PoliticsParisa Rama Krishna Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/a-weapon-that-can-make-you-the-wealthiest-6e130540-b0be-4bd5-bfb8-30bbe269bdee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/a-weapon-that-can-make-you-the-wealthiest-6e130540-b0be-4bd5-bfb8-30bbe269bdee-415x250-IndiaHerald.jpgఅదే పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ {సర్జన్} జీతం నలభై వేల రూపాయలు. మన వారు ఒక్కో జాబ్ కు ఒక్కో “సోషల్ స్టేటస్” లేదా “ప్రిస్టీజ్ - ప్రతిష్ట” అంటగట్టేసారు. ఇంజనీర్, డాక్టర్ అంటే గొప్పప్రతిష్టాత్మక పదవి అని టీచర్ అంటే ఏదో పనికి రాని జాబ్ అని, ప్లంబర్, ఫిట్టర్ లాంటి పనులు చేస్తున్నాను అంటే వివాహం చేసుకోవటానికి అమ్మాయి కూడా దొరకని పరిస్థితి. అంతెందుకు పురోహిత్యం చేసే వారికి విదేశాల్లో చాల డిమాండ్ వుంది. అయినా పురోహితుణ్ణి పెళ్ళిచేసుకోవటానికి అమ్మాయిలు ముందుకు రాని పరిస్థితులు మన సమాజంలో నెలకొని ఉన్నాయి.dignity of labour;pratishta;tara;mauritius;american samoa;engineer;village;job;minister;doctor;girl;letter;service;masterమీ ఆలోచనలో "చిన్నమార్పు" తో జీవితాన్ని ఎన్రిచ్ చేసుకోండిమీ ఆలోచనలో "చిన్నమార్పు" తో జీవితాన్ని ఎన్రిచ్ చేసుకోండిdignity of labour;pratishta;tara;mauritius;american samoa;engineer;village;job;minister;doctor;girl;letter;service;masterFri, 22 Jan 2021 08:00:00 GMTఅన్ని రంగాల్లో  నైపుణ్యం గల పనిమంతులు కావాలి. పనిమంతులుగా తయారవ్వండి.  ఎవడి దయాదాక్షిణ్యాలు ఇందులో అవసరం లేదు.

"మీరే రాజు - మీరే మంత్రి" అవండి.  

ప్రభుత్వాలు ఎరజూపే నిరుద్యోగ భృతులను ఉచిత సర్వీస్ లను తిప్పికొట్టండి. ప్రభుత్వాలు మనకిచ్చే నిత్యావసర వస్తుసరపరా మన ఇంటి వరకు తెచ్చి సేవ జేసే భాగ్యాన్ని కలిపించే స్థాయికి నిరుద్యోగులు, సోమరిపోతుల ఉత్పత్తిని మొదలెట్టాయి. పెన్షన్లను మన గడప వరకు తెచ్చి ఇస్తారట. మరి మనం దొబ్బితిని, మందుగొట్టి, పెళ్ళాం పక్కలో నిద్దర పోదామా! చీపెస్ట్ ఎంటెర్టైన్మెంటును కాని ఖర్చు లేకుండా ఉచితంగా  ఎంజాయ్ చేస్తూ పిల్లల్ని మరి కొందరు భవిష్యత్ సోమరిపోతుల్ని ఉత్పత్తి చేద్ధామా?

మనం మైకంలో సోమరులుగా తయారైతే మన జాతి, ధన, భూసంపదను కొల్లగొట్టేస్తూ రాజకీయ నాయకులు  ఒక్కొక్కడు లక్షలకు లక్షల కోట్లు కొట్టేస్తూ ఉండటానికి కారణం కారణం మనం పని చేసి సంపాదించకుండా పాలన పేరుతో మన సొమ్ము లేకపోతే అప్పులు చేసి 'ఫ్రీ బీస్'  ఇస్తూ జాతి జనాన్ని నిర్వీర్యులను చేసేస్తూ వాళ్ళు సర్వ సంపదలను అనుభవిస్తున్నారు.        

భారత యువతకు "డిగ్నిటీ-ఆఫ్-లేబర్" మాత్రమే విజయం తెచ్చిపెడుతుంది. ఏదైనా గ్రామంలోకి వెళ్లి ఒక రైతుని మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్య ఏమిటని అడగండి.

*వ్యవసాయానికి కూలీలు దొరకడం లేదు అంటారు.

*పట్టణంలోకి వెళ్లి ఒక హోటల్ యజమానిని అడగండి. కుక్స్, వెయిటర్స్, ఫ్రంట్ ఆఫీస్ పనులు చేయడానికి సరైన వ్యక్తులు దొరకడం లేదు అంటారు...

"అసలు ఈశాన్య భారతదేశం వారు ఉండబట్టి సరిపోయింది. లేకపొతే పెద్ద క్రైసిస్ వచ్చివుండేది" అని ఒక హోటల్ యజమాని అంటున్నాడు.

*భవన నిర్మాణ దారుణ్ని అడగండి ప్లంబర్లు, ఫిట్టర్లు మొదలైన వారు దొరకడం లేదు అంటారు.

