PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktr-telangana-cm71da6456-c7ab-455e-bd34-42fec0011e18-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktr-telangana-cm71da6456-c7ab-455e-bd34-42fec0011e18-415x250-IndiaHerald.jpgకేటీఆర్ ను సీఎం చేసేందుకు రెండు ముహుర్తాలను ఖరారు చేశారని, అందులో ఏదో ఒక రోజు కేటీఆర్ కు పట్టాభిషేకం ఉంటుందని చెబుతున్నారు.ఫిబ్రవరి 18న సూర్యుడి జన్మదినంగా చెప్పుకునే రథసప్తమి రోజునే తాను సీఎం పదవి నుంచి తప్పుకుని కొడుకు కేటీఆర్‌కు అప్పజెప్పే అవకాశాలున్నాయని అంటున్నారు.ktr telangana cm;kcr;ktr;ganga;surya sivakumar;tiru;telangana rashtra samithi trs;ganges;telangana;cm;chief minister;february;chinna jeeyar swamy ji;yadadri;mantraఆ ముహార్తానికే సీఎంగా కేటీఆర్ !ఆ ముహార్తానికే సీఎంగా కేటీఆర్ !ktr telangana cm;kcr;ktr;ganga;surya sivakumar;tiru;telangana rashtra samithi trs;ganges;telangana;cm;chief minister;february;chinna jeeyar swamy ji;yadadri;mantraFri, 22 Jan 2021 09:05:46 GMTతెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం కేటీఆర్ చుట్టే తిరుగుతున్నాయి. కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలంటూ టీఆర్ఎస్ నేతలే పోటీపడి మరీ ప్రకటనలు చేస్తుండటంతో జనాలు కూడా దీనిపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. కేటీఆర్  ముఖ్యమంత్రి పట్టాభిషేకానికి ఏర్పాట్లన్ని సిద్ధమయ్యాయని కొందరు చెబుతుండగా..  జనంలోకి ఫీలర్లను వదిలి ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారని మరికొందరు వాదిస్తున్నారు. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం కేటీఆర్ ను సీఎం చేసేందుకు రెండు ముహుర్తాలను ఖరారు చేశారని, అందులో ఏదో ఒక రోజు కేటీఆర్ కు పట్టాభిషేకం ఉంటుందని చెబుతున్నారు.

          ఫిబ్రవరి 18న సూర్యుడి జన్మదినంగా చెప్పుకునే రథసప్తమి రోజునే తాను సీఎం పదవి నుంచి తప్పుకుని కొడుకు కేటీఆర్‌కు అప్పజెప్పే అవకాశాలున్నాయని అంటున్నారు. సంఖ్యాశాస్త్రం ప్రకారమూ ఫిబ్రవరి 18 కలిసొస్తుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. మాఘపౌర్ణమి ఫిబ్రవరి 27 కూడా మంచి ముహూర్తమని బ్రాహ్మణ పండితులు చెబుతున్నారట.  వాస్తవానికి మే నెల వరకూ మూఢాలు అయినప్పటికీ ఫిబ్రవరి 18, 27 తేదీలలో దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయంటున్నారు. ఫిబ్రవరి 16న వసంత పంచమి కావడంతో యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవం ఉండే అవకాశం ఉంది. అందుకే ఆ రోజు సీఎం బాధ్యతలను కేటీఆర్‌కు అప్పజెప్పకపోవచ్చని తెలిసింది.

   
   ఆ ముహూర్తం దాటిపోతే  కార్తీక పౌర్ణమి తరహాలో దివ్యమైన దినంగా భావించే మాఘ పౌర్ణమి  ఫిబ్రవరి 27 ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ రెండూ సంఖ్యా శాస్త్రం ప్రకారం ‘తొమ్మిది’తో ముడిపడి ఉన్నవే.స్పష్టమైన నిర్ణయం తీసుకునే ముందు చినజీయర్ స్వామిని కూడా కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో కాకుంటే ఇక ఏప్రిల్ చివరి వరకూ ఆగాల్సిందేనని, అలాంటి పరిస్థితులలో ప్లీనరీని వేదికగా చేసుకుని ప్రకటించాల్సి ఉంటుందని పార్టీవర్గాల సమాచారం. వీలైన మేరకు రథసప్తమి ముహూర్తాన్నే ఖరారు చేసే అవకాశం ఉంది.ముఖ్యమంత్రి మార్పుపై స్వయంగా మంత్రులే బహిరంగంగా కామెంట్ చేస్తున్నా కేసీఆర్ ‌ కేటీఆర్..సైలెంట్ గా ఉండటం ఈ కామెంట్లకు బలం చేకూరుస్తోంది.




బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ పాల‌న‌లో అర్చ‌కులపై ఉక్కుపాదం.. ఇవే సాక్ష్యాలు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

రాధే శ్యామ్ పరమహంస సీక్రెట్ బయటపెట్టిన కృష్ణంరాజు !

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ యువ‌త జాగృతం కావాలి.. రాజ‌కీయాల‌కు చేరువ అవ్వాలి..!

హెరాల్డ్ సెటైర్ : రాజకీయ యాత్రలతో రచ్చ చేస్తున్న ప్రతిపక్షాలు

ఆర్థిక కష్టం.. టిడిపికి ఎంతో నష్టం ?

జగనోరు చులకనవుతున్నారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>