PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ap-cm-jagan-ruling610e975c-08d8-4fbc-a93e-724fb77d241d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ap-cm-jagan-ruling610e975c-08d8-4fbc-a93e-724fb77d241d-415x250-IndiaHerald.jpgఇంతకుముందు చాలా సార్లు కొన్ని అంశాలకు వ్యతిరేకంగా జగనోరు పిటిషన్ వేస్తూనే ఉన్నారు. న్యాయస్థానాలు వాటిని తిరస్కరించాయి. అయినా జగనోరు తన పంథాను మార్చుకోకుండా మళ్లీ హై కోర్ట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లడాన్ని రాష్ట్ర ప్రజలు ద్వేషిస్తున్నారు. ఇకనైనా అభివృద్ధిపై దృష్టి పెట్టండి సారూ అంటూ అదే అభ్యర్థిస్తున్నారు.ap cm jagan ruling;kumaar;jagan;andhra pradesh;government;panchayati;court;february;press;local language;supreme court;lieజగనోరు...మీరు మారరా...మీ పంథా మార్చుకోండి సార్...?జగనోరు...మీరు మారరా...మీ పంథా మార్చుకోండి సార్...?ap cm jagan ruling;kumaar;jagan;andhra pradesh;government;panchayati;court;february;press;local language;supreme court;lieFri, 22 Jan 2021 09:00:00 GMTకుమార్ కి మధ్య స్థానిక ఎన్నికల యుద్ధం కొలిక్కిరానంటోంది. అయితే ఇటీవలే ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది హైకోర్టు. ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 11న సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది.. ప్రజారోగ్యం, ఎన్నికలు ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని ఎటువంటి సమస్యలు తలెత్తకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. దాంతో తాజాగా జగన్ సర్కారు హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం సరికాదని ఎదురుతిరిగింది.

ఎన్నికల నిర్వహణ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది రాష్ట్రప్రభుత్వం. ప్రస్తుతం కరోనా వాక్సినేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులందరూ అందులోనే నిమగ్నులై ఉన్నారు. మరోవైపు కరోనా వ్యాప్తి కూడా పూర్తిగా అంతరించని ఈ సమయంలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించడం చాలా ప్రమాదకరమని కాబట్టి ఈ ఎన్నికలను వాయిదా వేయాలని కోరింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలన్న వాదనను, ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఈ ఎన్నికలను వ్యతిరేకిస్తున్న అంశాన్ని, పిటిషన్లో చేర్చింది ప్రభుత్వం. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ రాష్ట్రం ఇలా హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లు పేర్కొంది.

మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేము అంటూ గళమెత్తారు. కోవిడ్ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం సరికాదని మండిపడుతున్నారు. హైకోర్టు తీర్పును మేము గౌరవిస్తాము కానీ.... ఇటు మా ప్రాణాలను అటు ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల గురించి మరో సారి ఆలోచించాలి అంటూ అభ్యర్థిస్తున్నారు. కానీ హైకోర్టు అలా తీర్పు ఇచ్చిందో లేదో.... ఇలా దూకుడు పెంచేశారు నిమ్మగడ్డ రమేష్. హైకోర్టు తీర్పు తర్వాత మీడియాకు ప్రెస్ నోట్ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చినట్లేనని  స్పష్టం చేశారు. నాలుగు దశల్లో (ఫిబ్రవరి 5, 9, 13, 17) ఎన్నికలు నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. ఎన్నికల కమిషన్ పోలింగ్ సిబ్బంది, ఓటర్ల భద్రతపై ఫోకస్  పెట్టిందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు.

అయితే సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై ఈ ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ రోజు లేదా రేపు ఈ విషయంపై సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సుప్రీం కోర్టు నుండి ఏ తీర్పు రాబోతుందా అన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పైగా ఇంతకుముందు చాలా సార్లు కొన్ని అంశాలకు వ్యతిరేకంగా జగనోరు పిటిషన్ వేస్తూనే ఉన్నారు. న్యాయస్థానాలు వాటిని తిరస్కరించాయి. అయినా జగనోరు తన పంథాను మార్చుకోకుండా మళ్లీ హై కోర్ట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లడాన్ని రాష్ట్ర ప్రజలు ద్వేషిస్తున్నారు. ఇకనైనా అభివృద్ధిపై దృష్టి పెట్టండి సారూ అంటూ అదే అభ్యర్థిస్తున్నారు.


వదిలి వెళ్లాలని లేదు.. తెగ ఫీల్ అవుతున్న కీర్తి సురేష్..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఏపీ అసెంబ్లీలో బ్రాహ‌ణ గొంతు వినిపించ‌దా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఐదువేల పింఛ‌న్‌తో అయ్య‌వారికి శ‌ఠ‌గోపం.. జ‌గ‌న‌న్న మార్కు రాజ‌కీయం..!

వాళ్లకు కేసీఆర్ కంటే వ్యాపారాలే ముఖ్యమా...?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌.. నాడు-నేడు.. నిర్వీర్యం దిశ‌గా అడుగులు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: డిప్యూటీ స్పీక‌ర్ సార్ మౌనం.. ఇంత జ‌రిగినా.. నోరు మెద‌ప‌రా..?

సౌందర్య చెప్పిన మాట విని చలించిపోయా: ఎస్ వి కృష్ణా రెడ్డి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>