మారిషస్ వాళ్ళకు అక్కడ పురోహితుడు, కుక్ కావాలి దొరకడం లేదు సాయం చెయ్యండి అని వారు అడుగుతున్నారు. ఒక పక్క దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా వుంది అంటున్నారు. మరో పక్క అన్ని రంగాల్లో సరైన నైపుణ్యం ఉన్న వ్యక్తులు దొరకడంలేదు అని ఆయా రంగాల్లో నిపుణులు చెబుతున్నారు.

ఈ వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి...

హోటల్స్ లో దోస మాస్టర్ కు ఇరవై/ముప్పై వేల రూపాయిలు ప్రారంభ జీతం వుంది. అదే సివిల్ ఇంజనీర్లు పది వేల జీతానికి కూడా “క్యు” కడుతున్నారు.

సమస్య ఎక్కడ వుంది అంటే అందరికి “వైట్ కాలర్ జాబ్” లే కావాలి. జీతం ఎక్కువ వస్తుంది అని కాదు. చాల “సెమి స్కిల్ల్డ్ జాబ్స్” కు రెండు మూడు రెట్లు ఎక్కువ జీతం వస్తుంది. ఈరోజు ప్రభుత్వ టీచర్ ప్రారంభ జీతం దాదాపు 50 వేలరూపాయలు.

అదే పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ {సర్జన్} జీతం నలభై వేల రూపాయలు. మన వారు ఒక్కో జాబ్ కు ఒక్కో “సోషల్ స్టేటస్” లేదా “ప్రిస్టీజ్ - ప్రతిష్ట” అంటగట్టేసారు. ఇంజనీర్, డాక్టర్ అంటే గొప్పప్రతిష్టాత్మక పదవి అని టీచర్ అంటే ఏదో పనికి రాని జాబ్ అని, ప్లంబర్, ఫిట్టర్ లాంటి పనులు చేస్తున్నాను అంటే వివాహం చేసుకోవటానికి అమ్మాయి కూడా దొరకని పరిస్థితి. అంతెందుకు పురోహిత్యం చేసే వారికి విదేశాల్లో చాల డిమాండ్ వుంది. అయినా పురోహితుణ్ణి పెళ్ళిచేసుకోవటానికి అమ్మాయిలు ముందుకు రాని పరిస్థితులు మన సమాజంలో నెలకొని ఉన్నాయి.

కంప్యూటర్ ఇంజనీర్ అని చెప్పుకొంటూ ఆరునెలలుగా జీతాలు ఇవ్వక పోయినా కేవలం ప్రెస్టేజ్ కోసం పనిచేసేవారు వున్నారు. అదే హోటల్ లో కుక్ గా వెయిటర్ గా చెయ్యమంటే అవమానం, నామోషీ. తల తీసిన భావనతో తలకిందులౌతారు. ఇదే మన వారు అమెరికాకు వెళితే అక్కడ హోటల్ లో, షాపుల్లో, ట్యూషన్లు చెప్పటానికి ఏ చిన్నపనైనా చెయ్యడానికి సిద్ధపడుతారు.

అమెరికా సమాజంలో ఉద్యోగికి, పనివారికి ప్రతిష్ట, అప్రతిష్ట అనే అంతరం లేదు. అందుకే ఇక్కడ మారాల్సింది “సామాజిక  దృక్పధం” - దొంగతనం, అడుక్కోవడం తప్ప ఏ పని చేసినా తప్పు లేదు. అన్ని పనులు గొప్పవే.

మీ మనసుకు నచ్చిన పని క్షేత్రం - ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్  ఎంచుకోవలసిన అవసరం ఉంది. అతి చిన్న ఉద్యోగమైనా పరవాలేదు. చేతి నిండా పని ఉండాలి, ఎంతో కొంత ఆదాయం ఉండాలి. చేస్తున్న పనిపై మనసు లగ్నం చెయ్యాలి. అంచెలంచెలుగా ఎదగాలి. పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలి. “పాన్ షాప్” నడిపినా పరవా లేదు. “కర్రీ షాప్” నడిపినా పరవా లేదు.

అలాంటి చోట "మీరే రాజు - మీరే మంత్రి" “డిప్రెషన్” అనవసరం. ఆత్మ విశ్వాసం, కృషి, పట్టుదల, మారిన పరిస్థితులకు అనుగుణంగా మారడం కావలసింది ఇదే నేటి ప్రాథమిక అవసరం.





హెచ్ -1బీ పై తాజా వెసులుబాటు...ఎన్నారైల ఓట్లకు కృతజ్ఞత చూపించాడుగా..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

రాధే శ్యామ్ పరమహంస సీక్రెట్ బయటపెట్టిన కృష్ణంరాజు !

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ యువ‌త జాగృతం కావాలి.. రాజ‌కీయాల‌కు చేరువ అవ్వాలి..!

హెరాల్డ్ సెటైర్ : రాజకీయ యాత్రలతో రచ్చ చేస్తున్న ప్రతిపక్షాలు

ఆర్థిక కష్టం.. టిడిపికి ఎంతో నష్టం ?

జగనోరు చులకనవుతున్నారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Parisa Rama Krishna Rao]]>