PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/diamond-madyapradesh-panna29a58438-cf59-40ed-b00b-6196e845e900-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/diamond-madyapradesh-panna29a58438-cf59-40ed-b00b-6196e845e900-415x250-IndiaHerald.jpgకృష్ణా జిల్లాలోని వత్సవాయి మండలం మక్కపేట కాశీవిశ్వేర్వర ఆలయంలో నంది విగ్రహం ధ్వంసం చేసిన ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసారు పోలీసులు. కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. నంది విగ్రహం చెవిలో వజ్రాలున్నాయని వాట్సాప్ లో సమాచారం మేరకు గుప్త నిధుల వేటగాళ్లు ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారు అని ఆయన వివరించారు. హైదరాబాద్ కు చెందిన శ్రీనివాసులు తన మిత్రుడు కృష్ణయ్యకు తెలిపాడని ఆయన పేర్కొన్నారు. వీరిద్దరూ కలసి గుడిని సందర్శించి దొంగతనం చేసేందుకు రెక్కీ నిర్వహించారు అని వెల్లడించారుdiamond;mithra;ramakrishna;vijay;hyderabad;krishna river;district;whatsapp;huzur nagar;police;media;car;september;arrest;krishna district;joseph vijay;indian;kollu ravindraకృష్ణా జిల్లాలో నంది విగ్రహం చెవిలో వజ్రాలు...!కృష్ణా జిల్లాలో నంది విగ్రహం చెవిలో వజ్రాలు...!diamond;mithra;ramakrishna;vijay;hyderabad;krishna river;district;whatsapp;huzur nagar;police;media;car;september;arrest;krishna district;joseph vijay;indian;kollu ravindraSat, 23 Jan 2021 07:00:00 GMTకృష్ణా జిల్లాలోని వత్సవాయి మండలం మక్కపేట కాశీవిశ్వేర్వర ఆలయంలో నంది విగ్రహం ధ్వంసం చేసిన ఏడుగురు నిందితులను  అరెస్ట్ చేసారు పోలీసులు. కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. నంది విగ్రహం చెవిలో వజ్రాలున్నాయని వాట్సాప్ లో సమాచారం మేరకు గుప్త నిధుల వేటగాళ్లు ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారు అని ఆయన వివరించారు. హైదరాబాద్ కు చెందిన శ్రీనివాసులు తన మిత్రుడు కృష్ణయ్యకు తెలిపాడని ఆయన పేర్కొన్నారు. వీరిద్దరూ కలసి గుడిని సందర్శించి దొంగతనం చేసేందుకు రెక్కీ నిర్వహించారు అని వెల్లడించారు.

కృష్ణయ్య సలహాతో హైదరాబాద్ ఎల్.బి.నగర్ లో నివాసముండే విజయ్ రామకృష్ణ సాయం తీసుకుని సెప్టెంబర్ 16వ తేదీ అర్థరాత్రి షిప్ట్ కార్ లో వచ్చి ఆ విగ్రహం చెవులు, ధ్వంసం చేసి చెవులను తీసుకెళ్లిపోయారు అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ వెళ్లే మార్గంలో కారు పక్కకు నిలిపివేసి చెవులు పగులగొట్టి చూడగా, వారకున్న విధంగా వజ్రాలు కనబడలేదు అని తెలిపారు. ఈలోగా దేవాదాయ శాఖ చెవులు విరిగినపోయిన స్థానంలో మరో కొత్త నంది విగ్రహాన్ని పునఃప్రతిష్టించారు అని అన్నారు.

గుప్త నిధుల వేటలో నంది విగ్రహాన్ని పగలగొట్టిన నిందితులు... పాత నంది విగ్రహాన్ని తీసుకురావాలని నిర్ణయించుకున్నారు అని ఆయన వెల్లడించారు. పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, ఇన్ ఫార్మర్ వ్యవస్థ ద్వారా నిందితులను గుర్తించామని ఆయన అన్నారు.  సేకరించిన ఆధారాల మేరకు నిందితులను పట్టుకున్నామని పోలీసులు ఎస్పీ తెలిపారు. వీరిపై 447, 427, 295, 295 ఏ , 153, ఐ పీ సి, & 20 ఆఫ్ ఇండియన్ ట్రెజర్ ట్రోవ్ యాక్ట్ 1878 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసామని అన్నారు. నిందితుల నుండి Ap24AP8999 ఇన్నోవా కార్, Ap16DQ4243 స్విఫ్ట్ కార్, 6 సెల్ ఫోన్స్, నందిని పగలగొట్టడానికి ఉపయోగించే సుత్తీ స్వాధీనం చేసుకున్నామని వివరించారు.


హెరాల్డ్ సెటైర్ : రాజారెడ్డి రాజ్యాంగం అయిపోయింది.. కొత్త ఆరోపణ ఏమిటో తెలుసా ?

ఆ ఇంటలిజెన్స్ రిపోర్టు చూసి కేసీఆర్‌ షాక్.. అందుకే హఠాత్తుగా ఆ నిర్ణయం..!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: రాజకీయం నేర్పిన టీడీపీకే చెక్ పెడుతున్న వైసీపీ ఎమ్మెల్యే...

బాలయ్య చిన్నల్లుడుకు మళ్ళీ ఆ కష్టం తప్పదా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : బీజేపీకే డెడ్ లైన్ విధించిన పవన్..అసలేం జరుగుతోంది ?

కేటీఆర్ కు సీఎం ... మరి హరీష్ కు ఏ పదవి ?

వామ్మో, మెగాస్టార్ ... ఇంత పెద్ద షాక్ ఇస్తారని అస్సలు ఊహించలేదుగా ......??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>