SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsf1e08968-2b71-4c3a-85e1-937de64a2b90-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsf1e08968-2b71-4c3a-85e1-937de64a2b90-415x250-IndiaHerald.jpgఆస్ట్రేలియా టూర్ లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న టీమిండియా తిరిగి భారత్ చేరుకుంది. చిరస్మరణీయ విజయం సాధించిన భారత జట్టుకు అభిమానులు ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. సిరీస్ లో భాగంగా అనుక్షణం ఉత్కంఠభరితంగా ఒత్తిడితో సాగిన ఆటగాళ్లు ఇంటికి చేరుకుని ఇంటి సభ్యులతో కాస్త సేద తీరుతున్నారు. టెస్ట్ స్పెషలిస్ట్ అయిన చటేశ్వర్ పుజారా సిరీస్ ఎలాంటి ప్రదర్శన కనపరిచాడో అందరికీ తెలిసిందే. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ వికెట్ కోల్పోకుండా బంతి ఒళ్లంతా గాయపరచిన్నప్sports news;ankhita;arya;hyderabad;india;australia;england;yuva;father;athidhi;aryaaటీమిండియా: నాన్నలకు ప్రేమతో..!!టీమిండియా: నాన్నలకు ప్రేమతో..!!sports news;ankhita;arya;hyderabad;india;australia;england;yuva;father;athidhi;aryaaFri, 22 Jan 2021 08:00:00 GMTఆస్ట్రేలియా టూర్ లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న టీమిండియా తిరిగి భారత్ చేరుకుంది. చిరస్మరణీయ విజయం సాధించిన భారత జట్టుకు అభిమానులు ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. సిరీస్ లో భాగంగా అనుక్షణం ఉత్కంఠభరితంగా ఒత్తిడితో సాగిన ఆటగాళ్లు ఇంటికి చేరుకుని ఇంటి సభ్యులతో కాస్త సేద తీరుతున్నారు. టెస్ట్ స్పెషలిస్ట్ అయిన చటేశ్వర్ పుజారా సిరీస్  ఎలాంటి ప్రదర్శన కనపరిచాడో అందరికీ తెలిసిందే. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ వికెట్ కోల్పోకుండా బంతి ఒళ్లంతా గాయపరచిన్నప్పటికీ ఏమాత్రం లెక్కచేయకుండా సిరీస్ విజయంలో కీలక పాత్ర వహించాడు.

అయితే గాయాలతో ఇంటికి వచ్చిన తన తండ్రి పూజారా గురించి కూతురు అతిధి పలికిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 'మా నాన్నకు అయిన గాయాలు మాన్పించడానికి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. ఎక్కడ దెబ్బలు తగిలాయో అక్కడ ముద్దిస్తా.. దీంతో మా నాన్నకు గాయాల నొప్పి తగ్గిపోతుంది' అంటూ ముసిముసి మాటలు పలికింది. ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  మరోవైపు తన కెప్టెన్సీ తో జట్టును నడిపిస్తూ సిరీస్ విజయంలో కీలక పాత్ర వహించిన కెప్టెన్ అజింక్యా రహానే ఇంటికి చేరుకుని తన కూతురు ఆర్య ని ఎత్తుకొని సేదతీరుతూ కనిపించాడు.

టీమిండియా యువ పేసర్ మహమ్మద్ సిరాజ్ తండ్రి ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అయితే సిరాజ్ హైదరాబాద్ చేరుకోగానే తన తండ్రి మహ్మద్‌ గౌస్‌ సమాధిని సందర్శించాడు. తాను ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఉన్న తండ్రి శ్రమను గుర్తుచేసుకుంటూ ఆయనకు నివాళులు అర్పిస్తూ కన్నీరు కార్చాడు. సిరీస్ లో తన ప్రదర్శనను తన తండ్రికి అంకితం ఇస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇక టీమిండియా స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగే పోరుకు సిద్ధమవుతోంది.


హెచ్ -1బీ పై తాజా వెసులుబాటు...ఎన్నారైల ఓట్లకు కృతజ్ఞత చూపించాడుగా..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

రాధే శ్యామ్ పరమహంస సీక్రెట్ బయటపెట్టిన కృష్ణంరాజు !

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ యువ‌త జాగృతం కావాలి.. రాజ‌కీయాల‌కు చేరువ అవ్వాలి..!

హెరాల్డ్ సెటైర్ : రాజకీయ యాత్రలతో రచ్చ చేస్తున్న ప్రతిపక్షాలు

ఆర్థిక కష్టం.. టిడిపికి ఎంతో నష్టం ?

జగనోరు చులకనవుతున్నారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>