PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/w45tw54tw-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/w45tw54tw-415x250-IndiaHerald.jpgవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి తెలుగు దేశం పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రమైన వ్యాఖ్యలతో చెలరేగిపోయారు. చంద్రబాబు నాయుడును టార్గెట్‌ చేసుకుని పరుష పదజాలంతో ట్విట్టర్ వేదికగా రెచ్చిపోయారు. చంద్రబాబు సంస్కారపు వస్త్రాల్ని విడిచి పారేసి ‘నగ్నంగా’ చెలరేగిపోతున్నారని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అలాగే ‘‘నీతి, న్యాయం, సిగ్గు, లజ్జలను గాలికొదిలిన వ్యక్తి ధర్మ పరిక్రమ యాత్ర అంటూ పిలుపునివ్వడం దిగజారుడుకు పరాకాష్ట. అన్నారుvijayasaireddy;cbn;dharma;telugu desam party;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;rajya sabha;telugu;panchayati;twitter;tdp;local language;yatra;partyమరోసారి ట్విట్టర్లో చంద్రబాబుపై తీవ్రంగా రెచ్చిపోయిన విజయసాయిరెడ్డి...మరోసారి ట్విట్టర్లో చంద్రబాబుపై తీవ్రంగా రెచ్చిపోయిన విజయసాయిరెడ్డి...vijayasaireddy;cbn;dharma;telugu desam party;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;rajya sabha;telugu;panchayati;twitter;tdp;local language;yatra;partySat, 23 Jan 2021 21:10:00 GMTవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి తెలుగు దేశం పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రమైన వ్యాఖ్యలతో చెలరేగిపోయారు. చంద్రబాబు నాయుడును టార్గెట్‌ చేసుకుని పరుష పదజాలంతో ట్విట్టర్ వేదికగా రెచ్చిపోయారు. గత కొంతకాలంగా ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల (పంచాయతీ) ఎన్నికలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఎన్నికల అంశం అధికార మరియు ప్రతిపక్ష పార్టీల మద్య వైరంగా కాకుండా అధికార పక్షం మరియు రాష్ట్ర ఎన్నికల సంఘ ప్రధాన అధికారి మధ్య వైరంలా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇదే తరుణంలో ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయసాయిరెడ్డి దారుణమైన కామెంట్లు చేయటం తీవ్రంగా చర్చనీయాంశం అవుతుంది. ఈ మేరకు విజయసాయిరెడ్డి శనివారం ట్విట్టర్ ద్వారా చేసిన ట్వీట్లు సంచలనం రేపుతున్నాయి. చంద్రబాబు సంస్కారపు వస్త్రాల్ని విడిచి పారేసి ‘నగ్నంగా’ చెలరేగిపోతున్నారని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.



 ‘‘రాజకీయ అవసాన దశలో సభ్యత, సంస్కారపు వస్త్రాల్ని విడిచి పారేసి ‘నగ్నంగా’ చెలరేగిపోతున్నాడు చంద్రబాబు. కళ్లు, చెవులు మూసుకొని అయ్యో అనడం మినహా చేయగలిగేది ఏమీ లేదు. ప్రజలైతే ఎప్పుడో తుపుక్కుమని ఊమ్మేసి బాబును పట్టించుకోవడం మానేశారు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని వికృత చేష్టలు చూపిస్తాడో!’’ అంటూ చంద్రబాబుపై విజయసాయి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే ‘‘నీతి, న్యాయం, సిగ్గు, లజ్జలను గాలికొదిలిన వ్యక్తి ధర్మ పరిక్రమ యాత్ర అంటూ పిలుపునివ్వడం దిగజారుడుకు పరాకాష్ట. జనం ఉమ్మేస్తారన్న భయం కూడా లేకుండా దబాయింపులకు దిగుతున్నాడు. గుళ్లను కూల్చి, దేవతా మూర్తులను అపవిత్రం చేస్తూ ధర్మం గురించి సుద్దులు చెప్పడం ఇంకెవరి వల్లా కాదు బాబూ.’’ అంటూ మరో ట్వీట్లో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడుపై విజయసాయిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై టీడీపీ కార్యకర్తలు మరియు నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.


" style="height: 325px;">


" style="height: 325px;">




కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !

బీజేపీకి జనసేన దూరమౌతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>