PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warb7077b64-a48f-419d-ba8a-d29d651f19d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warb7077b64-a48f-419d-ba8a-d29d651f19d8-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో భారతీయ జనతా పార్టీ కాస్త స్పీడ్ గా ముందుకు వెళ్తుంది. ఈ నేపధ్యంలోనే పలు కార్యక్రమాలకు తెలంగాణా బిజెపి శ్రీకారం చుడుతుంది. తెలంగాణాలో బిజెపి దెబ్బకు అధికార తెరాస పార్టీ కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ఇక గ్రేటర్ ఎన్నికల తర్వాత మరింత స్పీడ్ గా తెలంగాణా బిజెపి వెళ్ళింది. ఇదిలా ఉంటే ముషీరాబాద్ నాగమయ్య కుంటలో బీజేపీ బస్తీ సమావేశం జరిగింది. హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్... కీలక వ్యాఖ్యలు చేసారు. లక్ష్మణ్ మాట్లాడుతూ... 30ఏళ్ళుగా పోరాడి హై టెన్షన్ వైర్ ప్రధాన సమస్యనుkishan reddy;lakshman;bharatiya janata party;telangana rashtra samithi trs;india;g kishan reddy;prime minister;mla;good news;central government;reddy;good newwz;partyతెలంగాణా ప్రజలకు గుడ్ న్యూస్...!తెలంగాణా ప్రజలకు గుడ్ న్యూస్...!kishan reddy;lakshman;bharatiya janata party;telangana rashtra samithi trs;india;g kishan reddy;prime minister;mla;good news;central government;reddy;good newwz;partyFri, 22 Jan 2021 15:00:00 GMTభారతీయ జనతా పార్టీ కాస్త స్పీడ్ గా ముందుకు వెళ్తుంది. ఈ  నేపధ్యంలోనే పలు కార్యక్రమాలకు తెలంగాణా బిజెపి శ్రీకారం చుడుతుంది. తెలంగాణాలో బిజెపి దెబ్బకు అధికార తెరాస పార్టీ కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ఇక  గ్రేటర్  ఎన్నికల తర్వాత మరింత స్పీడ్ గా తెలంగాణా బిజెపి వెళ్ళింది. ఇదిలా ఉంటే ముషీరాబాద్ నాగమయ్య  కుంటలో బీజేపీ బస్తీ సమావేశం జరిగింది. హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్... కీలక వ్యాఖ్యలు చేసారు. లక్ష్మణ్ మాట్లాడుతూ... 30ఏళ్ళుగా పోరాడి హై టెన్షన్ వైర్ ప్రధాన సమస్యను పరిష్కరించాం అని ఆయన వెల్లడించారు.

 నేను ఎమ్మెల్యే గా నాగమయ్యకుంట బస్తీని అభివృద్ధి చేశాను అని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్  యోజన  కింద స్వంత ఇళ్ళు కట్టించడానికి  సిద్ధంగా ఉన్నాం అని ఆయన పేర్కొన్నారు. అర్హులు అయిన అందరికి ఇళ్ళు వస్తాయి అని ఆయన తెలిపారు. బస్తీలో డ్రైనేజి, రోడ్లు సమస్యలు పూర్తిగా పరిస్కారమయ్యాయి అని అన్నారు. కిషన్ రెడ్డి చొరవతో త్వరలోనే ఇళ్ల సమస్య కూడా తీరుతుంది అని ఆయన పేర్కొన్నారు. సొంత ఇళ్ళు కట్టుకోవాలనుకునే  వారికి కేంద్రం తక్కువ వడ్డీకే లోన్లు ఇస్తోంది అని ఆయన పేర్కొన్నారు.

కిషన్ రెడ్డి మాట్లాడుతూ... వరదలు వచ్చినపుడు ఈ బస్తీ పూర్తిగా దెబ్బతింది అని ఆయన అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద  ఇళ్ళు కట్టుకోవాలనుకునే వారికి అండగా ఉంటాం అని ఆయన పేర్కొన్నారు.  ఆదాయం,  స్థలాన్ని బట్టి హౌసింగ్ లోన్లు ఇప్పిస్తాం అని ఆయన తెలిపారు. నాలా ప్రధాన సమస్య...ఎవరూ కూడా నాలాలో చెత్త చెదారం  వేయద్దు అని ఆయన సూచించారు. వరదల్లో పట్టాలు పోయిన వారికీ తిరిగి కొత్త పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం అని ఆయన అన్నారు. కరోనా పూర్తిగా పోలేదు.. ప్రజలు జాగ్రత్తలు పాటించాలి అని అన్నారు. భారత్ లో వ్యాక్సిన్ తయారు కావటానికి కేంద్రం పాత్ర కీలకం అని ఆయన తెలిపారు.


బ్రాహ్మ‌ణ ఘోష‌: ఏపీ అసెంబ్లీలో బ్రాహ‌ణ గొంతు వినిపించ‌దా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఐదువేల పింఛ‌న్‌తో అయ్య‌వారికి శ‌ఠ‌గోపం.. జ‌గ‌న‌న్న మార్కు రాజ‌కీయం..!

వాళ్లకు కేసీఆర్ కంటే వ్యాపారాలే ముఖ్యమా...?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌.. నాడు-నేడు.. నిర్వీర్యం దిశ‌గా అడుగులు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: డిప్యూటీ స్పీక‌ర్ సార్ మౌనం.. ఇంత జ‌రిగినా.. నోరు మెద‌ప‌రా..?

సౌందర్య చెప్పిన మాట విని చలించిపోయా: ఎస్ వి కృష్ణా రెడ్డి

వైసీపీకి మ‌రో షాక్‌.... జ‌గ‌న్‌కు దెబ్బ మీద దెబ్బ‌...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>