PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-billse1bc3c35-9dd2-4045-a0bc-1f2fed352c96-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-billse1bc3c35-9dd2-4045-a0bc-1f2fed352c96-415x250-IndiaHerald.jpgకొత్త వ్యవసాయ చట్టాల విషయంలో రైతు సంఘాలు ఎక్కువ చేస్తున్నాయా.. మంకుపట్టుతో సమస్యను మరింత జఠిలం చేసుకుంటున్నాయా.. కేంద్రం కాస్త తగ్గి వస్తున్నా.. రైతు సంఘాలు మాత్రం మొత్తంగా చట్టాలు రద్దు చేయాల్సిందేనంటూ పట్టుబట్టడం ద్వారా సమస్య పరిష్కారం కాకుండా మిగిలిపోతుందా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకూ రైతు సంఘాలకు మద్దతుగా ఉన్నవారు కూడా ఇప్పుడు సంఘాల తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో ఇవాళ రైతులు, కేంద్రం మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. కేంద్రం, రైతుల మధ్య ఇవాళ మధ్యాహ్నం 1farmers-bills;amala akkineni;delhi;central governmentకేంద్రం బంపర్‌ ఆఫర్.. రైతులు కాస్త ఎక్కువ చేస్తున్నారా..?కేంద్రం బంపర్‌ ఆఫర్.. రైతులు కాస్త ఎక్కువ చేస్తున్నారా..?farmers-bills;amala akkineni;delhi;central governmentFri, 22 Jan 2021 10:00:00 GMT
ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో ఇవాళ రైతులు, కేంద్రం మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. కేంద్రం, రైతుల మధ్య ఇవాళ మధ్యాహ్నం 12గం.ల నుంచి 11వ విడత చర్చలు ప్రారంభంకానున్నాయి. కేంద్రం ఇప్పటికే ఏడాదిన్నర వరకు చట్టాలను అమలు చేయబోమని, సంయుక్త కమిటీ వేసి చర్చించేందుకు సిద్ధమని కేంద్రం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం ప్రతిపాదనలపై నిన్న ఢిల్లీ సరిహద్దు సింఘు వద్ద సమావేశమైన రైతు సంఘాల సమన్వయ కమిటీ చర్చించింది. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై సుదీర్ఘంగా చర్చించిన రైతు సంఘాల సమన్వయ కమిటీ.. వాటిని తిరస్కరించింది.

కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను  తిరస్కరిస్తూ  రైతు సంఘాలు తీర్మానం చేశాయి. మూడు వ్యవసాయ చట్టాల రద్దు చేయాల్సిందేనని..  కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాల డిమాండ్ చేశాయి. తమ నిర్ణయాన్ని ఇవాళ ప్రభుత్వానికి స్పష్టం చేస్తామంటున్నాయి రైతు సంఘాలు. తమ డిమాండ్ ను వెనక్కి తీసుకునేది లేదని.. చట్టాలను రద్దు చేయాల్సిందేనని చర్చల్లో చెప్పే అవకాశం కనిపిస్తోంది.

రైతులు అలాగే చేస్తే.. చర్చలకు దారులు మూసుకుపోతాయి. అప్పుడు ఇక రైతులు ఎంత నిరసన తెలియజేసినా ఫలితం ఉండకపోవచ్చు. చట్టాల రద్దు తప్ప తమకు ఇక ఏదీ సమ్మతం కాదని తేల్చి చెప్పడం వల్ల చర్చలకు ఆస్కారం ఉండదు. చట్టాల రద్దుకు  ప్రభుత్వం అంగీకారం తెలిపే వరకు ఉద్యమాన్ని వదిలి ఇళ్లకు వెళ్లేది కూడా లేదని రైతులు తేల్చి చెబుతున్నారు. మరి ఇక ఈ సమస్యకు ముగింపు ఎలా ఉంటుందో చూడాలి. 


కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

బ్రాహ్మ‌ణ ఘోష‌: నాడు వైఎస్‌కు.. నేడు జ‌గ‌న్‌కు వ‌న్‌సైడ్‌గా కొమ్ముకాస్తే ఇంత అన్యాయ‌మా..?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ పాల‌న‌లో అర్చ‌కులపై ఉక్కుపాదం.. ఇవే సాక్ష్యాలు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

కాపు వేద‌న‌: రెంటికీ చెడుతున్న ‌కాపులు.. ఏం జ‌రుగుతోంది..?

రాధే శ్యామ్ పరమహంస సీక్రెట్ బయటపెట్టిన కృష్ణంరాజు !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>