PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-galla-jayadev-strong-on-guntur5a64043e-e2e4-458d-897f-3b29d68a3512-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-galla-jayadev-strong-on-guntur5a64043e-e2e4-458d-897f-3b29d68a3512-415x250-IndiaHerald.jpgఅమరావతి రాజధాని ఉద్యమం ప్రభావం కావొచ్చు...టీడీపీ బలంగా ఉండటం కావొచ్చు...గుంటూరు పార్లమెంట్ పరిధిలో గల్లా జయదేవ్‌కు వైసీపీ చెక్ పెట్టడం కష్టమే అనిపిస్తోంది. అసలు గుంటూరులో టీడీపీకి పెద్ద గెలిచిన రికార్డు లేదు. 1991, 1999 ఎన్నికల్లో మాత్రమే ఆ పార్టీ గెలిచింది. ఇక మెజారిటీ సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత పరిస్తితి మారింది. టీడీపీ, వైసీపీల హవా మొదలైంది. galla;tiru;venu;jagan;galla jayadev;amaravati;guntur;congress;2019;police;capital;parliment;cheque;tdp;central government;ycp;jayadev galla;reddy;party;venu thottempudi;modugula venugopala reddyగల్లాకు ఫిక్స్: ఇంకా నెక్స్ట్ దిగేదెవరో?గల్లాకు ఫిక్స్: ఇంకా నెక్స్ట్ దిగేదెవరో?galla;tiru;venu;jagan;galla jayadev;amaravati;guntur;congress;2019;police;capital;parliment;cheque;tdp;central government;ycp;jayadev galla;reddy;party;venu thottempudi;modugula venugopala reddySat, 23 Jan 2021 03:00:00 GMTఅమరావతి రాజధాని ఉద్యమం ప్రభావం కావొచ్చు...టీడీపీ బలంగా ఉండటం కావొచ్చు...గుంటూరు పార్లమెంట్ పరిధిలో గల్లా జయదేవ్‌కు వైసీపీ చెక్ పెట్టడం కష్టమే అనిపిస్తోంది. అసలు గుంటూరులో టీడీపీకి పెద్ద గెలిచిన రికార్డు లేదు. 1991, 1999 ఎన్నికల్లో మాత్రమే ఆ పార్టీ గెలిచింది. ఇక మెజారిటీ సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత పరిస్తితి మారింది. టీడీపీ, వైసీపీల హవా మొదలైంది.

ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో టీడీపీ వేవ్ బాగా ఉంది. దీంతో గల్లా కుటుంబం నుంచి వచ్చిన జయదేవ్  తొలిసారి గుంటూరు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఎంపీగా గల్లా మంచి పనితీరు కనబర్చారు. కేంద్రంలో బీజేపీతో ఉన్నా లేకపోయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగానే పోరాడారు. ఆ పోరాట ఫలితంగానే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ వేవ్ ఉన్నా సరే, గుంటూరు నుంచి గల్లా జయదేవ్ మరోసారి ఎంపీగా విజయం సాధించారు.

ఇటు రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా, సెంట్రల్‌లో సపోర్ట్ లేకపోయినా గల్లా తనదైన శైలిలో ముందుకెళుతున్నారు. పైగా జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకురావడం, అమరావతి ఉద్యమం మొదలు కావడంతో గల్లాకు కలిసొచ్చింది. టీడీపీ పూర్తిగా అమరావతి ఉద్యమానికి సపోర్ట్‌గా ఉంది. గల్లా సైతం అమరావతి ఉద్యమంలో యాక్టివ్‌గా ఉన్నారు. ఓ సారి పోలీసుల చేతిలో దెబ్బలు కూడా తిన్నారు. దీంతో గుంటూరు పరిధిలో గల్లాకు తిరుగులేకుండా పోయింది. నెక్స్ట్ ఎన్నికల్లో ఆయన గెలుపు ఫిక్స్ అనే స్థాయికి వెళ్లింది.

అయితే వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పెద్ద యాక్టివ్‌గా లేరు. పైగా వైసీపీ అమరావతికి వ్యతిరేకంగా ఉంది. దీంతో గుంటూరు పార్లమెంట్ పరిధిలో టీడీపీ బలంగా కనిపిస్తోంది. అలాగే సొంతంగా గల్లాకు కూడా మంచి ఇమేజ్ ఉంది. దీని బట్టి చూసుకుంటే నెక్స్ట్ గల్లాకు తిరుగులేదనే చెప్పొచ్చు. మరి నెక్స్ట్ ఎన్నికల్లో గల్లాకు వైసీపీ విధంగా చెక్ పెడుతుందో...మోదుగులనే బరిలో దింపుతుందో లేక వేరే అభ్యర్ధిని బరిలో నిలుపుతుందో చూడాలి.




బొమ్మ సూపర్ హిట్టే.. పవన్ కరెక్ట్ డెసిషన్...?

బాయ్స్ సినిమాలో జెనీలియా క్యారెక్టర్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హారోయిన్ ఎవరో తెలుసా?

గ్రేటర్ కొత్త మేయర్ ఎవరో!

తన భార్య నమ్రత ను మహేష్ ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా..??

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్... రీ సౌండే మరి...?

నిమ్మగడ్డ హీరో... ముప్పయ్యేళ్ళ తరువాత మళ్ళీ..?

మెగాస్టార్ ని కలిసిన బిగ్ బాస్ సోహెల్ ..... నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు .....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>