MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sushant-singhca77549f-dc5e-41aa-83da-9e1b4c17ae0e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sushant-singhca77549f-dc5e-41aa-83da-9e1b4c17ae0e-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ చిత్ర పరిశ్రమలో యువ నటుడు సుశాంత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ అంచెలు అంచెలుగా ఎదిగాడు. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ 14 June 2020న అనుమానస్పద రీతిలో మృతి చెందిన సంగతి తెలిసిందే కదా. ఈయన మరణం భారతీయ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో సినీ మాఫియా ఓ హీరో జీవితాన్ని ఎలా బలి తీసుకున్నదో సుశాంత్ ఉదంతం ఒక ఉదాహరణగా నిలిచింది.sushant singh;jayanthi;ms dhoni;sushant singh;abhishek;sushanth;mumbai;delhi;korea, south;indira gandhi;congress;bollywood;media;television;hero;yuva;june;jayamబాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు అరుదైన గౌరవం..!బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు అరుదైన గౌరవం..!sushant singh;jayanthi;ms dhoni;sushant singh;abhishek;sushanth;mumbai;delhi;korea, south;indira gandhi;congress;bollywood;media;television;hero;yuva;june;jayamFri, 22 Jan 2021 09:00:00 GMTబాలీవుడ్ చిత్ర పరిశ్రమలో యువ నటుడు సుశాంత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ అంచెలు అంచెలుగా ఎదిగాడు. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ 14 june 2020న అనుమానస్పద రీతిలో మృతి చెందిన సంగతి తెలిసిందే కదా. ఈయన మరణం భారతీయ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో సినీ మాఫియా ఓ హీరో జీవితాన్ని ఎలా బలి తీసుకున్నదో సుశాంత్ ఉదంతం ఒక ఉదాహరణగా నిలిచింది.

ఇక బిహార్‌లోని మారుమూల గ్రామం నుండి టీవీ నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి.. ఆ తర్వాత బాలీవుడ్‌లో హీరోగా ఎదిగిన వైనం ఎందరికో ఆదర్శంగా నిలిచింది. హీరోగా ఎంతో ఉన్నత స్థానానికి చేరుకుంటాడనుకున్న ఈయన అకాల మరణాన్ని ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్డించుకోలేకపోతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే... తాజాగా  దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఆండ్రూస్ గంజ్‌లో ఉన్న స్ట్రెచ్ రోడ్డుకు సుశాంత్ సింగ్ రాజ్‌‌పుత్ పేరు పెట్టాలని ఆయన జయంతి రోజున ఆమోదించారు.  గతేడాది సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ కాంగ్రెస్ కౌన్సిలర్ అభిషేక్ దత్ గతేడాది ప్రతిపాదించారు.

అయితే ఆ ప్రాంతంలో ఎక్కువ బిహార్ ప్రాంతంలోని రోడ్డు నంబరు 8లో బీహార్‌కు చెందిన వారు నివసిస్తున్నారని అప్పట్లో ప్రతిపాదించారు. దీంతో సౌత్ ఢిల్లీలోని ఆండ్రూస్ గంజ్ నుంచి ఇందిరా క్యాంపునకు దారి తీసే రోడ్డుకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మార్గ్‌గా పేరు పెట్టారు.  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషయానికొస్తే.. ఈయన పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. "కై పో చే", "ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ", "కేదార్‌నాథ్" చిత్రాలు మంచి పేరును తెచ్చాయి. సుశాంత్‌కు నేటితో 35 ఏళ్లు నిండాయి. గతేడాది జూన్ 14న ముంబై, బాంద్రాలోని తన నివాసంలో సుశాంత్ విగత జీవిగా కనిపించాడు. అతడి బర్త్ డే సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా సుశాంత్‌ను గుర్తు చేసుకున్నారు. 


ఆ ముహార్తానికే సీఎంగా కేటీఆర్ !

బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ పాల‌న‌లో అర్చ‌కులపై ఉక్కుపాదం.. ఇవే సాక్ష్యాలు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

రాధే శ్యామ్ పరమహంస సీక్రెట్ బయటపెట్టిన కృష్ణంరాజు !

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ యువ‌త జాగృతం కావాలి.. రాజ‌కీయాల‌కు చేరువ అవ్వాలి..!

హెరాల్డ్ సెటైర్ : రాజకీయ యాత్రలతో రచ్చ చేస్తున్న ప్రతిపక్షాలు

ఆర్థిక కష్టం.. టిడిపికి ఎంతో నష్టం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>