BeautyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/beauty/sagittarius_sagittarius/eye-broseab8f18d8-5da8-4e4f-8e5d-68ae41d74709-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/beauty/sagittarius_sagittarius/eye-broseab8f18d8-5da8-4e4f-8e5d-68ae41d74709-415x250-IndiaHerald.jpgకనుబొమ్మలు ఎంత అందంగా ఉంటే అమ్మాయి అందం అంత రెట్టింపు అవుతుంది. కనుబొమ్మల ఆకృతిని మార్చడానికి ఎంతోమంది అమ్మాయిలు పార్లర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అంతేకాకుండా సెలూన్ స్టైల్ రావాలని వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు. ఇలా ఎన్ని ప్రయోగాలు చేసినప్పటికీ కనుబొమ్మలు మాత్రం కొంతమందిలో పలుచగా ఉంటాయి. అలాంటి వారు మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్ తో పాటు కాస్మెటిక్స్ తెచ్చి వాడుతున్నారు.కానీ ప్రస్తుతం ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటించి,మీ కనుబొమ్మలను ఒత్తుగా ఎలా తయారు చేసుకోవాలో? ఇప్పుడు ఇక్కడ తెలుసeye brose;beauty;tiru;vitamin;girlకనుబొమ్మలు ఒత్తుగా లేవని చింతిస్తున్నారా?కనుబొమ్మలు ఒత్తుగా లేవని చింతిస్తున్నారా?eye brose;beauty;tiru;vitamin;girlFri, 22 Jan 2021 15:30:00 GMTకనుబొమ్మలు ఎంత అందంగా ఉంటే అమ్మాయి అందం అంత రెట్టింపు అవుతుంది. కనుబొమ్మల ఆకృతిని మార్చడానికి ఎంతోమంది అమ్మాయిలు పార్లర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అంతేకాకుండా సెలూన్ స్టైల్ రావాలని వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు. ఇలా ఎన్ని ప్రయోగాలు చేసినప్పటికీ కనుబొమ్మలు మాత్రం కొంతమందిలో పలుచగా ఉంటాయి. అలాంటి వారు మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్ తో పాటు కాస్మెటిక్స్ తెచ్చి వాడుతున్నారు.కానీ ప్రస్తుతం ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటించి,మీ కనుబొమ్మలను  ఒత్తుగా ఎలా తయారు చేసుకోవాలో? ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.


ముఖ్యంగా ఇందుకోసం ఒక చిన్న గిన్నెలో పావు టేబుల్ స్పూన్ ఆముదం నూనెను తీసుకోవాలి. ఇక అంతే మోతాదులో వ్యాజిలైన్ పెట్రోలియం జెల్లీ ను తీసుకొని, రెండింటిని బాగా మిక్స్ చేయాలి. ఇక ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ పడుకునే ముందు ఐబ్రోస్ పై అప్లై చేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ప్రతి రోజూ ఇలా చేయడం వల్ల రెండు వారాల తర్వాత మీ కనుబొమ్మలు ఒత్తుగా పెరగడాన్ని మీరు  గమనించవచ్చు.


ఆముదం, పెట్రోలియం జెల్లీలోని మాయిశ్చరైజర్  గుణాలు కనుబొమ్మలను మాయిశ్చరైజ్ చేసి ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.ఈ మిశ్రమాన్ని కేవలం కనుబొమ్మలకు మాత్రమే  కాకుండా కనురెప్పలకు కూడా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

అంతేకాకుండా విటమిన్ ఇ  క్యాప్సిల్స్ కూడా కనుబొమ్మలు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతాయి. విటమిన్ ఇ  క్యాప్సిల్ లోని జెల్ ను  అరచేతిలోకి వేసుకొని,  మునివేళ్లతో కనుబొమ్మలతో పాటు కనురెప్పల పై కూడా అతి సున్నితంగా మర్దన చేయాలి. ఈ పద్ధతిని కూడా రాత్రి పడుకోబోయే ముందు చేయడం ఉత్తమం. ఉదయాన్నే చల్లని నీటితో కడిగేసుకుంటే,ఒకటి నుండి రెండు వారాల లోపు కనుబొమ్మలతో పాటు కనురెప్పలు కూడా పెరగడం గమనించవచ్చు. కాబట్టి పైన తెలిపిన రెండు పద్ధతులను పాటించి పలుచని మీ కనుబొమ్మలను ఒత్తగా తయారు చేసుకొని,మీ అందాన్ని మరింత రెట్టింపు చేసుకోండి.


సుకన్య సమృద్ధి యోజన.. ఆన్ లైన్ లోనే డబ్బులు కట్టండి ఇలా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఏపీ అసెంబ్లీలో బ్రాహ‌ణ గొంతు వినిపించ‌దా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఐదువేల పింఛ‌న్‌తో అయ్య‌వారికి శ‌ఠ‌గోపం.. జ‌గ‌న‌న్న మార్కు రాజ‌కీయం..!

వాళ్లకు కేసీఆర్ కంటే వ్యాపారాలే ముఖ్యమా...?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌.. నాడు-నేడు.. నిర్వీర్యం దిశ‌గా అడుగులు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: డిప్యూటీ స్పీక‌ర్ సార్ మౌనం.. ఇంత జ‌రిగినా.. నోరు మెద‌ప‌రా..?

సౌందర్య చెప్పిన మాట విని చలించిపోయా: ఎస్ వి కృష్ణా రెడ్డి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>