Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyance097583-0949-42d9-82df-6f4d0b97cc37-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyance097583-0949-42d9-82df-6f4d0b97cc37-415x250-IndiaHerald.jpg ఆలయాలపై ఇన్ని దాడులు జరుగుతున్నా వైసీసీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఏంటని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల విషయంలో ఒకలా, ఇతర మతాల విషయంలో మరోలా స్పందించటం తప్పని, అన్ని మతాలనూ సమానంగా చూడడమే సెక్యులరిజమని పవన్ అన్నారు. సెక్యులరిజం అంటే..pawan kalyan;pawan;pawan kalyan;tiru;janasena;scheduled caste;scheduled tribes;government;tirupati;media;fire;husband;ycp;janasena party;rama tirtha;hindus;party‘అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి బురదలో పొర్లిందట’.. వైసీపీపై నిప్పులు చెరిగాన పవన్..‘అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి బురదలో పొర్లిందట’.. వైసీపీపై నిప్పులు చెరిగాన పవన్..pawan kalyan;pawan;pawan kalyan;tiru;janasena;scheduled caste;scheduled tribes;government;tirupati;media;fire;husband;ycp;janasena party;rama tirtha;hindus;partyFri, 22 Jan 2021 13:36:33 GMTతిరుపతి: ఆలయాలపై ఇన్ని దాడులు జరుగుతున్నా వైసీసీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఏంటని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల విషయంలో ఒకలా, ఇతర మతాల విషయంలో మరోలా స్పందించటం తప్పని, అన్ని మతాలనూ సమానంగా చూడడమే సెక్యులరిజమని పవన్ అన్నారు. సెక్యులరిజం అంటే హిందూ ఆలయాలపై దాడులు జరిగితే మౌనంగా ఉండటం కాదని, వైకాపా సర్కారు ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 142 ఆలయాలపై దాడులు జరిగాయని, కానీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తోందని, ఇదేనా ప్రభుత్వ బాధ్యత అంటూ పవన్‌ ప్రశ్నించారు. శుక్రవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన పవన్ వైసీసీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇతర మతాలపై దాడి జరిగితే ప్రపంచమంతా గగ్గోలు పెడుతుందని, కానీ హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే మాత్రం ఎందుకు పట్టించుకోరని పవన్ నిలదీశారు.

ఓ రథం పోతే ఇంకో రథం చేయిస్తామంటూ ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో సెక్షన్‌ 144, పోలీస్‌ యాక్ట్‌ 30 విచ్చల విడిగా ఉపయోగిస్తున్నారని, సోషల్‌ మీడియాతో చిన్న చిన్న పోస్టులు పెడితే నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెడుతున్నారని  పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. విచిత్రంగా దళితులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని కోరితే వారిపైనా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కానీ, వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం విచ్చలవిడిగా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారిని అడ్డుకునే వారే లేకుండా పోయాని నిప్పులు చెరిగారు.

‘అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి బురదలో పొర్లిందన్న రీతిలో సాగుతోంది వైసీపీ పాలన. పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన నేతలు.. పేకాట క్లబ్బులను నిర్వహించే స్థాయికి దిగజారారు. మీడియాపై కూడా దాడులు పెరుగుతున్నాయి. రామతీర్థం వచ్చి ఆందోళన చేయడానికి మాకు క్షణం పట్టదు. మతం కంటే మానవత్వం ముఖ్యమని జనసేన నమ్ముతుంది. ఎన్నికల్లో పోటీకి నిలబడిన వారిపై దాడులు చేసే సంస్కృతిని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ అరాచకాలపై అందరూ సమష్టిగా పోరాడాల్సిన అవసరముంది. అందుకు జనసేన పార్టీ ముందుంటుంది’ అంటూ పవన్‌ భావోద్వేగంగా మాట్లాడారు.




బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌.. నాడు-నేడు.. నిర్వీర్యం దిశ‌గా అడుగులు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: డిప్యూటీ స్పీక‌ర్ సార్ మౌనం.. ఇంత జ‌రిగినా.. నోరు మెద‌ప‌రా..?

సౌందర్య చెప్పిన మాట విని చలించిపోయా: ఎస్ వి కృష్ణా రెడ్డి

వైసీపీకి మ‌రో షాక్‌.... జ‌గ‌న్‌కు దెబ్బ మీద దెబ్బ‌...!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణుల‌కు కీల‌క ప‌ద‌వులేవి... సెగ మొద‌లైంది...!

లిప్ లాక్ తో ఇబ్బందుల్లో పడ్డ ప్రదీప్..

జ‌గ‌న్‌కు ఈ కులాల‌న్ని దూరం దూరం... దెబ్బ‌డిపోతోందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>