PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ttd-darshan-tokens-problem-rectifieda26158c3-276a-463a-bf1b-8b8165cfbc8f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ttd-darshan-tokens-problem-rectifieda26158c3-276a-463a-bf1b-8b8165cfbc8f-415x250-IndiaHerald.jpgతిరుమలలో భక్తులు రద్దీ క్ర‌మంగా పెరుగుతోంది. కోవిడ్ భయాందోళ‌న త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఆల‌య అధికారులు కూడా భ‌క్తుల అనుమ‌తికి క్ర‌మంగా ప‌రిమితులు త‌గ్గిస్తున్నారు. కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధికసంఖ్యలో తిరుమల తరలి వస్తున్నారు. ఈ మధ్యకాలంలో 40 వేల మంది భక్తులు వెంకన్నను దర్శించుకున్న దాఖలాలు లేవు. అయితే గురువారం ఆ మార్క్ రీచ్ అయ్యింది. భారీ సంఖ్యలో 41,442 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈ క్రమంలో గురువారttd;tiru;tirupati;sri venkateswara swamy;husband;marchతిరుమ‌ల‌కు రికార్డు సంఖ్య‌లో భ‌క్తుల రాక‌...గురువారం ఒక్క‌రోజే అంత‌మంది ద‌ర్శించుకున్నారు..తిరుమ‌ల‌కు రికార్డు సంఖ్య‌లో భ‌క్తుల రాక‌...గురువారం ఒక్క‌రోజే అంత‌మంది ద‌ర్శించుకున్నారు..ttd;tiru;tirupati;sri venkateswara swamy;husband;marchFri, 22 Jan 2021 10:25:35 GMTతిరుమల తరలి వస్తున్నారు. ఈ మధ్యకాలంలో 40 వేల మంది భక్తులు వెంకన్నను దర్శించుకున్న దాఖలాలు లేవు. అయితే గురువారం ఆ మార్క్ రీచ్ అయ్యింది. భారీ సంఖ్యలో 41,442 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈ క్రమంలో గురువారం  వెంకన్న హుండీ ఆదాయం రూ. 2 కోట్ల 99 లక్షలు వచ్చినట్టు  వెల్లడించింది. నిన్న శ్రీవారిని దర్శించుకుని 18,161 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు వివరించింది.


ఇదిలా ఉండ‌గా  శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వర‌‌స్వామివారి ఆల‌యంలో మార్చి 2 నుండి 10వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌ను కోవిడ్ -19 నేప‌థ్యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ తెలిపారు. టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలో బుధ‌వారం సాయంత్రం జెఈవో త‌న కార్యాల‌యంలో అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేష‌న్ జ‌‌రుగుతున్నందున ఈ ఏడాది స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. బ్ర‌హ్మోత్స‌వాలలో భాగంగా మార్చి 1న అంకురార్ప‌ణ‌, మార్చి 2న ధ్వ‌జారోహ‌ణం, మార్చి 6న గ‌రుడ‌వాహ‌నం, మార్చి 7న వ‌సంతోత్స‌వం, మార్చి 10వ తేదీ చ‌క్ర‌స్నానంతో బ్ర‌హ్మోత్స‌వాలు ముగుస్తాయ‌న్నారు. వాహ‌న సేవ‌ల‌ను ఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నున్న‌ట్లు తెలిపారు.


బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌తి రోజు సాయంత్రం నిర్వ‌హించే ఊంజ‌ల సేవలో ప్ర‌ముఖ క‌ళాకారుల‌తో అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు ఏర్పాటు చేయాల‌ని అన్న‌మాచార్య ప్రాజెక్టు డైరెక్ట‌ర్‌కు సూచించారు. శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఎస్వీ‌బీసీలో ప్రోమో ప్ర‌సారం చేయాల‌న్నారు. ఆల‌యంలో గార్డెన్ విభాగం ఆధ్య‌ర్యంలో సుంద‌రంగా పుష్ప‌లంక‌ర‌ణ‌లు చేప‌ట్టాల‌న్నారు. పారిశుధ్యా‌నికి అవ‌స‌ర‌మైన అద‌న‌పు సిబ్బందిని, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాల‌ని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించారు.


దుర్గమ్మ వెండి విగ్రహాల దొంగ అరెస్టు.. ఎలా దొరికాడంటే..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: నాడు వైఎస్‌కు.. నేడు జ‌గ‌న్‌కు వ‌న్‌సైడ్‌గా కొమ్ముకాస్తే ఇంత అన్యాయ‌మా..?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ పాల‌న‌లో అర్చ‌కులపై ఉక్కుపాదం.. ఇవే సాక్ష్యాలు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

కాపు వేద‌న‌: రెంటికీ చెడుతున్న ‌కాపులు.. ఏం జ‌రుగుతోంది..?

రాధే శ్యామ్ పరమహంస సీక్రెట్ బయటపెట్టిన కృష్ణంరాజు !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>