Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/money/126/money-money-contract-reletives-becomes-news3c17b1dd-6b1f-4733-b83a-18d234b530aa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/money/126/money-money-contract-reletives-becomes-news3c17b1dd-6b1f-4733-b83a-18d234b530aa-415x250-IndiaHerald.jpgప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్ యుగం నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఏదైనా కొనుగోలు చేసిన లేదా ఎవరికైనా డబ్బులు చెల్లించాలి అన్న కూడా ఇక నగదు రూపంలోనే డబ్బులు చెల్లించే వారు కానీ ఇప్పుడు మాత్రం నగదు తక్కువగా వాడితే ఎక్కువగా డిజిటల్ పేమెంట్ ద్వారా లావాదేవీలు జరుపుతున్నారు. ప్రతి ఒక్కరు కేవలం లావాదేవీలు మాత్రమే కాదు కొన్ని బ్యాంక్ స్కీమ్ లలో కట్టాల్సిన డబ్బులు కూడా ఆన్లైన్ పేమెంట్ ద్వారా చేసుకోవడానికి ప్రస్తుతం అవకాశం ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఒకవేళ మీరు సుకన్య సమృద్ధి యోజన లేదా పబ్లికmoney;sukanya;india;rbi;bank;cheque;central governmentసుకన్య సమృద్ధి యోజన.. ఆన్ లైన్ లోనే డబ్బులు కట్టండి ఇలా..?సుకన్య సమృద్ధి యోజన.. ఆన్ లైన్ లోనే డబ్బులు కట్టండి ఇలా..?money;sukanya;india;rbi;bank;cheque;central governmentFri, 22 Jan 2021 15:35:00 GMTబ్యాంక్ స్కీమ్  లలో కట్టాల్సిన డబ్బులు కూడా ఆన్లైన్ పేమెంట్ ద్వారా చేసుకోవడానికి ప్రస్తుతం అవకాశం ఉంటుంది అనే విషయం తెలిసిందే.  ఒకవేళ మీరు సుకన్య సమృద్ధి యోజన లేదా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లాంటి అకౌంట్లు కలిగి ఉంటే మీకు ఈ వార్త శుభవార్త అని చెప్పాలి.



 ఇక ఈ రెండు పాలసీలలో అకౌంట్లు కలిగి ఉన్నవారు డబ్బులు కట్టాలి అంటే పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకు కు వెళ్లేవారు కానీ ఇప్పటి నుంచి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. సులభంగా ఈ పథకాల్లో డబ్బులు డిపాజిట్ చేయవచ్చు. ఎక్కడికి వెళ్లకుండా నే ఆన్లైన్ లోనే డబ్బులు డిపాజిట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ కలిగినవారు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా పలు రకాల సేవలు పొందేందుకు అవకాశం ఉంటుంది.  బాలన్స్ చెక్ చేసుకోవడం,మనీ ట్రాన్స్ఫర్, ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సర్వీసులు కూడా పొందేందుకు ప్రస్తుతం కస్టమర్లకు వీలు ఉంటుంది.



 ఇక అంతే కాకుండా ఇటీవల కేంద్ర ప్రభుత్వం డక్ పే అనే డిజిటల్ పేమెంట్ యాప్ ను కూడా తీసుకు వచ్చింది.  ఈ క్రమంలోనే ఈ రెండు పథకాలలో అకౌంట్ కలిగి ఉంటే ఈ యాప్ ను ఉపయోగించి ఎంతో సులభంగా డబ్బులు కట్టేందుకు అవకాశం ఉంటుంది. దీంతో అటు కస్టమర్లకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మీరు సుకన్య సమృద్ధి అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేయాలని భావిస్తే.. ఐపీపీబీ అకౌంట్‌కు డబ్బులు యాడ్ చేసుకోవాలి. తర్వాత డీఓపీ ప్రొడక్టుల్లోకి వెళ్లాలి. ఇక్కడ సుకన్య సమృద్ధి అకౌంట్ ఎంచుకోవాలి. మీ ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బు ఎంతనో ఎంటర్ చేయాలి. ఓకే చేయాలి. కేవలం సుకన్య సమృద్ధి అకౌంట్ మాత్రమే కాకుండా పీపీఎఫ్, ఆర్‌డీ వంటి వాటిల్లో కూడా ఇలాగే డబ్బులు డిపాజిట్ చేయొచ్చు.


బ్రాహ్మ‌ణ ఘోష‌: ఏపీ అసెంబ్లీలో బ్రాహ‌ణ గొంతు వినిపించ‌దా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఐదువేల పింఛ‌న్‌తో అయ్య‌వారికి శ‌ఠ‌గోపం.. జ‌గ‌న‌న్న మార్కు రాజ‌కీయం..!

వాళ్లకు కేసీఆర్ కంటే వ్యాపారాలే ముఖ్యమా...?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌.. నాడు-నేడు.. నిర్వీర్యం దిశ‌గా అడుగులు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: డిప్యూటీ స్పీక‌ర్ సార్ మౌనం.. ఇంత జ‌రిగినా.. నోరు మెద‌ప‌రా..?

సౌందర్య చెప్పిన మాట విని చలించిపోయా: ఎస్ వి కృష్ణా రెడ్డి

వైసీపీకి మ‌రో షాక్‌.... జ‌గ‌న్‌కు దెబ్బ మీద దెబ్బ‌...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>