PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagandcaa5dc5-c417-4be1-bb56-037b0d4251ee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagandcaa5dc5-c417-4be1-bb56-037b0d4251ee-415x250-IndiaHerald.jpgఏపీలో జగన్ తీరు పట్ల కొన్ని వర్గాల వారు అయితే తెగ గుస్సా అవుతున్నారు. ఏపీలో ఓటు బ్యాంక్ పాలిటిక్స్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. పెద్ద ఎత్తున సంక్షేమ పధకాలు ఏపీలో అమలవుతున్నాయి. అవన్నీ కూడా కొన్ని వర్గాలకే పరిమితం అవుతున్నాయి. మరి ఏపీలో కడు పేదలుగా ఉన్న వారున్నారు. బీదలు ఉన్నారు. వారంతా అగ్ర వర్ణాలకు చెందిన వారు. jagan;modi;amala akkineni;vidya;velama;jagan;narendra modi;2019;bank;king;central government;ishtam;narendraఆ వర్గాల నుంచి జగనోరికి భారీ షాక్...?ఆ వర్గాల నుంచి జగనోరికి భారీ షాక్...?jagan;modi;amala akkineni;vidya;velama;jagan;narendra modi;2019;bank;king;central government;ishtam;narendraSat, 23 Jan 2021 21:00:00 GMTజగన్ తీరు పట్ల కొన్ని  వర్గాల  వారు అయితే తెగ గుస్సా అవుతున్నారు. ఏపీలో ఓటు బ్యాంక్ పాలిటిక్స్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. పెద్ద ఎత్తున సంక్షేమ పధకాలు ఏపీలో అమలవుతున్నాయి. అవన్నీ కూడా కొన్ని వర్గాలకే పరిమితం అవుతున్నాయి.

మరి ఏపీలో కడు పేదలుగా ఉన్న వారున్నారు. బీదలు ఉన్నారు. వారంతా అగ్ర వర్ణాలకు చెందిన వారు. వీరి కోసం 2019 జనవరిలో కేంద్రం లోని నరేంద్ర మోడీ సర్కార్ అగ్ర వర్ణాలలలో పేదలకు అంటూ రిజర్వేషన్లు తీసుకువచ్చింది. పది శాతం రిజర్వేషన్లు వారి కోసం కేటాయించింది.

దాన్ని అమలు చేసే అధికారం మాత్రం రాష్ట్రాలకు వదిలేసింది. అదే  ఇపుడు రాష్ట్రలకు ఇష్టంగా మారుతోంది. తాము అనుకున్న వారికి అన్ని రకాలైన పధకలు ఇస్తూ తాము కోరుకున్న వారి కోసం రిజర్వేషన్లు కావాలంటూ లేని అధికారాలను నెత్తిన పెట్టుకుని కొత్త తీర్మానాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కేంద్రం రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన అగ్ర వర్ణ పేదల రిజర్వేషన్లు మాత్రం ఎందుకు అమలు చేయడం లేదని జనం నిలదీస్తున్నారు.

ఇక గత రెండేళ్ళుగా కేంద్రం ఆర్ధికంగా వెనకబడిన వారికి ఇచ్చిన రిజర్వేషన్లు అమలు చేయని తెలంగాణా సర్కార్ ఇపుడు మాత్రం అమలుకు ముందుకు వచ్చింది. దీని మీద మరో రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులను కూడా విడుదల చేసేందుకు కేసీయర్ సర్కార్ సిద్ధపడుతోంది. మరి ఏపీలో అందరికీ అన్నీ రకాలైన పధకాలు అమలు చేస్తున్న జగన్ సర్కార్ ఈ విషయం మీద ఇప్పటిదాక దృష్టి పెట్టకపోవడానికి కారణం ఏంటని అంతా నిలదీస్తున్నారు.

ఏపీలో అగ్ర వర్ణ పేదలలో బ్రాహ్మణులు, రాజులు, వైశ్యులు, వెలమ దొరలు, ఓసీ కాపులు, కమ్మలు, రెడ్లు కూడా ఉన్నారు. మరి వీరంతా ఏ పాపం చేశారని రిజర్వేషన్లు అమలు చేయకుండా జగన్ సర్కార్ తాత్సారం చేస్తోంది అని అడుగుతున్నారు. ఈ రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు అగ్ర వర్ణ పేదలకు లభిస్తాయి. వార్షిక ఆదాయం ఎనిమిది లక్షలకు లోపు ఉన్న వారి పిల్లలు అంతా అర్హులే. మరి దాన్ని తొందరగా అమలు చేయాలని ఏపీలో జగన్ ని ఈ వర్గాలు గట్టిగా కోరుతున్నాయి.





మరోసారి ట్విట్టర్లో చంద్రబాబుపై తీవ్రంగా రెచ్చిపోయిన విజయసాయిరెడ్డి...

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>