PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktr-telangana-cm6536097d-d4b0-4ad0-b219-695a07f0ee63-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktr-telangana-cm6536097d-d4b0-4ad0-b219-695a07f0ee63-415x250-IndiaHerald.jpgకేటీఆర్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కోరుతూ మంచిర్యాలకు చెందిన టీఆర్‌ఎస్‌ యూత్‌ విభాగం నాయకులు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకు న్నారు. అలిపిరి వద్ద కొబ్బరికాయలు కొట్టి తిరుమలకు కాలినడక ప్రారంభించారు. కేటీఆర్‌ను సీఎంగా చూడాలన్నదే తమ ఆకాంక్ష అని, అందుకోసమే స్వామికి మొక్కులు చెల్లించేందుకు వెళ్లినట్టు వారు చెప్పారు.ktr telangana cm;kcr;ktr;tiru;telangana rashtra samithi trs;eatala rajendar;telangana;government;tirupati;cm;chief minister;letter;etela rajender;party;mantraకేటీఆర్ సీఎం కావాలంటూ మొక్కులుకేటీఆర్ సీఎం కావాలంటూ మొక్కులుktr telangana cm;kcr;ktr;tiru;telangana rashtra samithi trs;eatala rajendar;telangana;government;tirupati;cm;chief minister;letter;etela rajender;party;mantraSat, 23 Jan 2021 09:13:36 GMTతెలంగాణ ప్రభుత్వంలో కీలక మార్పులు ఉంటాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించి కేసీఆర్ రెస్ట్ తీసుకోవాలని భావిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు కూడా చర్చించుకున్నారు. అయితే అది పలు సార్లు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా కేటీఆర్ ముఖ్యమంత్రి పదవిపై ప్రచారం జోరందుకుంది. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులే కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని ప్రకటనలు చేస్తుండటం ఆసక్తిగా మారింది. అయితే తాజాగా కేటీఆర్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కోరుతూ మంచిర్యాలకు చెందిన టీఆర్‌ఎస్‌ యూత్‌ విభాగం నాయకులు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకు న్నారు. అలిపిరి వద్ద కొబ్బరికాయలు కొట్టి తిరుమలకు కాలినడక ప్రారంభించారు. కేటీఆర్‌ను సీఎంగా చూడాలన్నదే తమ ఆకాంక్ష అని, అందుకోసమే స్వామికి మొక్కులు చెల్లించేందుకు వెళ్లినట్టు వారు చెప్పారు.

       కేటీఆర్ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైందని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం రెండో ముఖ్యమంత్రి గా ఫిబ్రవరి18న కేటీఆర్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారని సమాచారం. ఈ మేరకు బ్రాహ్మణ పురోహితులు ముహూర్తం నిర్ణయించారని,  కేసీఆర్ కూడా అన్ని ఏర్పాాట్లు  చేస్తున్నారని తెలుస్తోంది.  కేటీఆర్ కు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకానికి ముందు సీఎం కేసీఆర్ మరోసారి చండీయాగం చేస్తారని చెబుతున్నారు. గతంలో కేసీఆర్ మూడు సార్లు యాగం చేశారు. అయుత చండీ యాగంతో పాటు రాజశ్యామల యాగం కూడా సీఎం నిర్వహిస్తారని సమాచారం. ఆ యాగాలు పూర్తయిన తర్వాత కొడుకుకు పట్టాభిషేకం చేస్తారని పార్టీ వర్గాలు సైతం భావిస్తున్నాయి.

         కేటీఆర్ ప్రమాణ స్వీకారానికి ముందు లేదా తరువాత మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించనున్నారని తెలిసింది. పార్టీ అధినేత గా కేసీఆర్ కొనసాగనున్నారు. కేటీఆర్ 2014 నుంచి రాష్ట్ర మంత్రిగా, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పనిచేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు మాత్రం అలాంటిదేమి ఉండదని కొట్టి పారేస్తున్నాయి. 


భార‌త్‌ను చూసి గ‌ర్విస్తున్న ప్ర‌పంచం..వ్యాక్సిన్ ఎగుమ‌తిలో రికార్డులు..

జగన్‌ను నమ్ముకుంటే.. ఆ ఐఏఎస్‌ల పని అంతేనా? కష్టాలు తప్పవా..?

కవితకు ఈ పదవి డిసైడ్ చేశారా ?

తిరుప‌తిలో బీజేపీ అభ్య‌ర్థిగా మాజీ జ‌న‌సేన నేత‌...!

పార్టీ మారినా ప్ర‌యోజ‌నం లేదా.. ఆ ఎమ్మెల్యే బాధేంటంటే..!

మోక్షజ్ఞ ఎంట్రీ పిక్స్.. పాన్ ఇండియా లెవెల్ సినిమా.. అభిమానులు ఫుల్ హ్యాపీ..?

క‌మ్మ వ‌ర్గానికి ఆ వైసీపీ ఎమ్మెల్యే భ‌య‌ప‌డుతున్నారా ? వైసీపీలో టాక్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>