిన యూఎస్ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్.. వైట్ హౌస్ లో తన మార్కు చూపించడం ప్రారంభించారు. అదే సమయంలో ఓవల్‌ ఆఫీసులో కూడా కొన్ని మార్పులు చేశారు. ట్రంప్ హయాంలో అమెరికా అధ్యక్షుడి టేబుల్‌పై తన‌కు ప్రీతి పాత్రమైన ఓ బటన్ ఇప్పుడు కనిపించడం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ఈ ట్రంప్ బటన్‌ ను‌ తొలగించేశారు. గతంలో ఆ టేబుల్‌పై చెక్క బాక్సుతో కూడిన ఓ ఎర్ర కలర్‌ బటన్ ఉండేది. డైట్‌ కోక్‌ అంటే ట్రంప్‌కు పిచ్చ ఇష్టం. అందుకే తనకు కోక్ తాగాలని అనిపించిన ప్రతిసారీ ఆ బటన్‌ నొక్కేవారు. నొక్కిన ప్రతిసారీ ఓ వెండి పళ్లెంలో డైట్‌ కోక్ ‌ను పెట్టుకొని ఓ నౌకరు ఆ గదిలోకి వచ్చేవాడు. అది తీసుకొని ట్రంప్‌ గటగటా తాగేసేవారు. అయితే ఈ బటన్‌, ట్రంప్‌ అధ్యక్షుడు కాక ముందు నుంచే ఆ టేబుల్‌ మీద ఉండేది. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన కూడా ఈ మీటను వాడుకునే వారు. ఇప్పుడు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌ టేబుల్‌పై ఈ బటన్ మాయమైంది. అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత తొలిరోజు ఆయన టేబుల్‌పై రెండు ఫోన్లు, ఓ కాఫీ కప్పు, ఓ పెన్నుల సెట్టు మాత్రమే కనిపించాయి.

అధ్యక్ష పదవిని చేపట్టినవారిలో చాలామంది తమ అభిరుచులకు అనుగుణంగా కార్యాలయాన్ని మార్పుకోవడం సహజం. బైడన్‌ రావడంతో ఇప్పుడూ ఓవల్‌ ఆఫీసు కొత్తగా కనిపిస్తోంది. ఆఫీసులో అప్పటిదాకా ఉన్న మాజీ అధ్యక్షులు ఆండ్రూ జాక్సన్‌, ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్డ్‌ చిత్తరువులను బైడన్‌ తొలగించారు. మాజీ అధ్యక్షుడు థామస్‌ జెఫర్‌సన్‌, ప్రగతిశీల వాదులైన రాబర్ట్‌ ఎఫ్‌ కెన్నెడీ, మార్టిన్‌ లూథర్‌కింగ్‌ జూనియర్‌, రోసా పార్క్స్‌ ఎలనోర్‌ రూజ్‌వెల్డ్‌, పౌరహక్కుల కార్యకర్త సీజర్‌ చావేజ్‌ చిత్తరువులను ఉంచారు.





ఎవరు ఆపినా నేను ఆగను... ఎన్నికలు జరుగుతాయి: నిమ్మగడ్డ

ఏఎన్నార్, ఎన్టీఆర్ మధ్య విభేదాలకు ఆ సంఘటనే కారణమా...!?

కాపు వేద‌న‌: నాయ‌క‌త్వం వ‌హించేదెవ‌రు? చిరు, ప‌వ‌న్‌ ఫేడ్ అవుట్.. !

కాపు వేద‌న‌: ముద్ర‌గ‌డ‌ను న‌మ్మాలా ? వ‌ద్దా ? కాపు నేత‌ల చ‌ర్చ

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !

జగనోరు.. నిండా మునిగారు...?

సింగర్ సునీత కి హీరోయిన్ అవకాశం వచ్చిందా... ఎవరు ఇచ్చారు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>