PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ssc-examsba01f099-a56f-4565-a1ec-b38396b7a9ed-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ssc-examsba01f099-a56f-4565-a1ec-b38396b7a9ed-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఇంటర్ పరీక్షలు పూర్తయిన మరుసటి రోజు నుంచే పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ నిర్ణయించింది. మే 3 నుంచి 19 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ పూర్తవుతాయి. దీంతో మే20 నుంచి టెన్త్ పరీక్షలు పెట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. ssc exams;education;telangana;school;hindi;februaryమే 20 నుంచి టెన్త్ పరీక్షలు!మే 20 నుంచి టెన్త్ పరీక్షలు!ssc exams;education;telangana;school;hindi;februaryFri, 22 Jan 2021 09:17:17 GMT ఎడ్యుకేషన్ లో మార్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటివరకు స్కూళ్లు తెరవకపోవడం, ఆన్ లైన్ క్లాసులతోనే నెట్టుకొట్టుస్తుండటంతో సిలబస్ తగ్గించాల్సి వచ్చింది. దాంతో ఎగ్జామ్ విధానంలో తెలంగాణ సర్కార్ మార్పులు చేసింది. పదో తరగతి గతంలో 11 పేపర్లు ఉండగా.. ఈసారి ఆరు పేపర్లకు కుదించింది.  ప్రస్తుతం టెన్త్లో హిందీ సబ్జెక్టుకు ఒకే పేపర్ ఉండగా, మిగిలిన ఐదు సబ్జెక్టులకు రెండేసీ పేపర్లు ఉన్నాయి . దీంతో  విద్యార్థులు 11 పరీక్షలు రాస్తున్నారు . అయితే ఈ ఏడాది మాత్రం ఆరు సబ్జెక్టులకు ఆరు పేపర్లు మాత్రమే ఎగ్జామ్స్‌ పెట్టాలని నిర్ణయించడంతో.. స్టూడెంట్లపై కొంతమేరకు ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.

        తెలంగాణలో  ఇంటర్ పరీక్షలు పూర్తయిన మరుసటి రోజు నుంచే పదో తరగతి పరీక్షలు  నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ నిర్ణయించింది. మే 3 నుంచి 19 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ పూర్తవుతాయి. దీంతో మే20 నుంచి టెన్త్ పరీక్షలు పెట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. మే 26 వరకు మెయిన్ సబ్జెక్టుల ఎగ్జామ్స్ పూర్తి చేసి.. 27, 28 తేదీల్లో ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజీ రెండు పేపర్లు, 29న ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్సు ఎగ్జామ్ పెట్టాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం  చేశారు. ఈ సమయంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో… అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉదయమే పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

     ఫిబ్రవరి 1 నుంచి ఫిజికల్ క్లాసులు ప్రారంభం కానుండగా, మొత్తం 89 రోజుల పాటు క్లాసులు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ లెక్కన మే 29 వరకు అకడమిక్ ఇయర్ కొనసాగనుంది. రెండో శనివారం పని దినంగానే కొనసాగించాలని ముందుగా భావించినా, టీచర్ల సంఘాల నుంచి వ్యతిరేకత వస్తుందనే భావనతో ఆ నిరయ్ణంపై వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. వీటన్నింటికీ సంబంధించిన ప్రతిపాదనలను రెండ్రోజుల క్రితమే సర్కారుకు పంపించింది. రాష్ట్రంలో మొత్తం ఐదున్నర లక్షల మంది పదో తరగతి చదువుతున్నారు.




బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ పాల‌న‌లో అర్చ‌కులపై ఉక్కుపాదం.. ఇవే సాక్ష్యాలు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

రాధే శ్యామ్ పరమహంస సీక్రెట్ బయటపెట్టిన కృష్ణంరాజు !

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ యువ‌త జాగృతం కావాలి.. రాజ‌కీయాల‌కు చేరువ అవ్వాలి..!

హెరాల్డ్ సెటైర్ : రాజకీయ యాత్రలతో రచ్చ చేస్తున్న ప్రతిపక్షాలు

ఆర్థిక కష్టం.. టిడిపికి ఎంతో నష్టం ?

జగనోరు చులకనవుతున్నారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>